500-year-old idols from Jain temple in Jaipur |
విస్తుగొలిపే సంఘటనలో, రాజస్థాన్లోని జైపూర్లోని ఘాట్ కి గుని ప్రాంతంలోని దిగంబర్ జైన దేవాలయం నుంచి సుమారు 30 పురాతన విగ్రహాలను దొంగిలించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే., సోమవారం ఈ సంఘటన జరిగింది, పార్షవ్నాథ్ బోహరా జీ ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన దొంగలు పూజారి నిద్రిస్తున్న గదిని తాళంవేసి, అక్కడ ఉన్న ₹ 65,000 నగదును, వెండి వస్తువులను దొంగిలించి, సుమారు 500 సంవత్సరాల పురాతనమైన విగ్రహాలను తీసుకెళ్లారు. ఆలయ పూజారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు చేశారు.
విషయం తెలుసుకున్న ఆలయ వర్కింగ్ కమిటీ సభ్యులు పోలీసులతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని, రాష్ట్రంలోని జైన దేవాలయాలను కాపాడాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒక పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ, “అష్టాధాతు (ఎనిమిది లోహాలు) తో కూడిన 30 విగ్రహాలు దొంగిలించబడ్డాయి. ఈ విగ్రహాలలో కొన్ని దాదాపు 500 సంవత్సరాల పురాతనమైనవి. మేము ఆ స్థలాన్ని సందర్శించి పూజారులు మరియు ఇతరుల వాంగ్మూలాలను తీసుకున్నాము. ” ఈ సంఘటనలో ఒక వ్యవస్థీకృత ముఠా హస్తముందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని మరో అధికారి తెలిపారు. నేరస్థుల త్వరగా పట్టుకునేందుకు సిసిటివి కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది డిసెంబర్ లో ఒడిషాలోని ఖుర్దా జిల్లాలోని 13వ శతాబ్దానికి చెందిన శివాలయంలో కోట్ల రూపాయల విలువైన 22 పురాతన విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే.
ఒడిశాలోని ఖుర్దా జిల్లా బన్పూర్ పట్టణంలోని 800 ఏళ్ల దక్ష ప్రజాపతి ఆలయ గర్భగుడిలోకి కొందరు గుర్తుతెలియని దుండగులు వచ్చి మూడు ద్వారాల తాళాలు పగులగొట్టి విలువైన విగ్రహాలతో పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగిలించిన విగ్రహాలలో కనకదుర్గ, గోపినాథ్ దేవ్, కలియుగేశ్వర్ దేవ్, చంద్రశేఖర్ దేవ్ విగ్రహాలు ఉన్నాయి. కొన్ని విగ్రహాలలో అష్టధాతు (బంగారం, వెండి, రాగి, జింక్, సీసం, తట, ఇనుము, పాదరసం) తో తయారు చేశారు.