ఆలయం |
దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?” అని ప్రశ్నించాడు. మహాకవి గురజాడ అప్పారావు, ఇప్పుడు, ఘనత వహించిన ఈ సెక్యులర్ భారతంలో హిందూదేవుళ్ల స్థానం ఎక్కడ? ఈ పుణ్యభూమిలో ఇప్పుడు వారెవరు? అని మనను మనమే ప్రశ్నించుకోవాలి. హిందువుల ఆరాధ్యదైవాల స్థానం కొన్ని శతాబ్దాలుగా చెరసాలేనన్నది ఆ ప్రశ్నకు సమాధానం.
మొన్న ముస్లిం పాలకులు, నిన్న ఆంగ్లేయులు, ఇప్పుడుసెక్యులర్ ప్రభుత్వాలకు హిందూదేవస్థానాలు ఆయాచితంగా వచ్చిన ఏటీఎంలుగా మారిపోయాయి. ధర్మకర్తల పేరుతో రాజకీయ నిరుద్యోగులు దేవస్థానాలలో చొరబడి సర్వభ్రష్టం చేస్తారు. పుణ్యక్షేత్రాలు రాజకీయ పునరావాసాలుగా మారిపోయాయి. హిందూధర్మం మీద గౌరవం లేనివారు ధర్మకర్తలుగా రావడమే పెను విషాదం. వాటి ఆస్తులను ఇష్టారాజ్యంగా వినియోగించేది వీళ్లే. దేవాలయ భూములు ఇళ్లస్థలాలుగా పంచాలంటుంది ఒక పార్టీ. కొవిడ్ కోసం డబ్బులు ఇమ్మంటుంది మరొక పార్టీ. ఆలయాలను కొవిడ్ వార్డులుగా మార్చమంటారు. అయితే మసీదులలో, చర్చ్‌లలో మాత్రం సెక్యులర్ ప్రభుత్వాలకు ప్రవేశం నిషిద్ధం. వాటి నుంచి ఒక్క రూపాయి తీసుకోవడానికి కూడా ప్రభుత్వాలకు ధైర్యం లేదు. హిందూ దేవాలయాల మీద మాత్రం కోట్ల రూపాయలు పన్నుల రూపంలో దండుకుంటాయి. కానీ నిజం ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది? దేవస్థానాలలో ప్రభుత్వ జోక్యం ఉంటే ఆది సెక్యులరిజం కాబోదు. అయినా ఇక్కడి ప్రభుత్వాలు ఏడు దశాబ్దాలుగా సెక్యులర్ ప్రభుత్వాలుగా చెలామణి అయిపోతున్నాయి. లక్షల ఎకరాలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అందుకే మా దేవుళ్లకు సెక్యులరిస్టు ప్రభుత్వాల రక్షణ అవసరం లేదని ఇప్పుడు హిందువులు ఎలుగెత్తి చాటుతున్నారు.
చర్చిల మీద, మసీదుల మీద ప్రభుత్వ అజమాయిషీ లేనప్పుడు హిందూ దేవాలయాల మీద మాత్రం ఎందుకు ఉండాలి?'
ఇప్పుడు ఇది అందరూ వేసుకుంటున్న ప్రశ్న. ఇందుకు కారణం పలు రాష్ట్ర ప్రభుత్వాలే. ఇంకా చెప్పాలంటే ఘనత వహించిన సెక్యులర్ ప్రభుత్వాలే కూడా. సెక్యులరిజం మీద శాశ్వత హక్కులు ఉన్నాయని చెప్పుకునే రాజకీయ పార్టీల వైఖరి, ఆ పార్టీల అత్యుత్సాహం, హిందువుల మనోభావాలను ఖాతరు చేయక్కరలేదన్న అహంకారం కూడా ఇలాంటి ప్రశ్నకు పదును పెట్టాయి.
కరోనా నేపథ్యంలో ఒక కాంగ్రెస్ నాయకుడికి అమోఘమైన ఆలోచన వచ్చింది. గుళ్లల్లో మూలుగుతున్న టన్నుల కొద్దీ బంగారం మూటగట్టుకొచ్చి కొవిడ్ నివారణకి ఉపయో గించండి అంటూ పిలుపునిచ్చేశాడాయన. కొవిడ్ నివారణకు డబ్బులు ఇవ్వవలసిందేనని ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను దాదాపు ఆదేశించింది. తాజాగా తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ చెర నుంచి ఆలయాల విముక్తి అంశం ఊపందుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూసినా ప్రభుత్వ అధీనంలో హిందూ దేవాలయాలు ఉండడం 'ఎంత ప్రమోదకరమో అందరికీ అర్ధమైంది.
భారతదేశంలో అంతో ఇంతో ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయాలు 9 లక్షలని అంచనా. వీటిలో నాలుగు లక్షలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చెరలో ఉన్నాయి. ప్రభుత్వాల అధీనంలో లేదా అజమాయిషీలో ఉన్నాయనడం ఇక్కడ చిన్న మాటే అవుతుంది. కానీ చర్చిల మీద, మసీదుల మీద సెక్యులర్ ప్రభుత్వాలకు అధికారం లేదు. కాబట్టే ది హిందు రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (హెచ్ఆర్ సీఈ) చట్టం, 1951ని సవరించవలసిందేనన్న వాదన, ఆలయాల మీద ప్రభుత్వ అజమాయిషీ ఎందుకన్న ప్రశ్న బలపడుతున్నాయి. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం ఏ ప్రభుత్వమైనా హిందూ దేవాలయాలను తాత్కాలికంగానే అజమాయిషీ చేయవచ్చు. ఇందుకు విరుద్దమైన వాతావరణాన్ని కల్పిస్తున్నది 1951 నాటి చట్టమే, దీని ప్రకారం ప్రభుత్వం తలుచుకుంటే ఏ హిందూ దేవాలయం మీదనైనా అజమాయిషీ చేయవచ్చు. వాటి ఆస్తులను చేతుల్లోకి తీసుకోవచ్చు.
హిందూ దేవుళ్లకు చెర :
హిందూ దేవస్థానాలను మాత్రమే తమ చెరలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో పదిహేను ఉన్నాయి. కానీ, గుళ్లూ గోపురాలనూ ప్రభుత్వాలు ఊరికే ఏమీ చెరలో ఉంచుకోవడం లేదు. చెరలో భద్రంగా ఉంచేందుకూ, దాని నిర్వహణకు 13 నుంచి 18 శాతం సేవా రుసుముగా కూడా తీసుకుంటున్నాయి. ఇలా తీసుకోవడం హిందువుల హక్కులను హరించడమేనన్నది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ, అంతేకాదు, చాలా ప్రభుత్వాలు, వాటిని నడిపే పార్టీలు ఘనంగా ప్రవచించే సెక్యులర్ ప్రతానికి ఇది పరమ విరుద్దం. అయినా ఆయా రాష్ట్రాలలో యథేచ్ఛగా సాగిపోతోంది, ఈ దుండగీడుతనం. అందుకే ఈ విధానానికీ, అలనాటి ముస్లిం దురాక్రమణదారుల పరమత అసహనానికీ, ఆంగ్లేయుల దోపిడీ శైలికీ తేడా ఏమిటని ఇప్పుడు చాలామంది హిందువులు నిగ్గదీస్తున్నారు.
1951 నాటి హెచ్.ఆర్.సి.ఇ అమలు ఆరంభమైనది ప్రథమ ప్రధాని, ఈ దేశ సెక్యులర్ వాద పితామహుడు నెహ్రూ హయాంలోనే. 'సంప్రదాయకంగా చూస్తే భారతదేశంలో ఏ చక్రవర్తి, పాలకుడు కూడా దేవాలయాల మీద అజమాయిషీ చేయలేదు. ఇప్పుడు చర్చిలను, మసీదులను వదిలిపెట్టి హిందూ దేవాలయాల మీదనే ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. 1951 నాటి చట్టాన్ని సవరించాలని చెబుతున్నాం.'.అని సుప్రీంకోర్టు న్యాయవాది జె.సాయిదీపక్ బల్లగుద్ది వాదిస్తున్నారు హిందూ దేవాలయాల మీద అజమాయిషీ దక్కింది కదా అని, వాటి ఆస్తులను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తప్ప వేరొక విధంగా ఉపయోగించడం రాజ్యాంగంలోని 25,26 అధికరణాలకు విరుద్ధమని ఆయన
గుర్తు చేశారు
సుప్రీంకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
గమనించవలసిన అంశం ఏమిటంటే, హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ అజమాయిషీ గురించి భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆఖరి మూడు తీర్పులు కూడా, ఆయా దేవస్థానాల నిర్వహణ బాధ్యత అయా వర్గాలకు అప్పజెప్పండనే ఆదేశిస్తున్నాయి. ఏ ఒక్క ప్రభుత్వం ఆలయాలను అప్పగించడానికి ఇంతవరకు ముందుకు రాలేదు.ఇలాంటి ప్రభుత్వాల సంగతేమిటో చెప్పాలని కోరుతూ మరొక రెండు వ్యాజ్యాలు ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం విచారణ కోసం వేచి ఉన్నాయి.
ఇందులో ఒక వ్యాజ్యం ఉద్దేశం- మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రముఖుడు పృథ్వీరాజ్ చవాన్ ప్రకటనకు 'చెందినది. ఆయన అన్నాడు., దేవస్థానాలలో మూలుగుతున్న ఒక ట్రిలియన్ డాలర్ల విలువ చేసే (ఒకటి పక్కన పద్దెనిమిది సున్నాలు) బంగారు నిల్వలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కొవిడ్ 19 నివారణకు ఉపయోగించాలి అని. ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలిగింది. చర్చిలు మసీదుల ఆస్తులు కాదు. ఎందుకంటే, వాటిమీద సెక్యులర్ ప్రభుత్వాల పెత్తనం సాగదు. ఉన్నదల్లా హిందూ దేవాలయాల మీదే. పైగా బంగారపు కానుకలు తమ దేవుళ్లకు భక్తిగా సమర్పించుకునేది కేవలం హీందువులే. కాబట్టి చవాన్ గారి దివ్య సందేశం హిందూ దేవుళ్ల బంగారం యావత్తూ కొల్లగొట్టుకు రమ్మనే! హిందువుల గుడులు, అంతో ఇంతో గురుద్వారాలకే చవాన్ గారి పిలుపు వర్తిస్తుంది.ఈ పిలుపే దేశంలో చాలామంది హిందువులను తమ గుళ్లు, దేవుళ్ల పరిస్థితి గురించి ఆలోచించేట్టు చేస్తోంది.
ఇవీ లెక్కలు :
ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహా దేశంలోని అన్ని సెక్యులర్ ప్రభుత్వాలను ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయాల వార్షికాదాయంలో 23.4 వానికి పది లక్షల మంది శాతం పన్నుగా వసూలు చేస్తున్నాయి. ఇందు ధర్మాదాయ శాఖ పాలనావ్యయం కోసం తీసుకునే పన్ను (15 శాతం), ఆడిట్ రుసుము (2 శాతం), కామన్ గుడ్ ఫండ్ (2 శాతం) ఉన్నాయి.
అర్చక సంక్షేమ నిధి కోసం, ఇతర అవసరాలకు కూడా ఆలయాల నుంచే డబ్బు తీసుకువెళుతున్నారు. కానీ ఒక్క రూపాయి ఏ చర్చ్ నుంచి కానీ, ఒక్క రూపాయి ఏ మసీదు నుంచి కానీ వసూలు చేయడం లేదు. మరి ఒక్క హిందూ దేవాలయాల మీదే ఎందుకు పన్ను విధిస్తున్నారు? రాజ్యాంగంలోని 26వ అధికరణం మేరకు ధార్మిక సంస్థల నుంచి పన్ను వసూలు చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు. అయినా ఎందుకు హిందూ దేవాలయాలు చెల్లించాలి?' అని అడుగుతున్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ (నవంబర్ 25, 2019 ఇండియన్ ఎక్స్‌ప్రెస్, చిలుకూరు బాలాజీ ఆలయం తెలంగాణ, ప్రధానార్చకులు రంగరాజన్ పెట్టిన ఒక వీడియోను పవన్' కల్యాణ్ షేర్ చేశారు). దీనికి సమాధానం రాకపోవచ్చు. కానీ ప్రజలను ఇది ఆలోచింప చేస్తోంది. దేశంలో ప్రభుత్వాల అధీనంలో ఉన్న హిందూ దేవాలయాల మీద ఎక్కడైనా గాని ఇలా ఒకే విధమైన భారం మోపుతున్నారు. 23.9 శాతం ప్రభుత్వం పన్ను రూపంలో తీసుకుంటోంది. ఇక 70 శాతం ఆదాయం ఆలయ పరిపాలనా వ్యయంగా మారుతోంది. కేవలం రెండు లేదా మూడు శాతమే ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధూపదీప నైవేద్యాలకు ఖర్చు పెడుతున్నారు.
స్పష్టమైన ఒక ఉదాహరణ చూద్దాం! తమిళనాడులోని పళనిలో ఉన్న దండాయుధపాణి ఆలయం హుండీలో పడిన సొమ్మంతా నిర్దేశించుకున్న బ్యాంకులో జమ చేస్తారు. ఇందులో 14 శాతం పరిపాలనా వ్యయంగా తీసుకుంటారు. నాలుగు శాతం ఆడిట్ రుసుముగా పోతుంది. 25 నుంచి 40 శాతం ఉద్యోగుల జీతభత్యాల కోసం వెచ్చిస్తారు. 1 నుంచి 2 శాతం పూజాదికాలకి ఇస్తారు. 4 నుంచి 10 శాతం కామన్ గుడ్ ఫండ్. మిగిలిన సొమ్మును ప్రభుత్వం నిర్వహించే ఉచిత భోజన పథకం వంటి వాటికి మళ్లిస్తారు.
అంటే దేవుడి సొమ్ములో 65 శాతం నుంచి 70 శాతం దేవాలయేతర కార్యకలాపాలకే ఖర్చు చేస్తున్నారు. దేవుడిని కనిపెట్టుకుని ఉండే అర్చకులకు ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ. కొన్నిచోట్ల అది కూడా లేదు. శ్రీరంగం రంగనాథ ఆలయం నిర్వహణ కింద ప్రభుత్వానికి రూ.18.56 కోట్లు పన్నుగా చెల్లించింది (2010-2011).' అని బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఒక వ్యాసంలో రాశారు. అయితే 'ఉత్సవాల సమయంలో వేద పఠనం చేసే వారికి, మంత్రాలు చదివేవారికి మాత్రం జీతాలు లేవు. అర్చన టిక్కెట్ల ద్వారా వచ్చిన డబ్బులే వారికి ఇస్తారు' అని కూడా డాక్టర్ స్వామి రాశారు. అంటే శతాబ్దాలుగా భక్తులూ, దాతలూ ఏ ఉద్దేశంతో దేవుళ్లకు తమ ధనాన్ని సమర్పించుకున్నారో, ఆ ఆశయం ఇంత దారుణంగా భగ్నమవుతోంది.
__జాగృతి సౌజన్యంతో.. {full_page}