శ్లోకము - 23
యోత్య్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్యదుర్భుద్ధేర్యుద్ర ప్రియచికీర్షవః ||
యోత్స్యమానాన్ - యుద్ధం చేయబోయేవారిని; ఆవేక్షే - చూస్తాను; అహం - నేను; యే - ఎవరైతే; ఏతే - వారు; అత్ర - ఇక్కడ; సమాగతాః - సమకూడారో; ధార్తరాష్ట్రస్య - ధృతరాష్ట్ర తనయునికి; దుర్బుద్ధే - దుష్టబుద్ధి కలిగినవాడు; యుద్ధే - యుద్ధములో; ప్రియ - ప్రియమును; చికీర్షవః - చేకూర్చగోరి.
దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరియుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చినవారిని నేను చూస్తాను.
భాష్యము : తన తండ్రియైన ధృతరాష్ట్రుని సహాయ్యంతో దుష్టప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యాన్ని దుర్యోధనుడు అన్యాయంగా ఆక్రమించుకోవాలని చూసాడనేది బహిరంగ రహస్యం. కనుక దుర్యోధనుని పక్షంలో చేరిన వారందరు అతని కోవకు చెందినవారే అయియుంటారు. యుద్దము ప్రారంభము కావడానికి ముందు అర్జునుడు వారిని రణరంగములో చూడాలనుకున్నది వారెవరా యని తెలిసికోపడానికే గానివారితో శాంతిమంతనాలు చేసే ఉద్దేశంతో కాదు. తన వైపే శ్రీకృష్ణుడు ఉన్న కారణంగా విజయము గురించి పూర్తి విశ్వాసముతో ఉన్నప్పటికిని తాను ఎవరితో తలపడాలో వారి బలాన్ని అంచనా వేయడానికి అర్జునుడు వారిని చూడగోరాడనేది కూడ యథారము,
శ్లోకము - 24
సంజయ ఉవాచ
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సీనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||
సంజయః ఉవాచ - సంజయుడు పలికాడు; ఏవం - ఆ విధంగా; ఉక్తః - సంబోధింప బడినవాడై; హృషీకేశః - శ్రీకృష్ణభగవానుడు; గుడాకేశేన - అర్జునునిచే; భారత - ఓ భరతవంశీయుడా; సేనయొః - సీనల; ఉభయోః - రెండు; మధ్యే - మధ్యలో; స్థాపయిత్వా - నిలిపాడు; రథోత్తమం - ఉత్తమమైన రథమును.
సంజయుడు పలికాడు : ఓ భరతవంశీయుడా ! అర్జునునిచే ఆ విధంగా సంబోధించబడినవాడై శ్రీకృష్ణభగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షసేనల మధ్యకు నడిపాడు.
భాష్యము : ఈ శ్లోకంలో అర్జునుడు గుడాకేశునిగా చెప్పబడినాడు. “గుడాక" అంటే నిద్ర అని అర్థము; నిద్రను జయించినవాడు "గుడాకేశుడు" అని పిలువబడతాడు. నిద్ర అంటే అజ్ఞానమని కూడ అర్థము. అంటే శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర, అజ్ఞానము రెండింటిని జయించాడు. పరమ కృష్ణభక్తునిగా అతడు శ్రీకృష్ణభగవానుని క్షణకాలమైనా మరచిపోలేదు. అదే భక్తుని నైజము. మెలకువతో ఉన్నప్పుడు గాని, నిద్రలో ఉన్నప్పుడు గాని భక్తుడు శ్రీకృష్ణుని నామరూపగుణ లీలలను తలచకుండ ఉండలేడు. ఈ విధంగా కృష్ణభక్తుడు కేవలము శ్రీకృష్ణునే నిరంతరము తలుస్తూ నిద్ర, అ జ్ఞానము రెండింటిని జయిస్తాడు. ఇదే కృష్ణభక్తిభావన లేదా సమాధి అని పిలువబడుతుంది. హృషీకేశునిగా, అంటే ప్రతీజీవి ఇంద్రియాలకు, మనస్సుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడు సీనల మధ్య రథమును నిలపమనడంలో అర్జునుని ఉద్దేశాన్నితెలిసికోగలిగాడు. అందుకే ఆతడు ఆ విధంగా చేసి ఇలా పలికాడు.
శ్లోకము - 25
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహేక్షితాం |
ఉపాచ పార్థ పశైయ్య తాన్ సమవేతాన్ కురూనితి ||
భీష్మ - భీష్మపితామహుడు; ద్రోణ - గురువైన ద్రోణుడు; ప్రముఖతః - సమ్ముఖములో; సర్వేషాం - అందరు; చ - కూడా; మహీక్షితాం - భూపాలకులు; ఉవాచ - పలికాడు; పార్ధ - ఓ పృథాకుమారా; పశ్య - చూడుము; ఏతాన్ - వీరందరినీ; సమవేతాన్ - సమకూడిన; కురూన్ - కురువంశీయులను; ఇతి - ఈ విధంగా.
భీమ్మడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు "పార్థా! ఇచట సమకూడిన కురువంశీయులందరినీ చూడు" అని పలికాడు.
భావ్యము : సకల జీవులలోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులో ఏం జరుగుతున్నదో తెలిసికోగలిగాడు. ఈ సందర్భములో ఉపయోగించబడిన హృషీకేశుడనే పదము ఆతనికి సమస్తము తెలుసునని సూచిస్తున్నది. అర్జునుని సంబంధములో పార్ధా, అంటే కుంతీతనయుడు లేదా పృథాతనయుడనే పదము కూడ అదేవిధంగా ప్రాధాన్యమును కలిగి ఉన్నది. పృథా (తన తండ్రియైన వసుదేవుని సోదరి) తనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునునికి చెప్పగోరాడు.
ఇక “కురువంశీయులను చూడు" అని అర్జునునితో పలకడంలో శ్రీకృష్ణుని ఉద్దేశమేమిటి? అక్కడే ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి? తన మేనత్త (పృథా) కుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడూ ఊహించలేదు. ఈ విధంగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్యధోరణిలో ముందుగానే చెప్పాడు.