Guava |
జామకాయకి ప్రత్యేకమైన పరిచయం అక్కరలేదు. జామకాయ ప్రతీ ఇంటిలోనూ, ప్రతీ వారికి సుపరిచితమైన ఔషధం. జామ ఆకులు, కాయలు, పండ్లు, బెరడు అన్నీ ఆయుర్వేద ఔషధంగా పనికి వస్తాయి. ఆకులు నీళ్ళతో కలిపి కషాయంగా కాచుకొని తాగితే బీ.పీ., శుగర్, కడుపులో నూలు పురుగులు అన్నీ మటుమయ మవుతాయి.
జామకాయలలో ఎంతో పీచు పదార్థం ఉంటుంది. దానివలన మలబద్ధకం ఉండదు. బరువు తగ్గాలనుకున్న యువతీ యువకులు ఈ పండును నిశ్చింతగా తినవచ్చును. ఎందుకంటే విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ ఎంతో అధికంగా లభించే పండు. అదీ కాకుండా కొలస్ట్రాల్ ఫ్యాట్ లేని చక్కటి ఔషధం. ఈ జామకాయలో విటమిన్-సి నారింజ పండు కంటే కూడా అయిదు రెట్లు అధికంగా ఉంటుంది. కంటికి సంబంధించిన వ్యాధులని చక్కగా నివారిస్తుంది. బీ.పీ.కి మంచి ఔషధము.
అంతే కాకుండా కాపర్, మెగ్నీషియం అధికంగా లభిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జామకాయ, జామపండు నరాలకి మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది.
– ఉషా లావణ్య పప్పు