రామ భక్తుడు రింకు శర్మ |
రామ భక్తుడైన రింకు శర్మ "జై శ్రీరామ్" అంటూ రామాలయం కోసం నిధి సేకరణ చేస్తన్నాడని రింకూ శర్మను ఇస్లామిస్టులు హత్య చేశారని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ, ఈ హత్యలో 'మతపరమైన కోణం' లేదని ఢిల్లీ పోలీసులు చెప్పడం గమనించాల్సిన విషయం.
ఢిల్లీలో బజరంగ్ దళ్ కార్యకర్త రింకూ శర్మను దారుణంగా హత్య చేసిన రెండు రోజుల తర్వాత మంగోల్ పురి హత్య కేసును క్రైం బ్రాంచ్ కు బదిలీ చేయాలని ఢిల్లీ పోలీసులు శనివారం నిర్ణయించారు. ఈ కేసును ఇప్పటి వరకు మంగోల్ పురి పోలీసు అధికారులు రింకూ శర్మ హత్య కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మంగోల్ పురి హత్య కేసులో ఢిల్లీ పోలీసులు సమగ్ర దర్యాప్తుకు ప్రయత్నించడం లేదని, ఈ హత్యలో పోలీసులు 'మతకోణం' లేదనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ వాసులతో పాటు సోషల్ మీడియాలో హత్య కేసు పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని గట్టిగా డిమాండ్చే యడంతో తీవ్ర ఒత్తిడి కారణంగా హత్యకు సంబంధించిన కేసును 'అన్ని కోణాలలో' దర్యాప్తు చేస్టున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
అనేక వర్గాల నుంచి వచ్చిన ఆగ్రహం కారణంగా ఢిల్లీ పోలీసులు కేసు బదిలీ :
ముందుగా పోలీసులు ఈ హత్య బర్త్ డే పార్టీలో జరిగిన గొడవ కారణంగా రింకూ శర్మ ను కత్తితో పొడిచి చంపినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రింకు శర్మతో పాటు హత్య చేసిన ముష్కరులు "ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు' ఒకదానికొకటి దగ్గరగా తెరవడం వల్ల ఇరుపక్షాలు మధ్య పోటీ పెరిగి అది కాస్తా బర్త్ డే పార్టీలో గొడవకు దారితీసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Four accused involved in killing of a man arrested by Delhi Police. Deceased was stabbed to death after an argument at a birthday party yesterday.
— ANI (@ANI) February 11, 2021
"Both the sides had rivalry over opening food joints close to each other": Delhi Police on Mangolpuri murder
ఈ ప్రకటనను రింకు శర్మ సోదరుడు మను తీవ్రంగా వ్యతిరేకించాడు, రింకు ఒక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడని, ఫుడ్ సెంటర్ కారణంగా హత్య జరిగిందని చెప్పడం పూర్తిగా అబద్దమని మీడియాతో చెప్పాడు.
రింకూ శర్మ హత్యలో 'మతకోణం' లేదని ఢిల్లీ పోలీసులు రికార్డు లోకి నమోదు చేసినప్పటికి, మరిన్ని సాక్ష్యాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి, ఈ కేసులో 'మతపరమైన కోణం' లేదని ఢిల్లీ పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
దీనికి తోడు బుధవారం రామమందిర విరాళం సేకరణ సందర్భంగా జరిగిన ఘర్షణ అనంతరం 15-20 మంది ముస్లింల అల్లరిమూక రింకూ శర్మను హత్య చేసినట్లు మృతుడి కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు, స్నేహితులు అందరూ నొక్కి చెప్పారు.
Source: Opindia