Four year old raped by Muslim neighbour in Bhainsa, Telangana |
తెలంగాణ లోని భైంసా లో నాలుగేళ్ల చిన్నారిపై పొరుగింటి ముస్లిం వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అత్యాచారానికి గురైన బాలిక తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాపూర్ నివాసి. ఆమె తన తల్లిదండ్రులు మరియు అమ్మమ్మతో అక్కడ నివసిస్తోంది. చిన్నారి తల్లిదండ్రులు పొలం పనివారు, నిందితుడు వారి పొరుగువాడు, బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో చిన్నారి పై కిరాతకంగా అత్యాచారం చేశాడు. కొన్ని ధ్రువీకరించబడని కథనాల ప్రకారం, ముస్లిం వ్యక్తి అయిన నిందితుడి వయస్సు 18 సంవత్సరాలు.
బాలిక తల్లిదండ్రులు పని వద్ద ఉండగా, బాలిక అమ్మమ్మ ఇంటి బయటకు రావడంతో, అదే అదునుగా అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న నిందితుడు చిన్నారిపై అత్యాచారం చేశాడని నివేదికలు తెలుపుతున్నాయి. అత్యాచార ఘటన సమయంలో బాలిక కేకలు వినిన ఆ చిన్నారి అమ్మమ్మ ఇంటిలోక పరుగులు తీశారు. బాలిక అమ్మమ్మ రావడాన్ని చూసిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. రక్తస్రావంతో ఉన్న చిన్నారిని ఆమె తల్లిదండ్రులు, అమ్మమ్మ స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయడానికి బదులుగా భైన్సా గ్రామీణ పోలీసు అధికారులు కేసును అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నిందితుడు ముస్లిం అయినందున ఇటీవలి జరిగిన భైంసా అల్లర్లను సాకుగా చూపి కేసు నమోదు చేస్తే మతసామరస్యం దెబ్బతీస్తుందని కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పుడు భైంసాను కర్ఫ్యూ లో ఉంచినట్లు పేర్కొనడం జరిగింది.
నిర్మల్ పట్టణంలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆ కుటుంబం బిడ్డ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్థానిక బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని ఆశ్రయించింది. బాలికను రమాదేవి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు రమాదేవి సమక్షంలో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసి, ఘటనల క్రమాన్ని వివరించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని, పోలీసులు కేసును నమోదు చేసుకుని నిందితుని పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు.
మీడియా కథనాలు, ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. మహిళా భద్రతా విభాగం శాస్త్రీయ ఆధారాలు సేకరించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి వైద్య సహాయం తోపాటు పరిహారం అందేలా చూడాలని డీజీపీ అధికారులను కోరారు.
Source input: Hindu post & thenewsminute