కేరళలో ముస్లింలు అధికంగా ఉన్న మలప్పురం జిల్లాలోని కల్పకంచెరి అనే ఊరిలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో 14 ఏళ్ల బాలికను మాదకద్రవ్యాలకు బానిసను చేసి నెలల తరబడి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి, 20 సంవత్సరాల ముహమ్మద్ అఫ్లా, మహ్మద్ రఫీక్యూలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి పరారీలో ఉన్నాడు.
ప్రధాన నిందితుడు ఆమెతో ఆన్లైన్లో పరిచయం పెంచుకుని, ఆమెతో తరుచూ చాట్ చేయడం ప్రారంభించి, ఆమెను ప్రతి రోజూ తన ఇంటి వద్దకు వెళ్లి కలిసేవాడు. అతను ఆమెకు క్రమంగా మాధకద్రవ్యాలు అలవాటు చేసి, వాటికి ఆమెను బానిసను చేశాడు. డ్రగ్స్ కి అలవాటు పడిన ఆ బాలిక చివరాకరకు కుటుంబాన్ని వదిలివేసే పరిస్థితికి వచ్చింది.
ఆ మృగం, బాలిక డ్రగ్స్ కి బానిసగా మారిందని నిర్ధారించుకున్న తరువాత, తరుచూ ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. కొద్ధి రోజులకి తన స్నేహితులు, అతని పరిచయస్తులను కూడా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రోత్సహించాడు. తద్వారా ఆమెను లొంగ దిసుకుని ప్రతి రాత్రి వచ్చి ఆమెపై అత్యాచారం చేసి వెళ్ళేవాడు.
బాలిక చివరికి కొంచెం ధైర్యం చేసుకుని, జరుగుతున్న దారుణాన్నితన దగ్గర బంధువుకు వివరించింది. వారు చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలిసి అరెస్ట్ చెయ్యాల్సిన జిల్లా పోలీసులు నిందితులకు సహకరించే విధంగా, ఫిర్యాదు ఇచ్చిన తర్వాత నెమ్మదిగా ఈ కేసులో విచారణ మొదలెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో ప్రధాన నిందితుడితో సహా నిందితులు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. న్యాయం చెయ్యాల్సిన పోలీసులు, నిందితులు పారి పొయ్యేందుకు సహకరించారని అక్కడి స్థానికులు పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Source : Organiser.