ఢిల్లీలో జరిగిన ఒక ఘోరమైన సంఘటనలో, తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకు 17 ఏళ్ల బాలిక 'నీతూ'ని హత్య చేసిన లాయక్ ఖాన్.
వివరాలలోకి వెళితే, చాలా రోజుల నుంచి లాయక్ ఖాన్ తనను వివాహం చేసుకోవాలని నీతూపై ఒత్తిడి చేస్తున్నాడు, కానీ ఆమె అందుకు నిరాకరింస్తూ వస్తోంది. శుక్రవారం సాయంత్రం అతను వాయువ్య ఢిల్లీలో గల రోహిణిలోని ప్రాంతంలో ఉన్న నీతూ నివాసానికి వెళ్లి ఇంటిలో ఉన్న ఆ బాలికను సుత్తితో తలపై మోది హత్య చేసినట్లు నేవైదికల ద్వారా తెలుస్తోంది.
పరారీలో ఉన్న లాయక్ ఖాన్ ను పట్టుకునేందుకు పోలీసులు 6 బృందాలను ఏర్పాటు చేశారు. నీతూ పినతండ్రి కొడుకు కౌశల్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
నీతూ పినతండ్రి కొడుకు మీడియాతో మాట్లాడుతూ " నేను శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మా సోదరి ఇంటికి వెళ్లాను. ఆమెతో మాట్లాడేందుకు లాయక్ ఖాన్ కూడా వచ్చాడు. రెండు మూడు నెలలుగా తనను పెళ్లి చేసుకోమని లాయక్ ఖాన్ ఒత్తిడి చేస్తూన్నాడని, కానీ లాయక్ ఖాన్ను తాను ఒక స్నేహితుడిగా మాత్రమే భావించానని నాతో చెప్పింది".
నిందితుడు లాయక్ ఖాన్ |
ఆరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో, లాయక్ ఖాన్ నాకు రూ. 200 డిన్నర్ కొరకు చికెన్ మరియు కూరగాయలు తెమ్మని చెప్పాడు. నేను 7:45 Pm కి తిరిగి వచ్చినప్పుడు, లాయక్ తలుపుకు తాళం వేసి, సుత్తితో గబగబా వెళ్లిపోవడం చూశాను. నేను ఆగమని అడుగుతున్నా ఆగకుండా అతను హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు' అని కౌశల్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పాడు.
“ అనుమానంతో నేను ప్రక్కన నివాసముంటున్న వారి సహాయంతో ఒక సుత్తి తీసుకుని తలుపులు పగలగొడుతున్నప్పుడు, ఎదో పనిమీద బయటకు వెళ్లిన నీతు తల్లి కూడా తిరిగి వచ్చింది. తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లి చూడగా నీతు ముఖం మరియు తలపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళాము, వైద్యులు పరీక్షించి ఆమె చనిపోయినట్లు తెలిపారు, ”అని కౌషల్ చెప్పారు.
ఈ హత్య గురించి (రోహిణి ప్రాంత) డిసిపి పిఎల్ మిశ్రా,మాట్లాడుతూ, "బాలిక కుటుంబం గతంలో బవానాలో ఉండేది, అక్కడ నిందితుడు నీతూకి పొరుగువాడు. ఇద్దరి కుటుంబాలూ ఒకరికొకరు తెలుసు. లాయక్ ఖాన్ తరచూ ఆ అమ్మాయి ఇంటికి వచ్చివెళ్లేవాడు. దాదాపు నెల రోజులుగా నీతూ ఇంటికి వస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో 11వ తరగతి చదువుతున్న బాలికను నిందితుడు హత్య చేశాడు."