పాకిస్తాన్‌లోని హిందూ మైనారిటీలపై దారుణ సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సింధ్‌లో, హిందూ బాలికలను ముఖ్యంగా మైనర్లను అపహరించడం మరియు బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడం అక్కడ సర్వ సాధారణ సంఘటనగా మారింది.
వివరాల్లోకి వెళితే. సింధ్ లోని నషారో జిల్లా హలానీ దర్బార్ కు చెందిన రమేష్ లాల్ కుమార్తె నీనా కుమారి ని, ఆ ప్రాంత మైనారిటీ వాసుల భద్రత కోసం పికెట్ వద్ద మోహరించి ఉన్న గులాం మహ్రూఫ్ ఖాద్రీ అనే పోలీసు ఆమెను అపహరించాడు.
పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో నీనా ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. విచారణ అనంతరం ఆమె అపహరణ గురించి ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. అపహరించిన అనంతరం నీనా ను ఫిబ్రవరి 11 న మత మార్పిడి చేసారని సింధ్ ప్రాంతంలో ఒక హిందూ రాజకీయ నాయకుడి తెలిపాడు.
కరాచీలోని తన ఇంటికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ మసీదు (దర్గా)కు పోలీసు ఖాద్రీ నీనా ను తీసుకెళ్లి ఆమెను వివాహం చేసుకోవడానికి ముందు ఆమె మారియా గా ఆమె పేరు మార్చి ఇస్లాం మతంలోకి మార్చుకున్నాడని అఖిల్ పాకిస్థాన్ హిందూ పంచాయతీ (ఏపీహెచ్ పీ) తెలిపింది. ఈ వివాహం పూర్తయిన తర్వాత మంగళవారం ఈ వార్త బయటకు వచ్చింది.
Sindh, Pakistan |
ఇక నుంచి పోలీసులను కూడా నమ్మలేమని హిందూ నేత..
హిందూ బాలిక వయస్సు 19 గా పేర్కొంటూ ఇది ప్రేమ వ్యవహారమని ఆమె సమ్మతితోనే ఈ పెళ్లి జరిగిందని బుకాయిన్చేందుకు ఆమె మైనర్ బాలిక కాదంటూ ఒక నకిలీ మ్యారేజ్ సర్టిఫికేట్ ను సోషల్ మీడియాలో ఉంచారు, అయితే ఆమె కుటుంబం మైనర్ బాలిక అని తెలిపారు.
నకిలీ మ్యారేజ్ సర్టిఫికేట్ |
ఈ సంఘటన తరువాత ఈ ప్రాంతంలో నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాల ప్రజల భద్రత కోసం మోహరించిన పోలీసులను కూడా విశ్వసించలేమని సింధ్ హిందూ నాయకుడు తెలిపారు. ప్రతి రోజు హిందూ, సిక్కు బాలికలను మతం మార్చుతున్నారని అయన తెలిపాడు.
ఇస్లామిక్ మౌల్విస్ మరియు పాకిస్తాన్ హిందువుల మధ్య ఇటీవల ఒక ప్రైవేట్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఈ తాజా అపహరణ జరిగిందని హిందూ నాయకుడు తెలిపారు.
ఈ ఒప్పందంలో సమారో యొక్క పీర్ మొహమ్మద్ అయూబ్ జాన్ సర్హండి, భార్చుండి షరీఫ్ దర్గా యొక్క మియాన్ అబ్దుల్ హక్ (అకా ది నెటోరియస్ మియాన్ మిథూ), కరాచీ యొక్క మౌలానా నౌమాన్ నయీం - వీరందరూ హిందూ, సిక్కు బాలికలను అపహరించి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు.
హిందూ పక్షం తరపున, పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ రమేష్ కుమార్ వంక్వానీ (అతను రాజకీయ నాయకుడు మరియు అధికార పిటిఐ పార్టీకి చెందిన ఎంఎన్ఎ) ఈ పత్రంపై సంతకం చేశారు. ఒప్పందం ప్రకారం, మైనారిటీ మతాలకు చెందిన బాలికలను వారి తల్లిదండ్రులతో చర్చించిన వారు సమ్మతించిన తర్వాతే (ఇస్లాం మతంలోకి) మార్చవచ్చు.
పాకిస్తాన్ హిందువులను అంతర్జాతీయ సమాజం పట్టించుకోకపోవడం లేదు పైగా పాశ్చాత్య మరియు భారత్‌లోని ఉన్న సెక్కులర్ ఉదారవాదులు పాకిస్తాన్‌లోని హిందువుల జీవితాల కంటే కాశ్మీర్లో ఇంటర్నెట్ షట్‌డౌన్ విషయంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారని హిందూ నాయకుడు ఆరోపించారు.
Source inputs: హిందూ పోస్ట్ - Times of India