హిందూ కుటుంబం పై దాడి |
ముస్లిం మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్ లో ఓ హిందూ మైనారిటీ కుటుంబంపై జరిపిన 'భూ జిహాద్' సంబందించిన మరో ఘటన చోటుచేసుకుంది. ఈసారి బంగ్లాదేశ్‌లోని బార్గునా జిల్లా పతర్ఘాట ఉపజిల్లా, కల్మేఘా యూనియన్‌కు చెందిన కాలిబారి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జిఎం ఖలీల్, అతని అనుచరులు కలిసి గ్రామంలోని హిందూ నివాసి అయిన గోవింద షిల్ మరియు అతని కుటుంబంపై దాడి చేసి, తరతరాలుగా సాగుచేసుకుంటున్న వారి స్వంత భూమిని ఆక్రమిచుకుని ఆ హిందూ మైనారిటీ కుటుంబంపై దాడిచేశారు.
On 31/01/2021,6 members of a Hindu family were hacked & injured in Kalibari village of Kalmegha union in Patharghata upazila of Barguna district,BD.The injured were admitted to d hospital.
— Raju Das 🇧🇩 (@RajuDas7777) February 9, 2021
The attackers r a jihadi group of 10-12 people,including GM Khalil,Tanvir,Soleiman & Alamin pic.twitter.com/Y2LVe7xTSR
భూవిక్రయం ఘటన నుంచి ఈ సమస్య మొదలైంది.
గోవింద షిల్ తన భూమిలో కొంత భాగాన్ని ఖలీల్ కు విక్రయించాడు. కొన్ని రోజుల తరువాత, ఖలీల్ గోబిందా దగ్గరకు వచ్చి మిగిలిన భూమికూడా నాదేనంటూ అక్రమంగా సంపాదించిన భూ యాజమాన్య హక్కు పత్రాన్ని చూపించి, మొత్తం ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు. ఆసమయంలో గోవింద వారిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి ఖలీల్ వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత ముస్లిం మూకను వెంటేసుకుని వచ్చి మళ్ళి భూమిని ఆక్రమించి చట్టవిరుద్ధంగా సాగు చేయడం ప్రారంభించారు. ఈ అక్రమ సాగుపై జనవరి 31న ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఖలీల్ కుటుంబం షిల్ కుటుంబంపై దాడి చేసేందుకు కుట్ర పన్నారు.
ఖలీల్, అతని మేనల్లుడు అలామిన్, కుమారుడు తన్వీర్, మరో మేనల్లుడు సల్మాన్ నేతృత్వంలోని సాయుధ బృందం గోవింద కుటుంబంపై వారు రాడ్లు, హాకీ కర్రలతో తీవ్రంగా కొట్టి, పదునైన పెద్ద కత్తులతో వారిని హతమార్చేందుకు ప్రయత్నించారు.
ఈ దాడిలో గోవింద షిల్, ఆయన భార్య మంజురాణి, మేనల్లుడు కృష్ణ శిల్, ఆయన కుమారుడు గౌతమ్ చంద్ర శిల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో హేర్ కృష్ణ శిల్ కూతురు మిథాలీ, గోవింద మేనల్లుడు భార్య పొపాయ్ రాణి కూడా తీవ్రంగా గాయపడ్డారు.
దాడిచేసే సమయంలో గోబిందా షిల్ కుటుంబాన్ని దేశం నుంచి తరిమివేస్తామని బెదిరించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసిన రోజే నిందితులను బెయిల్‌పై విడుదల చేశారు.
Inputs: Hindu posts