జనవరి 31 న పంజాబ్లోని ఫిలౌర్లో సంత్ జ్ఞాన్ మునిగా గుర్తించబడిన హిందూ ఆలయ పూజారిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ సంఘటనలో అతనిని రక్షించడానికి వచ్చిన 16 ఏళ్ల బాలికను కూడా కాల్చారు.
జగ్బనిలో ఒక నివేదిక ప్రకారం, ఇద్దరు దుండగులు పూజారిపై కాల్పులు జరపగా అదేసమయంలో అక్కడ ఉన్న సిమ్రాన్ గా పేరుగల ఒక అమ్మాయి అతనిని రక్షించడానికి వచ్చింది, కానీ ఆమె ను కూడా తుపాకీతో కాల్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిని డీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఫిలావర్ లోని భర్ సింగ్ పురా గ్రామంలో తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆలయంలో భక్తులు కూడా అక్కడే ఉన్నారని సమాచారం. ఈ కాల్పులతో భయబ్రాంతులకు గురైన భక్తులు పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో అక్కడ ఒక తొక్కిసలాట జరిగింది.
సంత్ జ్ఞాన్ ముని మరియు సిమ్రాన్ (చిత్రాలు: జగ్బని) |
ఆలయ పూజారి కూర్చున్న చోటుకు చేరుకున్న దుండగులు అతనిపై కాల్పులు ప్రారంభించారు. సిమ్రాన్ వెంటనే అతన్ని రక్షించేందుకు ప్రయత్నించగా దుండగులు ఆమె పై దాడి చేసిన వారు ఇద్దరి పై కాల్పులు జరిపారు . ఈ ఘటనలో పూజారి పై మూడుసార్లు సిమ్రాన్ పై రెండు రౌండులు కాల్చారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరుగైన చికిత్స కోసం జలంధర్ లోని సివిల్ ఆస్పత్రి తరలించారు. పూజారిపై దాడి చేసిన దుండగులు ఎందుకు దాడి చేశారని ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు.
పోలీసు సూపరింటిండెంట్ సుహైల్ కసీర్ మీర్, ఎస్ హెచ్ ఓ సంజీవ్ కపూర్ లు సంఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంత్ జ్ఞాన్ ముని కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని స్థాపించాడు. ఆలయ స్థాపన విషయంలో కొంత వివాదం తలెత్తినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఎస్ హెచ్ ఓ కపూర్ మాట్లాడుతూ. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 307, 34, ఆయుధాల చట్టంలోని 25, 27, 54 సెక్షన్ల కింద ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, బాధితులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం అన్వేషణ జరుగుతోందని చెప్పుకొచ్చారు.
ఆలయం లోపల గోడపై బుల్లెట్ రంధ్రం (చిత్రం: జగ్బని) |
ఈ గ్రామంలో జన్మించిన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జార్ కారణంగా గ్రామ భార్ సింగ్ పూరా ఇటీవల ఇక్కడ పేరుపొందిన ఉగ్రవాది. 2020 లో, సిక్కులకు చెందిన గుర్పర్వంత్ సింగ్ పన్నూతో పాటు భారత ప్రభుత్వం అతన్ని ఉగ్రవాదిగా కేసు నమోదు చేసియున్నారు. సెప్టెంబర్ 2020 లో, ఎన్ఐఏ అతని ఆస్తులను భార్ సింగ్ పురా గ్రామంలో యుఎపిఎ సెక్షన్ 51 ఎ కింద ఈ కేసులో జత చేసి వీరిరువురి ఆస్తులను స్తంభింపజేశారు.
Source: Opindia