Gloria Arira |
భారతీయ నాగరికత, మరియు సంస్కృతి మూలంగా ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అతి ప్రాచీన నాగరికతగా పేరుగాంచింది మన భారతావని. భారత సంస్కృతిని భారత్‌లో మాత్రమే కాకుండా కిరస్తానీయుల దేశమైన బ్రెజిల్ లో ఒక మహిళ సనాతన ధర్మాన్ని 40 ఏళ్లుగా అక్కడి దేశస్తులకు నేర్పుతోంది.
గ్లోరియా 1974లో ముంబై కి వచ్చినప్పుడు భారత్ సంస్కృతి మరియు సనాతన ధర్మాన్ని గురించి నేర్చుకుంది, ఆ తర్వాత ఈ భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు తన జీవితన్ని అంకితం చేసింది.
గ్లోరియా ఎప్పుడూ మతాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. 1973వ స౦వత్సర౦లో, ఒక సెమినార్ కోస౦ స్వామి చిన్మయానంద బ్రెజిల్ వచ్చినప్పుడు గ్లోరియా ఈ సదస్సుకు హాజరవ్వాలని నిర్ణయి౦చుకున్నాను.
1974 లో రెండు సెమినార్లకు హాజరైన తరువాత, గ్లోరియా భారత్ కు వచ్చి ఇక్కడ పూర్తిగా వైదిక ధర్మము మరియు సంస్కృతి గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకుంది.
🇮🇳-🇧🇷| Honouring our greatest treasure - our people.
— Anurag Srivastava (@MEAIndia) January 25, 2020
On the eve of the 71st #RepublicDay graced by the Brazilian Pres @jairbolsonaro as the Chief Guest, India honours two inspirational Brazilian women Lia Diskin & Gloria Areria with Padma Shri, our 4th highest civilian award. pic.twitter.com/jGcyID3ZNV
గ్లోరియా తన బ్లాగ్ లో ఇలా వ్రాస్తూ.., " తాను మొదటిసారి భారత్ కు వచ్చినప్పుడు, చాలా చిన్నవయస్సులో ఉండేదానినని చెప్పింది. పాశ్చాత్య యువతి అయినప్పటికీ, స్వామి చిన్మానంద్ ఆమెను విద్యార్థిగా స్వీకరించేందుకు అంగీకరించారు, ఆమె విద్యాభ్యాసం ముంబైలోని "సందీప్పని సాధనలయంలో జరిగింది. విద్యాభ్యాస సమయంలో, స్వామి సరస్వతి ఆమె రెండవ గురువు గా మారి, వైదిక మరియు వేదాంత జ్ఞానాన్ని గ్లోరియాకు అందించారు.
1979లో బ్రెజిల్ కు తిరిగి వచ్చిన తరువాత, గ్లోరియా భారత్ నుండి అందిపుచ్చుకున్న వైదిక జ్ఞానాన్ని అక్కడి పోర్చుగీసు ప్రజలకు వేద జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించింది. కొన్ని స౦వత్సరాల తర్వాత, 1984లో బ్రెజిల్‌లోని 'రియో డి జనీరో' అనే నగరంలో తన సహచరుల సహాయ౦తో గ్లోరియా విద్యామ౦దినికి పునాది వేసి౦ది.
ఈ విద్యా మందిరంలో వైదిక ధర్మాన్ని, వేదాలు, ఉపనిషత్తులు గూర్చి వివరించడంతో పాటు మహాభారతం, భగవద్గీత, రామాయణం కూడా ఇక్కడ పఠిస్తారు.
Gloria Arira receives Padma Shri award |
హిందూ ధర్మాన్ని మరింత మందికి వ్యాప్తి చేయడానికి గ్లోరియా భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించింది. భారత్ లోని పలు ఆశ్రమాలను సందర్శించినప్పుడు గ్లోరియా సంస్కృత భాష నేర్చుకుంది. భగవద్గీతలో రాసిన విషయాలను సరళమైన రీతిలో వివరిస్తూ గ్లోరియా తన పుస్తకంలో కొన్ని సంస్కృత పదాలను కూడా ఉపయోగించింది
రియో డి జనీరోలో ఉన్న విద్యామందిరంలో ఆచార్య హండ్రిక్ కాస్ట్రో ప్రతి శుక్రవారం సరస్వతీ పూజ నిర్వహిస్తారు. భారత్ లో వైదిక క్యాలెండర్ లో పొందుపరచిన అన్ని పండుగలు కూడా బ్రెజిల్ లో అత్యుత్తమ రీతిలో జరుపుకుంటారు. వైదిక సనాతన ధర్మనికి అనుగుణంగా విద్యామందిరంలో మకరసంక్రాంతి, మహాశివరాత్రి, రామనవమి, హనుమాన్ జయంతి, జన్మాష్టమి, దీపావళి వంటి అన్ని పండుగలు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.