Ayodhya Rama Mandir |
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడొంతుల వరకూ పునాదులు తీశారు. ఈ పనులు ఈ నెలాఖరు వరకూ జరగనున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి పిల్లర్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు ఆలయ స్థపతి ఆశిశ్ సోంపురా తెలిపారు. మరోవైపు విరాళాల సేకరణ కార్యక్రమం కూడా ఓ కొలిక్కి వచ్చింది. మందిర నిర్మాణానికి సంబంధించిన నిపుణులు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పనులు మరింత వేగం పుంజుకుంటాయని అన్నారు.
”పునాదులు తీయడం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం వివిధ రకాలు పరీక్షలు జరుగుతున్నాయి. రాతితో ప్రత్యేకంగా తయారు చేసిన పిల్లర్లను 12మీటర్ల లోతు నుంచి వేస్తున్నాం. సాంకేతికంగా చేయాల్సిన పనులన్నీ పూర్తయ్యాయి. ఏప్రిల్లో ఆలయ ప్రాథమిక నిర్మాణం మొదలుగా కాగా, దాదాపు మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంటీరియర్ పనులు కొనసాగుతాయి” అని సోంపురా తాజాగా వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.2500 కోట్ల విరాళాలను సేకరించారు.
__విశ్వ సంవాద కేంద్రము