పశ్చిమ బెంగాల్లో చురుకుగా పనిచేస్తున్న హిందూ అనుకూల సంస్థ "హిందూ సంహతి" ఆదివారం తన రాజకీయ పార్టీ జన సంహతిను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది 2021 మార్చి-ఏప్రిల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తోంది. 294 సీట్లలో కనీసం 170 మందితో పోటీ చేయాలని పార్టీ యోచిస్తోంది.
హిందూ సంహతి 2008 లో ఏర్పడింది :
ఆదివారం నాడు తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న హిందూ సంహతి తూర్పు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా దక్షిణ బెంగాల్ లో బాగా ప్రజలలోకి వెళ్లి బలపడింది.
ఈ సంస్థను 2008 లో మాజీ రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్ తపన్ ఘోష్ స్థాపించారు. 2020 జూలైలో ఘోష్ COVID-19 తో బాధపడుతూ అనారోగ్యంతో మృతి చెందాడు.
ఈ హిందూ సంహతి సంస్థ పశ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న హింసను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ హిందువులకు రక్షణగా ఇతర హిందూ NGO ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. పశ్చిమ బెంగాల్ లో హి౦సకు గురైన హి౦దువులకు చట్టపరమైన మద్దతునిస్తూ వారికి సహకరిస్తోంది. ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన సభ్యులచే అపహరించబడ్డ అనేక మంది హిందూ మహిళలు మరియు మైనర్లను తిరిగి రప్పించడంలో హిందూ సంహతి సంస్థ కీలకపాత్ర పోషించింది
2017 లో బసిర్హత్ మత కలహాల సమయంలో 'హిందూ సంహతి' హిందువులకు రక్షణగా ఉంటూ హిందువులపై జరుగుతున్న దారుణాలను ప్రపంచానికి తెలిసేటట్టు చేస్తూ హిందువులలో చైతన్యం కలిగించింది. ఆ సమయంలో తపన్ ఘోష్ ఇద్దరు హిందూ మైనర్ బాలురకు చట్టపరమైన రక్షణ కల్పించాడు, వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లికుండా ఘోష్ కాపాడారు.
"ఇప్పటి వరకు 'హిందూ సంహతి' స్వతంత్ర సంస్థగా కొనసాగుతోంది. రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్న జన సంహతి ఉత్తర బెంగాల్ లో 40, దక్షిణ బెంగాల్ లో 130 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ సంస్థ 2019 లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి మద్దతునిచ్చింది.