శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధి దేశం మొత్తం కూడా ఫిబ్రవరి 27వ తేదీ వరకు కూడా జన జాగరణ ఉద్యమంగ జరిగినది. ఆ శ్రీరామనిధి సమర్పణ ముగింపు సందర్భంగా సంస్కార భారతి ఆధ్వర్యంలో,మర్యాదా పురుషోత్తముడు, ఆ దేవదేవుడు శ్రీ రామచంద్రమూర్తికి ” స్వర సమర్పణ” పేరుతో శ్రీరామనిధి సమర్పణ ముగింపుఉత్సవం మరియు భరతముని సంస్మరణ దినోత్సవంమార్చి 1,2021,సోమవారం సాయంత్రం 6 30 గంటలకు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణం లో జరిగింది . ఇటీవల విజయవాడ నుండి పద్మశ్రీ పురస్కారం ప్రకటింపబడిన నాదసుధార్ణవ శ్రీ అన్నవరపు రామస్వామి గారు జ్యోతి ప్రకాశనం చేసి కార్యక్రమం ప్రారంభించారు.
శ్రీశ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారు, ఉత్తర పీఠాధిపతి, శ్రీ భువనేశ్వరి పీఠం, గన్నవరం, కృష్ణా జిల్లా అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ తనికెళ్ళ సత్య రవి కుమార్, ప్రాంత కార్యదర్శి, విశ్వహిందూ పరిషత్, ఉత్తరాంధ్ర ప్రధాన వక్తగా పాల్గొన్నారు. త్యాగరాజ స్వామి, భక్త రామదాసు, అన్నమయ్య మొదలయిన వాగ్గేయకారులు రచించిన ప్రముఖ శ్రీ రామభక్తి కీర్తనలతో 40మందికి పైగా గాయనీ గాయకులచే “స్వర సమర్పణ” గంటన్నర పాటు జరిగింది.
1)పలుకే బంగారమాయెనా 2)శ్రీరామ నీ నామమేమి 3)రాముని మరవకవే మనసా 4)పాహి రామప్రభో పాహి 5)చూడగల్గెను రాముని 6)రామభద్ర రారా శ్రీరామచంద్ర 7) నగుమోము గలవాని 8)రామచంద్రుడితడు 9)రామ కోదండ రామ 10)తక్కువేమీ మనకూ 11)రామచంద్రాయ జనక రాజజామనోహరాయ మొదలైన గీతాలు ఆలపించారు.
పాల్గొన్నకళాకారులు : 1) శ్రీమతి నెమలికంటి జ్యోతి 2) శ్రీమతి G. సత్యవతి 3) శ్రీమతి డా.G.పల్లవి 4) కుమారి దీపిక 5) శ్రీమతి హరిత 6) శ్రీమతి గుమ్ములూరి సూర్యకాంతి 7) శ్రీమతి వి.జానకి 8) శ్రీమతి M. సరస్వతీ దేవి 9) శ్రీమతి రమ్య 10) శ్రీమతి ఆదుర్తి సుహాసిని 11) శ్రీమతి Ch. సీతారత్నం M. A.(music) 12) శ్రీమతి కనకదుర్గ 13) శ్రీమతి పద్మావతిదేవి 14) శ్రీమతి Bh.కామేశ్వరి 15) శ్రీమతి కౌతా నాగలక్ష్మి 16) శ్రీమతి సుసర్ల నందిని శ్రీనివాస్ 17) శ్రీ మాడభూషి వెంకట శేషుబాబు 18) శ్రీమతి కానూరి పద్మావతి 19) శ్రీమతి ఉదయ లక్ష్మీ 20) శ్రీమతి ముద్రాడి శారద వనజశ్రీ 21) శ్రీమతి వసుంధర 22) శ్రీమతి సింగం ఫణి భారతి 23) శ్రీమతి G. S. V. స్వర్ణలత 24) శ్రీమతి నాగ పూజిత 25) శ్రీమతి గొల్లమూడి అనురాధ 26) శ్రీ గొల్లమూడి పూర్ణేందు శంకరం 27) శ్రీమతి సిహెచ్. శ్వేతా కల్యాణి 28) శ్రీమతి K.విద్యాధరి 29) శ్రీమతి రాధికా సుబ్రహ్మణ్యం 30) శ్రీమతి వెంపరాల రామలక్ష్మి శాస్త్రి 31) శ్రీమతి I. సత్యవతి
__విశ్వ సంవాద కేంద్రము