పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో ఒక టీవీ చానెల్లో పనిచేస్తున్నజర్నలిస్టును కొంత మంది ఇస్లాం మతోన్మాదులు అతి దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అందుకు కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం…….
అజయ్ లాల్వానీ(31) ఒక టీవీ చానెల్, ఒక ఉర్దూ వార్త పత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. ఇస్లాం మతోన్మాదులు చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అజయ్ లాల్వానీ గత కొంత కాలంగా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల పాకిస్థాన్ లో 117 మంది హిందూ బాలికలను అపహరించి వారికి ముస్లింలతో వివాహం చేసి మత మార్పిళ్లకు పాల్పడుతున్న షరీఫ్, అబ్దుల్ హక్ అలియాస్ మియాన్ మిథు ల ముఠాను అజయ్ బహిర్గతం చేశారు.
ఒక వారం క్రితం, బహల్కాని తెగకు చెందిన కవితా బాయి అనే హిందూ అమ్మాయిని అపహరించి ముస్లిం వ్యక్తితో వివాహం చేసి ఇస్లాం మతంలోకి మార్చారు. అజయ్ లాల్వానీ ఈ కథనాన్నివెలుగులోకి తీసుకొచ్చి పత్రికలో ప్రచురించారు. దాదాపు అన్ని మీడియా సంస్థలూ ఈ కథనాన్ని ప్రచురించాయి. దీంతో ఆ బాలిక అపహరణకు సంబంధించి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. తమపై కేసు నమోదవడానికి కారకుడైన జర్నలిస్టు అజయ్ లాల్వాని అంతం చేయాలని మియాన్ మిథు నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సెలూన్లో క్షవరం చేయించుకుంటున్న సమయంలో అజయ్ లాల్వానీని కొంతమంది గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపారు.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి ) కి చెందిన మియాన్ మిథు 2008లో ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వాకు ఇతనికి మంచి సంబంధాలున్నట్టు కూడా సమాచారం. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా 2015లో తన పార్టీలో చేరమని మియాన్ మిథును ఆహ్వానించాడు.
మియాన్ మిథు 2019 లో హోలీ రోజున పాకిస్తాన్ సింధ్ లోని ఘోట్కి ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. మియాన్ మిథు ఎంతో మంది హిందూ బాలికలను అపహరించి వారిని మతం మార్చాడు. ఈ విషయంపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ కు లేదా కోర్టులకు వెళ్లినా కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న కారణంగా న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ మియాన్ మిథు అనేక కుట్రలకు పాల్పడుతున్నాడు.
2016 లో అనిలా బాగ్రి అనే హిందూ అమ్మాయిని సాక్షత్తూ పోలీసు అధికారియే రూ .50 వేలకు ఒక ముస్లిం వ్యక్తికి అమ్మిన విస్తుపోయే ఘటన జరిగింది. ఘోట్కి జిల్లాకు చెందిన అనిలా బాగ్రిని కొంత మంది దుండగులు అపహరించగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ బాలికను పోలీసులు గుర్తించారు. కానీ బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి పోలీసు స్టేషన్ అధికారి అయిన సజ్జాద్ ఖాజీ రూ.50వేలను డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ బాలికను జాఫర్ మసూరికి అనే వ్యక్తికి అప్పగించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా మతం మార్చి మసూరిని వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనలో మియాన్ మిథుది కీలక పాత్ర.
పాకిస్తాన్లో హిందువులు, ఇతర మైనారిటీలు పాఠశాల, ఉపాధి, క్రీడల్లో ఇలా అన్ని రంగాలలో వివక్షను ఎదుర్కొంటున్నారు. హిందూ దేవాలయాలపై అనేక సంవత్సరాలుగా దాడులకు పాల్పడున్నారు. 1947 నుండి పాకిస్తాన్ లో హిందూ జనాభా బాగా తగ్గింది. 1947లో పాకిస్తాన్ లో హిందూ జనాభా 20% గా ఉంది, కానీ ఇప్పుడు అది కేవలం 1.85% మాత్రమే. పాకిస్తాన్లో హిందూ శరణార్థులు తమ మనుగడ కోసం పోరాడుతుండగా రోహింగ్యా ముస్లింలు, ఇతర అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు భారతదేశంలో చోటు కల్పించాలంటూ భారత్ లోని కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం గమనార్హం.
Source : TFI POST & VSK TELANGANA - విశ్వ సంవాద కేంద్రము