: ధర్మ సూత్రాలు :
ధర్మం ప్రధానంగా భౌతికంగాను, ఆంతరంగికంగాను వ్యక్తమవుతుంది. ఈ ధర్మం సన్మార్గంతో కూడినది, పవిత్రమైనది. భౌతికంగా సన్మార్థాన్ని అవలంబించాలి. అంతరంగంలో పవిత్రతను చేకూర్చుకోవాలి. ధర్మంలో ఇమిడి ఉన్న ఈ జంట ప్రయోజనాలను అందరూ గుర్తించాలి. ఇహపరాలతో కూడినది మానవ జీవితం. ప్రతి మానవుడూ తన కర్తవ్యాన్ని గుర్తించి మెలగాలి. మానవుడు తన కర్తవ్యాన్ని, తాను ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి అనే విషయాలను గ్రహించి తదనుగుణంగా తన మాటలను, ఆలోచనలను, కర్మలను ఆచరించాలి.
ధర్మమనే పదం “ధృ' అనే సంస్కృత ధాతువునుంచి వచ్చింది. అంటే ధరించడం, సహించడం, నిలబెట్టడం. ధర్మానికి అనేక అర్థాలు సూచించారు. ప్రకృతి అని, ప్రకృతి నియమాలని, భరించేది గాను, నైతికమైనది గాను, ఉత్తమమైనది గాను, నైతికం, నైతిక శక్తి, సత్కర్మ, నియమం, మతసమ్మత మైనది, నాణ్యమైనది, వైవిధ్యంగలది, సత్యమైనది, పంచభూతాత్మక మైనది. మానవసంబంధమైన సర్వక్రియలలో ఈ ధర్మం ఇమిడి ఉంది. ఈ క్రియలు అనేక విధాలుగా వ్యక్తమవుతున్నాయి. వాటిని నైతికం, ధార్మికం, ఆధ్యాత్మికం అని వర్ణించారు. అన్ని మతాలకు, మత నియమాలకు, నమ్మకాలకు ఈ ధర్మమే (ప్రధానమైన ఆధారమై ఉంది. ఈ నేపథ్యంలోనే మనం తెలుసు కోవలసినది ఏమంటే భారతీయులు అనాదిగా ఆచరిస్తున్న ఈ ధర్మాలనే సనాతన ధర్మాలుగా వ్యవహరిస్తున్నారు. బౌద్ధమతం, జైనమతం ఈ సనాతన ధర్మానికి వేరువేరు పాయలు. హిందూ మతం కూడా ఇదే విధంగా సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మమే భారతీయుల మానసిక స్థితిని, అభిలాషలను, ఆధ్యాత్మికతలను, సంస్కృతి సంప్రదాయాలను, జీవన విధానాన్ని తేటతెల్లం చేస్తూంది.
ధర్మానికి మూలం సత్యం. సత్యం దైవస్వరూపం. సత్యాన్ని అనుసరించి ఆచరించినదే ధర్మమని జ్ఞానులు గుర్తించారు. ఆచరించిన ధర్మానికి త్రికరణాల ద్వారా ఫలితాలను మానవుడు గ్రహించలేకపోవచ్చు, కానీ అంతరాత్మ ద్వారా సమాధానాన్ని గ్రహించవచ్చు. కాబట్టి మనం సత్కర్మలను అలవాటుపడాలి. వేదాలలో ఈ త్రికరణాలతో కూడిన (క్రియలకే ప్రాముఖ్యాన్ని ఇస్తూ వివరించారు. ఆంతరంగిక విషయాల గురించి వేదాలు తెలపనప్పటికీ, ప్రతి క్రియకు అంతరాత్మ ప్రబోధం వ్యక్తమవుతుంది.
కాలం గడిచేకొద్దీ అనేక ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రములు వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటిలో అత్యంత ప్రభావం చూపినది మానవధర్మ శాస్త్రం (మనుధర్మ శాస్త్రం) ప్రజల మన్ననలు పొంది ఆచరణయోగ్యమైనది. ఇందులో అనేకమైన విషయాలను, హక్కులను గురించి, బాధ్యతల గురించి, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు గురించి వేదప్రమాణంగా వివరించారు. జైమిని మహర్షి ఈ ధర్మసూత్రాలను ఆమోదించి ఆస్తికులందరికీ ఆచరణయోగ్యముగా వీటిని విశదపరచెను.
ధర్మమంటే సత్కర్మల జ్ఞానం. ఈ జ్ఞానం ఇంద్రియాతీతంతో కూడినది. కార్యం రీతిని, ఇంద్రియాతీత స్వభావాన్ని, నైతిక విలువల ఆవశ్యకతను ఎరుకపరుస్తుంది. తాను ఆచరించే కర్మ ఫలితాలను కర్తకు విశదపరుస్తుంది. ధర్మమంటూ భరించేది. అంటూ విశ్వాన్ని భరించునది. ధర్మం అనేకత్వంతో కూడిన ఒక సంఘటిత శక్తి సంఘటిత శక్తి లేకపోతే ఐక్యత లోపించి దేనికది విడిపోతుంది. ఒక సత్మర్మకు గుర్తింపే ఈ సంఘటిత శక్తి. మానవుని సత్కర్మ నాచరించి ఉత్తేజపరిచేది ఈ ధర్మమే ఆచరించి సాధించాలి. సత్మర్మను ఆచరించడం వల్ల సత్ఫలితాలు, దుష్కర్మ లాచరించడంవల్ల దుష్ఫలితాలు కలుగుతాయి. దుష్కర్శల నాచరించడమే అధర్మం అంటారు.
మీమాంస ద్వారా ధర్మనిర్ణయం జరుగుతుంది. ఏది నైతికం? ఏది ధార్మికం? ఏది సత్కర్మ? ఈ మీమాంస ద్వారానే భారతీయ ఇతిహాసాలన్నీ ఏది మంచి? ఏది చెడు? ఏది ఆచరించదగ్గది? ఏది ఆచరణయోగ్యం కాదో నిర్ణయింపబడినది. ఈ సదాలోచనలకు సత్కర్మలకు ఈ మీమాంసే పునాది.
మీమాంస ద్వారా ధర్మానికి సరియైన అర్థాన్ని ఆంగ్లములో నిర్వచించలేము. ఏది ప్రస్తుతం? ఏది అప్రస్తుతం? తెలియజేసేది ధర్మం. తత్త్వ, జ్ఞాన విచారణల ద్వారా ధర్మాన్ని అనేక రీతులగా వివరించడం జరిగినది. బౌద్ధమతంలో ఈ ధర్మాన్ని కర్త, కర్మ, క్రియలనే ఆధిభౌతిక దృష్టితో వివరించారు. జైనులు ధర్మాన్ని అనుసరించే మొత్తం అంతా పరిభ్రమిస్తూందని భావిస్తారు.
అలాగయితే ధర్మమంటే ఏమిటి? మీమాంస ప్రకారం ధర్మమంటే ఒక అద్భుతశక్తి. ఈ శక్తినే మనం మంచి చెడులుగా విభజించాం. మానవుడు చేసేకర్మలు మంచిచెడులుగా విభజన అయ్యాయి. ఈ మంచి చెడుల నిర్ణయం భగవంతుడి సంఘపు నిర్ణయం (ప్రకారం జరిగింది. ఈ మంచిచెడులన్చిటినీ మనం మీమాంస ద్వారా నిర్ణయించలేము. ఈ ధర్మపు శక్తి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలకు అతీతమైనది. ఇంద్రియాలకు అగోచరమైన ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉంటున్నాయి. ఈ ధర్మపు శక్తి ఆత్మలో చేరి ఉంటున్నది. ఈ ఆత్మశక్తే సర్వజీవుల జననమరణాలను నిర్ణయిస్తున్నది. మానవుడు ఆచరించే ధర్మాన్ని అనుసరించి అతని పురోగతి, తిరోగతి ఏర్పడుతున్నది.
ఈ అద్భుతమైన ఆత్మశక్తి మనకు అగోచరమైనప్పటికీ, మనం ఒప్పుకొని తీరవలసిందే. ఎందుకంటే ఈనాడు చేసిన కర్మకు ఫలితం మరెప్పుడో అనుభవించడం జరుగుతున్నదికదా కార్యం పూర్తి అయినప్పటి నుంచి, ఆ కర్మ ఫలితాన్ని పౌందే సమయానికి మధ్యలో ఎంతో కాలవ్యవధి ఉంటూంది. కారణం లేకుండా ఏ కార్యం జరగదు. మానవుడు వరసగా కర్మలను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ కర్మలకు ఫలితం ఎప్పుడు, ఏ విధంగా బయటపడుతుందో మానవుడు (గ్రహించగలగాలి.
ఈనాడు ఒక మామిడి విత్తనం వేశాము. ఆ విత్తనం మొక్కై, పెరిగి, పూత పూసి, కాయగా పండుగా మారడానికి 5 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ మామిడిచెట్టు ఆ తదుపరి అనేక ఫలాలను ప్రతి సంవత్సరమూ అందిస్తుంది. అంటే ఒక విత్తనం మామిడి వృక్షంగా మారింది; అంటే ఎంతో శక్తిని చేకూర్చుకున్చది కదా! కాబట్టి మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమంటే విత్తనం నాటగానే ఆ కర్మ పూర్తి అయిందని భావించకూడదు. ఆ కర్మ కొంతకాల గమనం తరవాత ప్రచండ శక్తిగా మారి అనేక రీతులుగా, సమయానుకూలంగా ఫలాలనిస్తుంది. మపం చేసేకర్మల ప్రచండశక్తిని మనం (గ్రహించలేకపోతున్నాం. కారణం అవి అగోచరంగా ఉండటం.
ఒక అయనస్మాంతాన్ని ఇనుపఖనిజం దగ్గర వద్ద పెట్టగా, ఇనుప ఖనిజపు రజనును వెంటనే అయస్కాంతం ఆకర్షిస్తుంది. అంటే ఇక్కడ కర్మకు వెంటనే ఫలితం వ్యక్తమవుతున్నది. అన్ని కర్మలకూ ఈ విధంగా ఫలితాలు ఉ౦డవు. ఈ విషయాన్ని మనమందరం గ్రహించాలి. మనం ఆచరించే సత్కర్మలు భవిష్యత్లో ఒక ప్రచండ శక్తిగా మారి అనేక సత్ఫలితాలను అందిస్తుంది. ఇలా మర్మాలను మానవుడు (గ్రహించాలి. మనం భవిష్యత్తులో ఆశించే మంచి ఫలితాలకోసం ఈనాటి నుండే ప్రయత్నం చెయ్యాలి.
జీవుడు ఏకవచనం, ఆత్మ బహువచనం. మానవుడు ఏకవచనం, భగవంతుడు బహువచనం. నేను ఫలానా గ్రామంలో ఉంటాను, కానీ ఆ (గ్రామం నేను కాదు. అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, అంటే ఆత్మలో భాగం నేను. కానీ నేను ఆత్మను కాను (బహువచనం). మీమాంస ద్వారా జీవులు చేసే కర్మల ఫలితములను నిర్ణయించేది ఆత్మశక్తి. ఈ అనంతమైన ఆత్మశక్తి యావత్ విశ్వాన్ని నియంత్రించుచున్చది. ఈ ఆత్మశక్తి అనేక కర్మలచేరిక, అనేక ప్రణాళికల చేరిక, అనేక రీతుల చేరికయై ఉన్నది. అన్ని శక్తులతో కూడి ఈ ఆత్మశక్తి అన్ని కార్యాలను ఒక చక్కని ప్రణాళికను అనుసరించి జరిపించుచున్నది. ఉదా: భూమ్యాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి మొదలైనవి. ఈ ఆత్మశక్తిలో అనేక పదార్థాలు సమ్మిళితమై ఉంటున్నవి. ఈ పదార్థాలకు అనేక ధర్మాలు ఉంటున్నవి. ఈ పదార్థాలు తమతమ ధర్మాలను అనుసరించుచున్నవి. ఈ ఆత్మశక్తి అంతర్వాహినిగా అన్ని పదార్థాలలోను, అన్ని శక్తులలోను, అన్ని ప్రణాలికలలోను, అన్ని కర్మలలోను ప్రవహించు చున్నది. బౌద్ధులు ఈ ఆత్మశక్తినే ధర్మమన్నారు. కాబట్టి ధర్మమనగా అది యొక నియమం. భరించేది, నిలబెట్టేది. కాబట్టి ఈ విశ్వము యొక్క క్రమమే ధర్మమని చెప్పవచ్చును.
మీమాంసకులందరూ వేద ప్రమాణంగా ధర్మమును అంగీకరించి, ఆచరణ యోగ్యంగా శాసించారు. కర్మ, కర్మయొక్క ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కర్మనాచరించుటే ధర్మమని కొందరి అభిప్రాయము. ఇక్కడ కర్మను, కర్మయొక్క ఫలితాలను వేరు చేయుట జరిగినది. మంచి కర్మలకు మంచి ఫలితాలు అన్నది అందరికీ విదితమే కానీ చేసిన ప్రతికర్మకు ఫలితం అగోచరమై ఉన్నది. కాబట్టి ఫలితాలను ఆశించకుండా సత్కర్మల నాచరించమని వేదాలు మానవుని నియంత్రిస్తున్నవి. కాబట్టి వేదాలలో సూచించిన విధంగా ఆచరించుటే మానవుని కర్తవ్యం. అదే మానవుని ధర్మము.
(Good = మంచి, [Right = ఒప్పు. మనమాచరించె కర్మలు మంచివిగాను, ఒప్పుగాను ఉండవలెను. అదే విధంగా కర్మయొక్క ఫలితాలు మంచిగానూ ఒప్పుగానూ (గ్రహించవలెను. వెంటనే ఫలితం కానరాని మూలాన కొన్ని కర్మలు మంచివిగా కొందరు, ఒప్పుగా కొందరు వర్ణింతురు. అదే విధంగా కర్మయొక్క ఫలితాలను కూడా మంచిగాను, ఒప్పుగాను నిర్ణయించుచున్నారు. "ఈ నేపథ్యంలో మనము గ్రహించ వలసినది ఏమనగా, చేసిన కర్మ ఒక అనంతశక్తిగా ఫలమొందును అని.
ఇంత వరకు మీమాంసలో విచారించిన విషయాల నుండి ఈ విషయాలను (గ్రహించడమైనది.
- మానవుని కర్తవ్యకర్మలను వేదాలు శాసించుచున్నవి.
- వేదాలు సూచించిన విధంగా మానవుడు తన కర్తవ్యకర్మల నాచరించవలెను.
- మనము కర్మల నాచరించిన పిదప అవి ఒక అనంతమైన శక్తిగా రూపొందును. ఈ అనంతమైన శక్తి మానవులకు అగోచరముగా ఉండును.
- మన కర్మలయొక్క ఫలితమైన ఈ అనంతశక్తి కారణ, కాలానుకూలములను బట్టి వ్యక్తమగును.
- ధర్మమనగా ఈ అనంతమైన ఆత్మశక్తియే. అది మంచి కర్మలకు మంచి ఫలితాలను, చెడు కర్మలకు చెడు ఫలితాలను అందించును. కర్మయొక్క మరో రూపమే కర్మ ఫలితము. సాధారణంగా ధర్మమును, అధర్మమును మానవులు ధర్మముగానే వ్యవహరించుట పరిపాటి.
మీమాంసతో మనము కర్మసిద్ధాంతమునే ధర్మ సిద్ధాంత మనవచ్చును. అనగా ఈ ధర్మమే మానవుని కర్తవ్య కర్మలను బోధించుచున్నది. అగోచరంగా ఉన్న అనేకమైన అంశాలను దృష్టిలో పెట్టుకునే వేదాలు ధర్మాచరణను శాసించినవి. మన కర్మలవల్ల ఏర్పడే ఈ అనంతమైన ఆత్మశక్తి యావత్ విశ్వాన్ని నియంత్రించుచున్నది. ఈ అనంతమైన ఆత్మశక్తి యావత్ విశ్వమును నియంత్రించుచున్నప్పటికీ మానవుడు స్వేచ్ళగానే వ్యవహరిస్తున్నాడు. తన గత కర్మలు తన స్వేచ్చకు భంగము కలుగునీయుట లేదు. కానీ తన కర్మలనే పెట్టుబడిగా మానవుడు తన భవిష్యత్తును ఏర్పాటు చేసుకుంటున్నాడు.
గతంలో మంచి పనులు లేదా చెడు పనులు చేసి యుండవచ్చును. వాటి ఫలితాలు అనుభవించవలసిందే. అయినప్పటికీ మానవుడు స్వేచ్చను అనుభవిస్తున్నాడు. గతంలో మంచి పనులుచేసి, ప్రస్తుతంలో కూడా మంచి కర్మలే చేయవచ్చును. గతంలో చెడు కర్మలు చేసి ఇప్పుడు మంచి కర్మల నాచరించవచ్చును. ఈ మంచిచెడుల మిశ్రమఫలితాలు మానవుడు అనుభవించును. ఈ మిశ్రమ ఫలితాలు కారణంగా గతంలో జరిగిన అన్ని కర్మలకు ఫలితము ఉండాలన్న శాసనము ఏమీలేదు. అనగా గతంలో జరిగిన దుష్కర్మలను సరిదిద్దుకోవడానికి భగవంతుడు అందరికీ అవకాశమిస్తున్నాడు. కాబట్టి గతంలో జరిగిన చెడుకు వెరువక సత్మ్కర్మలపై అందరూ దృష్టిని పెట్టవలెను. భగవంతుడు ఇచ్చిన అవకాశానికి మానవులంతా భగవంతునికి తమ కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
భగవద్గీతలో ధర్మ సూత్రాలు :
ఈ నేపథ్యంలో భగవద్గీత ద్వారా శ్రీకృష్ణభగవానుడు తెలియజేసిన ధర్మాలను మానవులు గ్రహించి ఆచరించవలెను. మానవుడు సత్కర్మల నాచరించవలెను. మానవులు భగవంతునికి శరణాగతి కావలెను. మానవులు ఈ శరణాగతితో తమ అహంకార, మమకార, వ్యక్తిత్వాలను భగవంతునికి అర్పించవలెను. ఈ సృష్టి భగవంతునిది. ఈ ప్రకృతి భగవంతుని యొక్క సృష్టి. భగవంతుని యొక్క అనేక శక్తులలో ఈ ప్రకృతి కూడా ఒక శక్తి. మనము ఈ ప్రకృతిలో ఉంటూ, ఈ ప్రకృతి నుండి మనము ఏమి పొందుతున్నామో దానిని తిరిగి ప్రకృతికి ఇచ్చివేయవలెను. మానవుడు భగవంతుని యొక్క సమిష్టికృషిలో భాగంగా భావించుకొనవలెను. అంతేకానీ తాను సర్వస్వతుంత్రుడిగా భావించకూడదు. మానవుడు తన సర్వస్వమును భగవంతునికర్చించి ఈ జగన్నాటకంలో తనవంతు పాత్రను చక్కగా నిర్వహించవలెను.
భగవద్గీత మానవుని నుండి ఏమి ఆశించుచున్నది? మానవుడు తన ధర్మమును ఆచరించి ఆధర్భమానవునిగా మారవలెనని భగవద్గీత సూచించుచున్నది. ఆదర్శమైన వ్యక్తిత్వమనగా ఏమిటి?
మానవుడు తన కర్తవ్యకర్మలను విధిగా ఆచరించవలెను. ద్వంద్వాలకు అతీతముగా ఎదిగి సమత్వమును పాటించవలెను. తనలోని అహంకార, మమకారాలను నిర్మూలించుకుని, తనకు ఏది జరిగినా అది భగవంతుని నిర్ణయముగా భావించుకొనవలెను. తన సమస్థితిని కోల్పోరాదు. కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాత్సర్యముల కతీతముగా తన మనస్సును పవిత్ర పరచుకొనవలెను. ఇంద్రియ నిగ్రహము పాటించవలెను. మానవుడు అన్ని బంధనల నుండి విముక్తి సాధించాలి. ఈ బంధనలే మనలోని అజ్ఞానమునకు కారణము. ఈ అజ్ఞానమే మన కోరికలకు కారణము. కోరికలు తీరనియెడల క్రోథము, క్రోథమువల్ల వివేకము నశించును. వివేకము నశించుట వల్ల విచక్షణ కోల్పోవును, జ్ఞాపకశక్తి నశించును. కాబట్టి ఆదర్శ మానవుడు అన్ని బంధనలకు అతీతముగా, అహంకార మమకారములను త్యజించి, ఈర్వా ద్వేషములు లేకుండా, ద్వంద్వాతీతుడై, సమస్థితిని అనుభవించవలెను. ఫలాపేక్ష రహితుడై సర్వకార్యములు నిర్వహించి, శాంతిని పొందవలెను.
వేదాలలో తెలియజేసిన కర్మాచరణీ ధర్మమని మీమాంసకుల అభిప్రాయము. అయితే వైశేశిఖులు ధర్మమును ఇహము, పరములతో కూడినదని వివరించెను. వీరి దృష్టిలో ధర్మమనగా సత్కర్మాచరణ మరియు మోక్షసాధన. ఇహమున మానవ మనుగడకు, సుఖజీవనమునకు అవసరమైన సత్కర్మలు మరియు భౌతిక బంధముల కతీతమైన కర్మలు చేయవలెను అని వీరి బోధ. సత్మర్మాచరణ వల్ల ఇహమున మానవుడు సుఖమును పొందును. మోక్షసాధన ద్వారా అనంతమైన ఆనందప్రాప్తి లభ్యమగును. వేదాలలో కూడా సత్మర్మాచరణ, మోక్షసాధనల ఆవశ్యకతను తెలిపెను. మోక్షసాధనే మానవునికి అన్నిటికంటె ముఖ్యమైన లక్ష్యము. దీనిని మానవుడు సాధించవలెను.
భౌద్దవములో ధర్మ సూత్రాలు :
బౌద్ధమతమున ధర్మమనగా ఈ విశ్వములో జరిగే సర్వ కార్యముల సమగ్ర స్వరూపము. పంచభూతాలు, స్థితులు, లక్షణాలు, పదార్థాలు, న్యాయశాస్త్రము, జీవన విధానము, రూపము మొదలైన అంశాలన్నీ ధర్మములో ఇమిడి యున్చవని తెలిపెను. వీరికి గౌతమబుద్ధుడు బోధించినదే సత్యము. అదే ఆచరణ యోగ్యము. అదే వారి అంతిమ గమ్యము, లక్ష్యము, సత్యము కాబట్టి బౌద్ధులకు ధర్మమే అన్నిటి కంటే ప్రధానమైయున్వది.
ధర్మముననుసరించి బౌద్దుడు 4 ఉత్తమ సూత్రాలను ప్రతిపాదించెను.
- జ్ఞానదృష్టితో ధర్మము గురించి సంపూర్ణ అవగాహన కలిగించుకోవలెను.
- సత్కర్మల ద్వారా తనలోని అజ్ఞానమును నాశనమొనరించుకుని పవిత్రులు కావలెను, ధర్మ దృష్టి కలిగి ఉండవలెను.
- ధ్యానము ద్వారా ధర్మాత్ముడిగా మారవలెను.
- ధర్మానికి ప్రతినిధిగా అనగా ధర్మస్వరూపునిగా మారవలెను.
సామాన్య వాడుకభాషలో ధర్మమనగా జీవన విధానము, నైతిక మార్గము, న్యాయబద్ధమైనది మరియు మతము. ధర్మమనగా సత్యముతో కూడినది, జ్ఞానము, నైతికము మరియు కర్తవ్యము. ధర్మము సత్యమైనది. ఈ విశ్వము యొక్క స్థితిగతులను నిర్ణయించునది. ధర్మము ఈ విశ్వములో చెడును నిర్మూలించి, మంచిని పెంచు అనంతశక్తికి ప్రణాళిక. ఎప్పుడైతే ధర్మము గురించి అవగాహన ఏర్పడునో, అప్పుడు మానవుని యొక్క అన్ని బంధనములు ఆ జ్ఞానముతో పటాపంచలయిపోవును. ధర్మ బద్ధమైన జీవితములోని ప్రణాలికను అనుసరించి ఆచరించి, జ్ఞానమును, మోక్షమును సాధించవలెను. ధర్మమును ఆచరించిన తర్వాత ఇతరులకు బోధించవలెను.
మానవ ధర్మశాస్త్రములో నిర్వచించిన సత్మ్కర్యాచరణే మీమాంస ద్వారా నైతిక, సాంఘిక, న్యాయ బద్ధముగా ఆచరణ యోగ్యమైనది. కౌటిల్యుని అర్థశాస్త్రము ద్వారా రాజులకు, ప్రభుత్వములకు అనుసరించవలసిన ధర్మములను మరింత స్పష్టత కలిగించెను.
ఆంగ్ల మూలము: కె ఆర్ పరమహంస
అనువాదము: వై వి వివేకానంద రెడ్డి {full_page}