మతమార్పిడి |
ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ లో అల్పసంఖ్యాకులను అంతమొందించే మతపరమైన దాడులు ప్రతిరోజూ కొనసాగుతూనే ఉన్నాయి.
దాదాపు ప్రతిరోజూ హిందూ, సిక్కు, క్రిస్టియన్ బాలికలను అపహరించి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైనర్ హిందూ బాలికను అపహరించి బలవంతంగా మతం మారిన మరో ఘటన పాకిస్థాన్ లో వెలుగులోకి వచ్చింది.
హిందూ బాలిక మత మార్పిడి తంతుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
సింధ్ లోని కంధ్ కోట్ ప్రాంతానికి చెందిన 'కవితా ఊడ్' అనే 13 ఏళ్ల హిందూ బాలికను అపహరించి, ఆ తర్వాత బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని వార్తలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mian Mithoo's conversion shop thrives with impunity. Here, 13-year-old kidnapped Kaveeta Oad is forcibly converted to Islam in Ghotki. pic.twitter.com/Gd70kOggER
— Naila Inayat (@nailainayat) March 10, 2021
ఈ వీడియోలో, నేలమీద కూర్చొని ఉన్న హిందూ మైనర్ అమ్మాయి 'కవితా ఊడ్' చుట్టూ చేరిన అల్లరిమూక మత మార్పిడి యొక్క వీడియోను రికార్డ్ చేయడాన్ని చూడవచ్చు.
ఇనాయత్ ప్రకారం, మతమార్పిడి వేడుకను భర్చుండి మసీదుకు చెందిన ఇస్లాం మతాధికారి 'మియాన్ మితూ' ద్వారా ఈ మతమార్పిడి జరిగింది. మిధూ ఒక దుర్మార్గ మతాధికారి మరియు రాజకీయ నాయకుడుగా ఆ ప్రాంతంతో పేరుంది. ఒక క్రమపద్ధతిలో పేద హిందూ బాలికల ను అపహరించి బలవంతపు మతమార్పిడులు నిరవహించే దుర్మార్గుడిగా పేరుగాంచాడు.
హిందూ మైనర్ బాలికను అపహరించిన వ్యక్తితో పెళ్లి.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఉపాధ్యక్షుడు సుఖ్ దేవ్ హేమ్నాని (హిందూ ఎంపీ) ట్విట్టర్ లో స్థానిక అధికారులతో ఈ కేసును ఫాలో ప్ చేస్తున్నట్లు తెలిపారు. బాలిక వయసు 13 మాత్రమేనని పత్రాల రుజువుతో అయన ట్వీట్ చేశారు, ఈ విషయమై కోర్టులో కేసు దాఖలు చేసేందుకు న్యాయవాదుల సహాయం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులోసాయం కోసం సింధు మహిళా విభాగంతో కూడా సమన్వయం కూడా ఉందని ఆయన తెలిపారు.
In Tangwani city, the Hindu community protests against the conversion of its minor girls. Calls for Kaveeta to be returned to her family. #EndEnforcedConversions pic.twitter.com/GIQLmvt7Sg
— Naila Inayat (@nailainayat) March 10, 2021
సుఖ్ దేవ్ తెలిపిన వివరాల ప్రకారం "కవిత" బలవంత మార్పిడి కోసం ఖడ్ కోట్ నుండి ఘోట్కి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, బాలిక ను వెనుకకు తిరిగి తీసుకొచ్చేనందుకు ప్రయత్నిస్తున్నట్లు సింధ్ మహిళా విభాగం అధికారి సయాదా షెహ్లా రజా తెలిపారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మైనర్ బాలికలను పెళ్లి చేసుకోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు వారిని తిరిగి పొందడం చట్టపరంగా కష్టమవుతుంది.
పాకిస్థాన్ లోని తంగ్వాని నగరంలో హిందూ సమాజం మైనర్ బాలికల మతమార్పిడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ, కవితను తిరిగి తన కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేసారు.
హిందూ బాలిక బలవంతపు మతమార్పిడులు, అపహరణలకు సంబంధించిన ఘటనలు పాకిస్థాన్ లోని సింధ్ లో ప్రాంతంలో తీవ్ర రూపం దాలుస్తున్నాయి. బాధితుల కుటుంబాల రోదనలు చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టు పాకిస్తాన్ లోని న్యాయస్థానాలు కూడా బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నాయి.
ఆసక్తికరంగా విషయమేమిటంటే, పాకిస్తాన్ లో హిందువుల మతహింసలకు సంబంధించిన దారుణాలు నిత్యకృత్యంగా జరుగుతున్నా, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు గుర్తించకపోవడం గమనార్హం.
టెలిగ్రామ్లో తెలుగు-భారత్ ను అనుసరించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ప్రతిరోజు మేము అందించే ఉత్తమ కథనాలను పొందండి.