vastu |
మనిషి సుఖసంతోషాలతో, పిల్లాపాపలతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే అతనికి నివాసయోగ్యమైన ఒక ఇల్లు కావాలి అటువంటి ఇంటిని నిర్మించుకోడానికి ఉపయోగపడేదే వాస్తుశాస్త్రం!
ఎందరో మహర్షులు తపోధనులు వాస్తు శాస్త్రాన్ని ఏనాడో మనకి అందించారు. అంత గొప్పదైన వాస్తుశాస్త్రాన్ని సూక్ష్మీకరించి అందరికీ అర్ధమయ్యే రీతిలో సూక్ష్మీకరించి మేము అందిస్తున్నాము. వాస్తుబలం సరిగ్గా ఉంటే ఆ యింటి యజమాని మాత్రమేగాక ఆ యింట్లో ఉన్న వారందరూ సుఖ సంతోషాలతో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి వాస్తుకి సంబంధించిన సూచనలను అనుసరించి మీ యింటి అవసరమైన మార్పులు - చేర్పులు చేసుకుని మీరు సర్వశుభాలతో, నుఖాలతో ఆనందంగా ఉండగలరని ఆశిస్తున్నాము.
ఎత్తుపల్లాలు !
- నైరుతి దిశ ఎత్తుగా ఈశాన్యం పల్లంగా వుండే స్థలాలు ఉత్తమమైనవి.
- దక్షిణం ఎత్తుగా ఉత్తరం పల్లంగా వుండే స్థలాలు కూడా మంచివే.
- పశ్చిమం ఎత్తు తూర్పు పల్లంగా వుండే స్థలాలు కుటుంబ సౌఖ్యాన్నిస్తాయి.
- ఉత్తరం ఎత్తుగా దక్షిణం పల్లంగా వుండే స్థలాలు ఎక్కువసార్లు అమ్ముడుపోతుంటాయి.
- తూర్పు ఎత్తుగా, పశ్చిమం పల్లంగా వుండే స్థలం అంతగా మంచిదికాదు.
- ఈశాన్యం ఎత్తుగా, నైరుతి పల్లంగా వుంటే అశుభాలు జరుగుతాయి.
- ఉత్తర వాలున్న స్థలంలో నైరుతి ఎత్తుగా వుండి ఆగ్నేయం / వాయవ్యం / ఈశాన్యం ఒకదానికన్నా ఒకటి పల్లంగా వుంటే అది ఉత్తమమైన స్థలంగా చెప్పవచ్చును.
పడకగది !
- నైఋతిలో పడకగది వుండాలి.
- ఈశాన్యములో ఎటాచ్డ్ టాయిలెట్ వుండరాదు.
- ద్వారానికి మంచం అడ్డంగా వుండరాదు.
- మంచానికి తూర్పు - ఉత్తరం వైపున ఎక్కువ ఖాళీ వదలాలి.
- ఉత్తర వాయవ్యం / దక్షిణ ఆగ్నేయం వీలైనంత తగ్గించుకుంటే ఆ ఇంట్లోని సభ్యులందరూ పరస్పరం అన్యోన్యంగా వుంటారు.
దిశా ఫలితములు !
తూర్పు దిశ :
» ఇంటికి తూర్పు దిశలో ఖాళీ స్థలము ఎక్కువగా ఉన్నట్లయితే పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, మంచి ఆరోగ్యవంతులుగా జీవించుదురు.
» ఇంటికి తూర్పు దిశలో ఖాళీ స్థలము ఎక్కువగా ఉన్నట్లయితే పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి, మంచి ఆరోగ్యవంతులుగా జీవించుదురు.
» ఇంటికి తూర్పున వాలువసారాలు, వరండాలు ఖాళీగా ఉంచి గృహ నిర్మాణము చేసినచో, ధన ధాన్యవృద్ధి, సంతానవృద్ధి కలుగును.
» తూర్పు సింహద్వారం కలిగిన గృహములో నివసించేవారికి సంఘంలో పలుకుబడి, గౌరవం కలుగుతుంది.
పశ్చిమ దిశ :
» పశ్చిమభాగము ఎత్తుగాను, తూర్పు పల్లముగా ఉంటే, అందున్నవారు అంతస్థుకు తగిన హోదాగల వృత్తులలో హుందాగా జీవింతురు.
» పశ్చిమ భాగములోని అరుగులు గర్భముకంటె మెరకగా ఉంటే, ఆదాయాభివృద్ధి, స్థిరచరాస్తులు అభివృద్ధి చెందుతాయి.
» ఒకే గృహములో తూర్పు ఒక వాటా, పడమర ఒక వాటాగా ఉంటే, పడమరవైపు వాటా తూర్పువాటా కంటే తక్కువ శ్రేయస్కరమని గుర్తించాలి.
ఉత్తర దిశ :
» ఉత్తరదిశ ఈశాన్యముకంటె మెరకగాను, మిగిలిన దిశలకంటె పల్లముగా వుంటే తరగని సిరిసంపదలు పొందుతారు. స్త్రీలకు సుఖశాంతులుంటాయి.
» ఉత్తరదిశలో ఈశాన్యములో దరవాజాలు, ప్రహారీ గేటులున్నచో సంపన్నులగుదురు.
» ఉత్తరదిశలో ఆనుకునియున్న స్థలములు కొంటే తరతరాలు సిరిసంపదలతో తులతూగుతారు.
» ఉత్తరభాగములోని పల్లపు పందిర్లు, పల్లపు పశుశాలలు భూ ధన సంపదలను స్థిరాస్తులను అభివృద్ధి చెందిస్తాయి.
» ఉత్తరదిశలో నీటి తూములు, నీటి కాలువలు, బావులు వుంటే ఆ వీధిలో అందరికంటె ఐశ్వర్యముగా జీవిస్తారు. పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.
దక్షిణ దిశ :
» దక్షిణదిశలో ఇంటి కంటే మెరకగల అరుగులున్నచో ధనధాన్య సంపత్తులు ఆయురారోగ్యములు కలుగును.
» దక్షిణదిశలో అరుగులు గర్భముకంటె మెరకగా ఉన్నచో ఆర్థికాభివృద్ధి ఆరోగ్యము, స్థిరాస్తి పెరుగుదల, చుఱుకుదనము కలుగును.
» దక్షిణదిశలో తన స్థలమునంటి ఉన్న స్థలములు ఉచితముగా సంక్రమించినను గృహ నిర్మాణానంతరము కలుపరాదు.
వాస్తు వాస్తవాలు !
- ఈశాన్యంలో నుయ్యి, బోరింగ్, కుళాయి శుభం చేకూర్చును.
- ఈశాన్యంలో గదికి ఒక ప్రవేశద్వారము, ఒక నిష్క్రమణ ద్వారము ఉండవలెను.
- ఈశాన్యంలో రాళ్ళు, ఇనుప సామాగ్రి, ఇతర బరువైన వస్తువులు వుంచితే అపకీర్తి కలుగును.
- ఈశాన్యం-తూర్పున పూజగది శ్రేయస్కరం. తూర్పు-పడమర దిశల్లో స్నానాలగది మంచిది.
- దేవునిగది ఏ దిశలో వున్నా, పూజచేయువారు తూర్పు చూస్తూ కూర్చుని పూజచేయుట ఉత్తమం
- నైఋతిలో సామానుల గది మంచిది. పడమర, ఉత్తర దిశల్లో భోజనాల గది ఉత్తమం.
- పశ్చిమ, నైఋతి దిశల్లో పఠన మందిరం, కార్యాలయం శ్రేయస్కరం.
- ధనం, నగలు విలువైన ఆస్తిపత్రాలు ఇంటికి నైఋతి భాగంలో కట్టిన గదిలో ఉతరదిశను చూస్తుండే బీరువాలో లేక ఐరన్ సేఫ్లోగాని భద్రపరుచుకుంటే ధనాభివృద్ధి.
- పరుండేటప్పుడు తూర్పు-దక్షిణ-పశ్చిమ దిశలలో తలదిండ్లు అమర్చుకుని పడుకోవాలి.
- శపడకగదిలో మంచాలు దక్షిణ-పడమర-ఉత్తర-నైఋతి-వాయవ్యాలలో వేసుకోవాలి.
- శఇంటికి పెద్దవారు నైఋతి దిశలోనే నిద్రపోవడంవలన వారు ఆనందంతో పాటు ఆరోగ్యంగానూ వుంటారు.
- డబ్బు దాచే బీరువాలు తూర్పు, ఉత్తరదిశకు అభిముఖంగా వుండాలి. ఇవి నైరుతి భాగంలో వుండాలి. ఈశాన్యభాగంలో వుంటే ఆర్థికనష్టం తప్పదు.
- వంటగది ఆగ్నేయంలో వుంటే సర్వశ్రేష్ఠం. వాయవ్యంలో వుంటే అతిథులు ఎక్కువగా వస్తారు, ఖర్చులుకూడా అధికమగును.
- గృహమునందు కరెంట్ మీటర్లను, జనరేటర్లను ఈశాన్యములో పెట్టుట దోషము. అగ్నేయ, దక్షిణ భాగములు మంచివి.
- ఓవర్ హెడ్ ట్యాంకు ఇంటికి కప్పుపైన నైరుతిమూల నిర్మించాలి.
- ఆ అండర్‌గ్రౌండు వాటర్‌ట్యాంక్ స్థలము ఈశాన్య దిశలోనే ఉంచడం శ్రేయోదాయకము.
- గృహానికి పశ్చిమ, దక్షిణాలలో ఖాళీస్థలం ఎక్కువగా వుంటే నిర్మించడం ఉత్తమం.
- తూర్పు, ఉత్తరం రోడ్లు గృహావరణ కన్నా ఎత్తుగా వుండకూడదు. దక్షిణం పశ్చిమం రోడ్లు గృహావరణకన్నా ఎత్తుగా వుండవచ్చు.
- ప్రిజ్‌లు, టీ.వీలు రేడియోలు మొదలగునవి వీలయినంతవరకు వాయవ్య దక్షిణ, నైరుతి దిశలయందు వుంచుట మంచిది.
- స్టోర్ రూమ్‌గా నైరుతి గది వాడుకొనవచ్చును. ఈశాన్యముగదిని స్టోర్ రూమ్‌గా వాడిన కష్టనష్టములు కలుగును.
- నీటి తొట్లు తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశలలోనే ఉండాలి.