శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణలో రామ భక్తులు |
తెలంగాణ ప్రాంతంలో శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ ఉత్సాహంగా, జోరుగా సాగుతోంది. వేలాది కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి రామమందిర నిర్మాణం గురించి చెప్పి నిధి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ మొత్తంలో 3090 గ్రామాల్లో నిధి సమర్పణ అభియాన్ పూర్తయింది. మొత్తం 3కోట్ల 9వేల 152 కుటుంబాలను కలిసి నిధి తీసుకున్నారు. ఇందులో 1లక్ష 33వేల 352 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
యాచన ద్వారా పొట్టపోసుకునే కుటుంబానికి చెందిన చిన్నారి నిధి సమర్పించిన దృష్యం |
ప్రాంతంలో పాలమూర్ లో అత్యధిక గ్రామాల్లో జనజాగరణ కార్యక్రమం జరిగింది. ఆ తరువాత ఇందూర్, కరినగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, మెదక్ లలో ఎక్కువ గ్రామాలలో ఈ కార్యక్రమం పూర్తయింది. భాగ్యనగర్, సికింద్రాబాద్ లలో అత్యధిక బస్తిలలో నిధి సమర్పణలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కోర్టులో నిధి సమర్పణ చేస్తున్న న్యాయవాదులు |
ఈ జనజాగరణ కార్యక్రమంలో రామభక్తులైన ప్రజానీకం స్వచ్ఛందంగా, భక్తిపూర్వకంగా మందిర నిధి సమర్పించారు. భాగ్యనగర్ లోని రంగారెడ్డి కోర్ట్ ఆవరణలో జరిగిన నిధి సమర్పణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొనడం, నిధి సమర్పించడం విశేషం. నరేశ్ వంటి సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతోపాటు సామాన్య, పేద ప్రజానీకం కూడా నిధి సమర్పించారు.
__విశ్వ సంవాద కేంద్రము