రామ భక్తురాలు 11 ఏళ్ల “భవిక మహేశ్వరి” |
గుజరాత్ లోని సూరత్ కి చెందిన 11 ఏళ్ల “భవిక మహేశ్వరి” అనే చిన్నారి అయోధ్య రామమందిర నిర్మాణం కోసం గుజరాత్ లోని గ్రామగ్రామానా రామకథను చెప్పడం ద్వారా 50 లక్షలు సేకరించింది. దివ్య రామమందిర నిర్మాణం కోసం రామ భక్తుల నుండి ఈ నిధిని సేకరించినట్లు ఆ చిన్నారి తెలిపింది.
6వ తరగతి చదువుతున్న పదకొండేళ్ళ చిన్నారి భవిక మహేశ్వరి లాక్డౌన్ సమయంలో పాఠశాల విద్యతో పాటు భగవద్గీతను, రామాయణం పఠనం ద్వారా, శ్రీరాముని యొక్క దివ్యచరిత్రను తెలుసుకోవడం జరిగిందని, శ్రీరాముని కథను చెప్పడం ద్వారా భవ్య రామమందిర నిర్మాణానికి దోహదపడవచ్చు అని గ్రహించి, వెంటనే ఆ శ్రీరాముని కథలు చెప్పడం ఆరంభించింది. తద్వారా ఈ నిధిని సేకరించడం జరిగిందని ఆ బాలిక వెల్లడించింది.
రామ భక్తురాలు 11 ఏళ్ల “భవిక మహేశ్వరి” |
రామ భక్తురాలు 11 ఏళ్ల “భవిక మహేశ్వరి” |
చిన్నారి భవిక రామకథను ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే…. ఆమె కధ చెబుతుంటే ప్రజలు తమని తాము మైమరచి పోతున్నారు, తెలియని తన్మయత్వానికి లోనవుతున్నారు. ఒక 11 ఏళ్ల చిన్నారి ఇంత గొప్పగా రామకథను చెప్పడం దేశంలో ఇదే మొదటిసారి.
ఆ చిన్నారి రామకథను చెబుతుంటే వేలాది మంది వింటున్నారు. కథ విన్న తరువాత అక్కడున్న వారికి ఆమె విజ్ఞప్తి చేస్తుంది అయోధ్య రామాలయ నిర్మాణానికి నిధిని సమర్పించి నిర్మాణంలో భాగాస్తులవ్వండి అని. వెంటనే వారు వారికి తోచిన విధంగా నిధిని సమర్పిస్తున్నారు.
చిన్నారి భవిక మాట్లాడుతూ తన అవ్వా తాతలు, తల్లిదండ్రులు తనను రామకథను పఠించడానికి ప్రేరేపించారని చెప్పింది. వారు ఇచ్చిన ప్రోత్సాహం, ఆ శ్రీరాముని కటాక్షంతోనే తాను శ్రీ రాముని కథను చెబుతున్నట్లు వివరించింది. “దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యం మేరకు స్వామి వారికి నిధిని సమర్పించండి.” అని ఆమె విజ్ఞప్తి చేస్తోంది.
రామ భక్తురాలు 11 ఏళ్ల “భవిక మహేశ్వరి” |
భవిక తండ్రి రాజేష్ మహేశ్వరి మాట్లాడుతూ, “ప్రజలు తమదైన రీతిలో శ్రీ రాముని ఆలయాన్ని నిర్మించడానికి నిధిని సమర్పిస్తున్నపుడు, నా కుమార్తె కూడా రామకథను చెప్పడం ద్వారా రామాలయ నిర్మాణానికి ఆమె తోడ్పడుతుండటం మా కుటుంబానికి గర్వకారణంగా ఉందన్నారు. 6 తరగతి చదువుతున్న భవిక, మొబైల్ అడిక్షన్ క్లినిక్ మరియు టాలెంట్ వరల్డ్ వ్యవస్థాపకారాలు కూడా.
__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)