శ్లోకము - 32-35
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేని వా |
యేషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ||
త ఇమేవస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వాధనాని చ |
ఆచార్యా! పితరః పుత్రాస్తథైవ చపితామహాః ॥
మాతులాః శ్వశురాః పొత్రాః శ్యాలాః సంబంధినస్తథా |
ఏతాన్న హన్తుమిచ్చామి ఘృతోపి మధుసూదన ||
అపి తైలోక్య రాజ్యస్య హీతోః కిం ను మహీకృతే |
నిహత్య ధార్తరాష్ట్రానః కా ప్రీతిః స్యాజ్జనార్ధన ||
కిం - ఏమి లాభము; నః - మాకు; రాజ్యేన - రాజ్యము; గోవింద - ఓ కృష్ణా; కిం - ఏమి; భోగైః - సుఖము; జీవితేన వా - జీవితమైనా; యేషాం - ఎవరి; అర్థే - కొరకైతే; కాంక్షితం - కోరబడినదో; నః - మాచే; రాజ్యం - రాజ్యము; భోగాః - భౌతికభోగము; సుఖాని - సుఖము; చ - కూడ; తే - వారందరు; ఇమే - ఇవి; అవస్థీతాః - నిలిచి ఉన్నారు; యుద్ధే - యుద్ధరంగంలో; ప్రాణాన్ - ప్రాణాలను; త్యక్త్వా - విడిచి; ధనాని - సంపత్తులను ; చ - కూడ; ఆచార్యాః - గురువులు; పీతరః - తండ్రులు; పుత్రాః - కుమారులు; తథా - అలాగే; ఏవ - నిశ్చయముగా; చ - కూడా; పితామహాః - తాతలు; మాతులాః - మేనమామలు; శ్వశురాః - మామలు; పౌత్రాః - మనుమలు; శ్యాలాః - బావమరుదులు; సంబంధినః - బంధువులు; తథా - అట్లే; ఏతాన్ - వీరందరినిచంపాలని; న ఇచ్చామి - నేను కోరుకోను; ఘృతః అపి - చంపబడినా; మధుసూదన - ఓ మధుదానవ సంహారీ (కృష్ణా); అపి - అయినా; త్రైలోక్య - ముల్లోకాల; రాజ్యస్య - రాజ్యమును; హీతోః - పాందినా; కిం ను - చెప్పేదేమున్నది; మహీకృతే - ధరిత్రి కొరకు; నిహత్య - చంపి; ధార్తరాష్ట్రాన్ - ధృతరాష్ట్రుని పుత్రులను; నః - మాకక; కా - ఏమి; ప్రీతిః - ఆనందము; స్యాత్ - కలుగుతుంది; జనార్దన - ఓ సకలజీవులను పోషించేవాడా.
ఓ గోవిందా! మేము ఎవరి కొరకైతే రాజ్యమును, సుఖమును, చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ మధుసూదనా! గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను, ఆస్తులను త్యజించడానికి సిద్దపడి నా యెదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీని నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జీవపోషకుడా! ఈ ధరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందినా నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడము ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము?
భాష్యము : గోవులకు, ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకలానంద విషయము కనుక అర్జునుడు ఆతనిని "గోవిందా" అని సంబోధించాడు. ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలకు సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలిసికోవాలని సూచిస్తున్నాడు. కాని గోవిందుడు మన ఇంద్రియత్ప్తి కొరకే ఉద్దేశించబడలేదు. అయినా గోవిందుని ఇంద్రియాలను మనము సంతృప్తిపరచడానికి యత్నిస్తే అప్రయత్నంగా మన ఇంద్రియాలు కూడ సంతృప్తి చెందుతాయి. లౌకికంగా ప్రతియొక్కడు తన ఇంద్రియత్నప్తినే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు. కొని భగవంతుడు జీవులు ఎంతవరకు ఆర్హులో అంతవరకే ఇంద్రియత్ప్తిని కలిగిస్తాడు గాని వారు కోరినంత కాదు.
అయినా మనిషి దీనికి విరుద్ధ మార్గాన్ని చేపట్టినపుడు, అంటే స్వీయేంద్రియ తృప్తిని కోరకుండ గోవిందుని ఇంద్రియత్ప్తికి ప్రయత్నించినపుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి. తన జాతి, కుటుంబసభ్యుల పట్ల అర్జునునికి ఉన్న గాఢానురాగము వారి యెడ ఉన్నట్టి సహజ కరుణ కారణంగా కొంత ఇక్కడ ప్రదర్శితమైంది. అందుకే అతడు యుద్ధానికి సిద్ధపడలేదు. ప్రతియొక్కడు తన సంపత్తులను బంధుమిత్రులకు చూపించాలని అనుకుంటాడు. కాని తన బంధుమిత్రులందరు యుద్దరంగంలో వధింపబడతారు కనుక విజయము తరువాత తన సంపదను వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు.
సాధారణమైన లౌకికజీవన గణన ఈ రకంగా ఉంటుంది. కాని ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనది. భక్తుడు భగవంతుని కోరికలను తీర్చాలని కోరుకుంటాడు కనుక భగవంతుడు సమ్మతిస్తే ఆ దేవదేవుని సేవ నిమిత్తమై సకల సంపత్తులను స్వీకరించవచ్చును; భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్లిగవ్వనైనా తాకకూడదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని సంహరించవలసిన అవసరమే ఉంటే కృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతడు అనుకున్నాడు. యుద్ధరంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు అదివరకే సంహరించాడని, తాను కేవలము శ్రీకృష్ణుని చేతిలో పనిముట్టుగా కావలసి ఉన్నదని అర్జునునికి ఆ క్షణంలో తెలియరాలేదు. ఈ సత్యము రాబోవు అధ్యాయాలలో వెల్లడి చేయబడింది.
భగవంతుని సహజభక్తునిగా అర్జునుడు తన దుష్టజ్ఞాతులు, సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. కాని వారినందరినీ వధించడమే భగవంతుని సంకల్పము. భక్తుడెన్నడును దుర్మార్గుని పట్ల ప్రతీకారము చేయడు. కాని భక్తుని పట్ల దుర్మార్గులు చేసే ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించడు. భగవంతుడు తన విషయంలో ఒక వ్యక్తిని క్షమించగలడు, కాని తన భక్తులకు హాని చేసిన ఎవ్వడినీ ఆతడు క్షమించడు. అందుకే అర్జునుడు క్షమించగోరినా దుష్టులందరినీ సంహరించడానికే భగవంతుడు నిశ్చయించుకున్నాడు.
శ్లోకము - 36
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః |
తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్ సబాన్ధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ॥
పాపం - పాపము; ఏవ - నిశ్చయముగా; ఆశ్రయేత్ - చుట్టుకుంటుంది; అస్మాన్ - మాకు; హత్వా - చంపడం వలన; ఏతాన్ - ఈ; ఆతతాయినః - దుర్మార్గులను; తస్మాత్ - కనుక; న అర్హాః - తగువు; వయం - మేము; హస్తుం - చంపడానికి; ధార్తరాష్ట్రాన్ - ధృతరాష్ట్రుని పుత్రులను; స బాంధవాన్ - బంధువులతో పాటు; స్వజనం హి - స్వజనులను; కథం - ఎట్లు; హత్వా - చంపి; సుఖినః - సుఖవంతులము; స్యామ - కాగలము; మాధవ - ఓ కృష్ణా, లక్ష్మీ పతి.
ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది. కనుక ధృతరాష్ట్రుని పుత్రులను, మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు. ఓ కృష్ణా లక్ష్మీ పతీ! స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి, మేమెట్లా సుఖమును పొందగలము.?
భాష్యము : వేదాదేశము ప్రకారము ఆరు రకాల దుర్మార్థులు ఉన్నారు. వారే 1) విషము పెట్టేవాడు, 2) ఇంటికి నిప్పు పెట్టేవాడు, 3) మారణాయుధాలతో దాడి చేసేవాడు, 4) ధనమును కొల్లగొట్టేవాడు, 5) వేరొకరి స్థలమును ఆక్రమించేవాడు, 6) పరస్త్రీని చెరపట్టేవాడు. అటువంటి దుర్మార్గులను వెంటనే వధించాలి. అట్టి దుర్మార్గుల వధచే పాపము కలగదు. అటువంటి దుష్టల వధ సామాన్యవ్యక్తికైనా తగిన కార్యమే, కాని అర్జునుడు సామాన్యవ్యక్తి కాడు. అతడు సాధుస్వభావం కలవాడు కావడం చేత వారి పట్ల సాధుస్వభావముతో వర్తించాలని అనుకున్నాడు. అయినా ఆరకమైన సాధు నడవడి క్షత్రియునికి సంబంధించినది కాదు. రాజ్యపాలన చేసే బాధ్యతాయుతుడైన వ్యక్తి సాధుస్వభావము కలిగియుండవలసినవాడే అయినప్పటికిని పిరికిపంద కాకూడదు. ఉదాహరణకు శ్రీరాముడు ఎంతటి సాధుపురుషుడంటే జనులు ఇప్పటికి రామరాజ్యంలో నివసించాలని ఉవ్విళ్ళూరుతారు. కాని రాముడు ఏనాడూ పిరికితనము చూపలేదు. రావణుడు సీతాదేవిని చెరపట్టి రాముని పట్ట దుర్మార్గముగా ప్రవర్తించాడు. అప్పుడు శ్రీరాముడు ప్రపంచచరిత్రలోనే అసమానరీతిలో అతడికి గుణపాఠము చిప్పాడు, అయినా అర్జునుని విషయంలో ప్రత్యేక రకమైన దుర్మార్గులను, అంటే అతని తాత, గురువు, మిత్రులు, పుత్రులు, మనుషమలు మున్సగువారిని మనిషి గుర్తించవలసి ఉంటుంది, అందుకే అర్జునుడు సాధారణ దుర్మార్గుల పట్ల తీసికోవలసిన తీవ్రమైన చర్యలను వారి పట్ల తాను తీసికోకూడదని అనుకున్నాడు.
ఆంతేగాక సొధువురుములకు క్షమించే గుణము ఉండాలని చెప్పబడింది. సాధువులకు ఆటువంటి నిర్దేశాలు రాజకీయ అత్యవసర పరిస్థితి కంటే ఎంతో ముఖ్యమైనవి. అందుకే రాజకీయ కారణాల కొరకు స్వజనమును వధించడం కంటే ధర్మము, సాధుస్వభావము దృష్ట్యా వారిని క్షమించడమే ఉత్తమమని అర్జునుడు భావించాడు. కేవలము తాత్కాలికమైన దేహసొఖ్యము కోరకు ఆటువంటి సంహారము లాభదాయకమని అతడు అనుకోలేదు. అయినా రాజ్యాలు, వాటి ద్వారా లభించే సౌఖ్యాలు శాశ్వతము కానప్పుడు స్వజననంహారము ద్వారా అతడు తన జీవితమును, నిత్యమోక్షమును ఎందుకు పణముగా పెట్టాలి? అర్జునుడు శ్రీకృష్ణుని మాధవ" (లక్ష్మీ పతి) అని సంబోధించడం కూడ ఈ సందర్భంలో ముఖ్యమైనది. తుట్టతుదకు దురదృష్టాన్ని కలిగించే కార్యంలో తనను లక్ష్మీ పతియైన శ్రీకృష్ణుడు నెలకొల్పవద్దని అతడు తెలియజేయగోరాడు.అయినా శ్రీకృష్ణుడు తన భక్తుల మాట అటుంచి ఎవ్వరికీ ఏనాడూ దుర్గశను కలుగజేయడు.
37-38
యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతనః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహీ చ పాతకం ||
కథం న జ్జేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్ణనార్ధన ||
యది - ఒకవేళ; అపి - అయినా; ఏతే - వారు; న పశ్యన్థి - చూడలేకపోయినా; లోభ - లోభముచే; ఉపహత - ఆవరించబడిన; చేతసః - తమ హృదయాలు; కులక్షయ - కులసంహారము; కృతం - చేయడములో, దోషం - దోషము; మిత్రద్రోహే - మిత్రులతో కలహించడంలో; పాతకం - పాపమును; చ - కూడ; కథం - ఎందులకు, న జ్జేయం - తెలిసికోకూడదు; అస్మాభిః - మేము; పాపాత్ - పాపము నుండి; అస్మాత్ - ఈ; నివర్తితుం - విరమించడం; కులక్షయ - వంశనాశనములో; కృతం - కలిగే; దోషం - దోషమును; ప్రపశ్యద్శిః - చూడగలిగినవారిచే; జనార్ధనః - ఓ కృష్ణా!
ఓ జనార్ధనా! లోభము ఆపరించిన హృదయంతో వీరందరు కులసంహారములో గాని, బంధువులతో కలహించడంలో గాని దోషము చూడలేకపోయినప్పటికీని వంశ నాశనములో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో నెలకొనాలి?
భాష్యము : విరోధిపక్షమువారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయడానికి గాని, జూదమాడడానికి గాని నిరాకరించకూడదు. అటువంటి నియమాలను అనుసరించి దుర్యోధనుని పక్షమువారు పంతమాడిన కారణంగా అర్జునుడు యుద్ధము చేయడానికి నిరాకరించకూడదు. అటువంటి పంతము వలన కలిగే ప్రభావాలను ప్రతిపక్షమువారు గమనించలేకపోతున్నారని ఈ సందర్భంలో అర్జునుడు భావించాడు. అయినా అతడు ఆ దుష్టపరిణామాలను చూడగలిగి ఆ పంతమును అంగీకరించలేకపోయాడు. ఫలితము మంచిదేయైనపుడు నియమము నిజంగా విధి అవుతుంది; కాని ఫలితము విపరీతమైనపుడు ఎవ్వరూ దానికి కట్టుబడరు. ఈ మంచివెడ్డలను ఆలోచించి అర్జునుడు యుద్ధము చేయవద్దని నిశ్చయించుకున్నాడు.
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి » |