Haridwar |
: పవిత్ర పుణ్యస్తలం హరిద్వార్ :
హరిద్వారము :
భారతదేశంలో అతి పవిత్రస్థలాల్లోన్న ఒకటిగా పేర్కొనబడింది. శివాలిక్ పర్వత పాదాలవద్ద పావనగంగా కుడివైపు తీరంలో అమరియు పుణ్యస్థలం. సప్తమోక్షదాయక పురాణాల్లో ఒకటి. దీనినే మాయాపురి, గంగాద్వారం అనే నామంతరాలతో పిలుస్తారు. శైవులు హరద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, , భక్తిమేర పిలుచుకొంటూ ఉంటారు. మొత్తం మీద హిందువులకు అతి పవిత్రస్థలం-ముఖ్య యాత్రాస్థలం. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో గొప్ప సుందర నగరంగా ప్రశస్తిని పొందింది.
మహామహుడైన కపిలస్థాన్ పురాతన ప్రసిద్ది. ఒకప్పుడు ఎంతో విశాలమై మైళ్ళ పొడవున వ్యాపించియున్న మహా పట్టణంగా కీర్తించబడి ఉన్నది. ఈ విషయ అబుల్ఫజల్ తన గ్రంధములో వ్రాసారు. ఈయన అక్బరు కాలంలో ఈ పట్టణ సందర్శనం చేశారు. పావన గంగా నది హిమాలయ పర్వత లోయలగుండా తన మార్గం సుగమం చేసికొని హరిద్వారంవద్ద సమతల ప్రదేశంలో ప్రవేశిస్తూ (హరి) హరద్వారంగా తన నామాన్ని సార్ధకం చేస్తుంది. ప్రపంచ ప్రసిద్ది చెందిన కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు అవతరించే గంగా పుష్కర సమయంలో విశేషంగా జరుగుతుంది.
బ్రహ్మ కుండు :
గంగా తీరస్నాన ఘట్టాలలో అతి పవిత్రమైనది, ముఖ్యమైనది, పావన గంగ శ్రీ మహా విష్ణువు పాద స్పర్శచే పునీతమైన స్వచ్చ జలాలు ఇక్కడ ప్రవహించటం ఒక గొప్ప విశేషం. శ్రీహరి పాదాలను నిక్షేపం చేస్తూ ఒక ఆలయం కూడా ఉంది. బిర్లా సంస్థ ఈ రేవును అతి సుందరంగా తీర్చిదిద్ది యాత్రికుల మనోహ్లాదానికి మరింత చేరువ చేశారు. ఈ స్వచ్ఛ జలాల్లో చేపలు తండోప తండాలు, యాత్రికులు వాటికి ఆహారాన్ని వేస్తూ ఆనందిస్తారు. శ్రీ మహా విష్ణువు అవతారాల్లో మత్స్యావతారం కూడా విశేషమే కదా! చనిపోయినవారి అస్తికలు ఇక్కడ నిమజ్జనం చేస్తుంటారు. 10-15 సొగసైన ఆలయాలు దర్శనీయాలు. ఇక్కడి ఈ జలాలను పట్టుకుని పవిత్రంగా తీసుకెళ్తారు యాత్రికులు. గంగా తీరంలోని కుశావర్తం దగ్గర శ్రాద్ద విధులను నిర్వహిస్తారు యాత్రికులు.
ముఖ్య మందిరాలు:
గంగ, గాయత్రి, లక్ష్మీ నారాయణ, బ్రహ్మ, సత్యనారాయణ స్వామి, గణేశ ఆలయాలు వగైరాలు. అన్నింటిలోనూ మరీ ముఖ్యమైనవి మయాదేవి, వల్వకేదారు బహాదేవు ఆలయాలు చాలా ముఖ్యం. ఇక్కడ కాషాయ వస్త్రాలు ధరించిన సాధు పుంగవులు, మునివరులు విశేషంగా దర్శనమిస్తారు.
కన్ ఖాల్:
హరిద్వార్ స్టేషనుకు 4 కి.మీ.దూరంలో ఉన్నది. చాల పురాతనమైనది, పురాణ ప్రసిద్దమైనదిగానూ ప్రాచుర్యం పొందినది. దక్ష మహధ్యరం జరిగిన చోటు దక్ష ప్రజాపతి ఆలయం కూడా ఉంది. ప్రక్కనే సతీకుండం ఉంది. వీనికి తోడు దక్షిణేశ్వర, మహావీరాంజనేయ ఆలయాలున్నవి. ఇక్కడి గంగా స్నానఘట్టాన్ని అగ్ని కుండమంటారు. ముఖ్యమైనది రామఘాట్ చాల పవిత్రమైనదిగా భావించబడుతూంది. ఇక్కడ జరిగిన పురాణకథ చాలా విశేషం. ఈ కథతో అనేక ఇతర పవిత్ర స్థలాలకు సంబంధం ఉండటం గమనార్హమైన విశేషం.
దక్ష ప్రజాపతి ఆడంబరంగా ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. అందరు అల్లుండ్రను ప్రత్యేకంగా ఆహ్వానించి స్వాగతసత్కారాలు చేశాడు.అయితే వీరిలో తన మాట వినని సతీదేవికిగాని, మహాశివునికి గాని పిలుపేలేదు. అయినా పుట్టింటిమీది మమకారంతో భర్త కాదని అంటున్నా సతీదేవి యజ్ఞాన్ని చూడటానికి పిలువని పేరంటానికి వెళ్ళింది. సతీదేవిని సమాదరించటం పోయి దక్షుని మనస్సు క్రోధాగ్ని కీలలకు నిలయమై ఆగ్రహించి శివుని దుర్భాషలాడాడు. భర్తృ దూషణం సహించలేని సతీదేవి యజ్ఞకుండంలో దూకి ఆత్మాహుతి గావించబడుచున్నది. ఈ వార్త మహాదేవుని చేరింది. ఆయన కాలాగ్నిరుద్రుడే అయినాడు. క్రోధాగ్నితో దహించుకునిపోతున్న శివుడు తన జటాఝూటంలోని ఒక పాయను తీసి నేలమీద విసరికొట్టాడు. ప్రమధగణాల ఉద్భవం జరిగింది, వీరభద్రుడు నాయకుడై ఈ ప్రమధగణాలో దక్షుని ఇంటికివెళ్ళి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసారు మహా భీభత్సంగా. అనంతరం మృతురాలైన సతీదేవి దేహాన్ని తన భుజాల మీద వేసికొని శోక తప్త హృదయంతో ప్రళయాగ్నిని సృష్టిస్తూ లోకాలన్నీ కసిమసిగా కలయ తిరుగు నారంభించాడు. ఈ పరితాప వేదన చూసిన శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. సతీదేవి దేహం 52 శకలాలుగా చేధించబడి అనేకచోట్ల చెల్లా చెదురుగా పడిపోయాయి. ప్రతి శకలం పడినచోట ఒక్కొక్క శక్తిపీఠం వెలసి పవిత్రమైన ఆలయాలు పుణ్యస్థలాలుగా వెలశాయి. వీటిలో భాగంగానే నేటి మహానగరం కలకత్తాకూడా ఒకటిగా చెప్పబడింది.
బహుశా ఆనాటినుండే ఈ ఉదంతాన్ని పురస్కరించుకుని సతీ సహగమనం వ్యాప్తిలోకి వచ్చి సదాచారంగా భావించబడి చివరకు హిందూ మత చాందస ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. ఆశయం ఏదైనా దురాచార సంప్రదాయంగా మారటమే గర్వించదగిన విషయం మానవత్వానికి గొడ్డలిపెట్టు.
ఇక్కడ చూడదగిన - దర్శనీయ స్థలాలు:
- భీమగోడా: హరిద్వారానికి ఉత్తరంగా సుమారు 2 కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడి నుండే పాండవుల అంతిమయాత్ర మహాప్రస్థానం గావించారని ప్రతీతి. ప్రాణాయామంతో తమ స్వర్గారోహణం చేశారని భారతకథ చెప్తుంది.
- బిల్వకేశ్వరాలయం: ఊరికి పడమరగా చిన్న కొండమీద బిల్వవనాంతరంగా అమరియున్న ఆలయం. ప్రక్కనే గౌరీకుండం ఉన్నది. రమణీయమైన ప్రకృతి శోభతోనిండి ఈ చేటనే గృహాంతరంలో దుర్గాదేవి ఆలయం అమరి ఉన్నది. దగ్గరిలోనే చండీ పర్వతం గంగానదికి ఆవలితీరంలో ఉన్నది. భయంకరమైన అడవి ప్రాంతం. క్రూరమృగ సంచారం హెచ్చుగాగల ఈ కొండమీదనే చండీ ఆలయం, నీలేశ్వరాలయం, మానసాదేవి ఆలయాలున్నాయి చూడవచ్చు.
- ఇంకా ఈ ప్రదేశంలో దర్శనీయమైనవిగా గంగాజీ మందిర్, గోవూఘాట్, చౌబీస్ అవతార్, మాయాదేవి, ఆశాదేవి, మాయాపూర్, సప్తసరోవర్, నహర్గంగ మొదలయినవి వాసికెక్కినవి.
మూలము: మాధవి చౌదరి F