అయ్యప్ప మకర జ్యోతి విశిష్టత - Ayyappa Makara Jyothi |
వ్యవసాయదారులకు మకర సంక్రాంతి ఎంత ముఖ్యమో, అయ్యప్ప మాల వేసుకున్న భక్తులందరికి మకర సంక్రాంతి రోజు వచ్చే మకర జ్యోతి అంత ముఖ్యం. అయ్యప్ప భక్తులు దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆకాశంలో జ్యోతి దర్శనం కోసం భక్తులు ఏడాదంతా ఎదురుచూస్తారు. అద్భుతం కనిపించగానే భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. సాధారణంగా ప్రతి ఏడాది ధనుర్మాసంలో లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటారు. అయ్యప్పస్వామికి ఎంతో ఇష్టమైన మకర సంక్రాంతి రోజున తాను ఆకాశంలో జ్యోతిరూపంలో దర్శనం ఇస్తానని అయ్యప్పస్వామి చెప్పినట్టు చరిత్ర చెబుతోంది. అందుకే అయ్యప్పస్వామి మాల వేసిన ప్రతి భక్తుడు మకర సంక్రాంతిన శబరిమలలో మకరజ్యోతిని చూడాలని ఆశపడుతుంటారు. మకర జ్యోతి కనిపించే సమయంలో.. సన్నిధానం, ఆ పరిసరాలు ఆశ్రయ మంత్రాలతో అస్పష్టంగా ఉంటాయి.
జనవరి నెలలో ప్రతి ఏడాది శరణకుట్టి ఆరోహణ జరుగుతుంది. ఆసమయంలో మాత్రమే భక్తులకు కలియుగవారదాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ నడక మార్గం ఉదయం 5 గంటలకు తెరుచుకుంటుంది. సాయంత్రం ఐదున్నర గంటలకు గణపతి హోమం జరుగుతుంది. మరుసటిరోజు ఉదయం ఆరున్నరగంటలకు రాజ కుటుంబ సభ్యుల దర్శనం తరువాత హరివరసాన గానంతో ఊరేగింపు ముగించడంతో, మకరవిలక్కు పండుగ కూడ ముగుస్తుంది.
అయ్యప్పస్వామికి ఎంతో ఇష్టమైన బంగారు నగలు తీసుకెళ్లే తిరునాభరణం కార్యక్రమాన్ని పందలంలోని వయియాకోయక్కల్ ధర్మస్థ ఆలయం నుంచి ప్రారంభమై, మకర సంక్రాంతి నాటికి అయ్యప్పస్వామి సన్నిధానానికి ఈ ఊరేగింపు చేరుకోనుంది. మకరజ్యోతి దర్శనం సందర్భంగా శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కావున సంక్రాంతి రోజే భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శబరిమల చరిత్రలోనే ఇదే మొదటిసారి. మకరసంక్రాంతిన నిరాడంబరంగా పూజలు జరుగడం. మకర సంక్రాంతి పూజలు, మకర జ్యోతి దర్శనం అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.
శబరిమలలో ఆలయంలో సంక్రాంతి రోజున స్వామివారికి జరిగే మకరవిలక్కు, మహాదీపారాధనకు మరియు తిరుభరణంతో అలంకరించిన స్వామివారి ఊరేగింపు వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు ఆలయ బోర్డు చేస్తుంది. సంక్రాంతి రోజు తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు నిర్మల్య దర్శనం ప్రారంభం అవుతుంది. తర్వాత మండపంలో గణపతి హోమం జరిగుతుంది. ఉదయం ఏడున్నరకు ఉషా పూజ జరిగుతుంది. స్వామివారికి నిర్వహించే మకరసంక్రమణ పూజకు ప్రత్యేకత ఉంది. స్వామివారికి అభిషేకం కోసం రాజ్యం నుంచి ప్రత్యేకంగా కొబ్బరికాయలు, నెయ్యి తెప్పిస్తారు. పూజ తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కాలినడక మార్గం మూసి, తిరిగి సాయంత్రం 5 గంటలకు తెరిచి, 5:15 గంటలకు దేవస్థానం ప్రతినిధులు శారాంకుతికి వెళ్లి తిరుభరణ ఉరేగింపునకు స్వాగతం పలుకుతారు. ఆరున్నరకు మకరసంక్రాంతి సందర్భంగా తిరువభరణంతో దీపారాధన జరుగుతుంది. దీపారాధన ముగింపులో, మకరవిలక్కు పొన్నంబలం వద్ద వెలిగిస్తారు. తర్వాత ఎంతో అద్భుతమైన ఘట్టం. మకర జ్యోతి ఆకాశంలో కనిపిస్తుంది.
__గ్రేట్ వరంగల్