ఉత్తరాఖండ్ లోని ఆల్మోరా జిల్లాకు చెందిన ద్వారహత్ అనే చిన్న పట్టణంలో నిన్న 800 సంవత్సరాల నాటి పురాతన మృత్యుంజయ ఆలయాన్ని ధ్వంసం చేశారు. 11 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయాన్ని ఉత్తరాఖండ్ చెందిన కాట్యూరి రాజవంశం నిర్మించింది. దశాబ్దాలుగా ఈ ఆలయం భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది. అయినప్పటికీ స్థానికులు అక్కడ ప్రతిరోజూ పూజలు చేస్తారు. ద్వారాహత్ పట్టణం అనేక పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఎన్ని ఆలయాలు ఉన్నప్పటికీ మృత్యుంజయ ఆలయం మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధి చెందింది. 18 శతాబ్దంలో ఈ ఆలయం మీద అఫ్గాన్ రోహిల్లాలు దాడి చేశారు. కానీ అక్కడి ఆనాటి కుమాన్ సైన్యం ఎదురుతిరిగి ఆలయాన్ని సంరక్షించింది. అప్పటి నుండి ఈ ఆలయం నిరంతరం విశేషపూజలు అందుకుంటూ ఉంది.
బుధవారం నాడు కొందరు భక్తులు మృత్యుంజయ ఆలయ ప్రాంగణంలో ఉన్న భైరవాలయంలో పూజలు చెయ్యడానికి వెళ్ళినప్పుడు ఆలయంలోని శివలింగాన్ని కిందవరకు కోసి తీసుకెళ్లినట్లు గుర్తించారు.
పురాతత్వ శాఖ అధికారులు ప్రాంగణంలో ఉన్నప్పటికీ, ఈ దొంగతనం జరగడం గమనార్హం. ఈ దొంగతనం పగటిపూటే జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. సీసీటివి ఫుటేజ్ లో ఆలయం నుండి ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకుని వెళ్లడాన్ని గుర్తించారు. కానీ ఈ విధ్వంసం ఒక వ్యక్తి చేసిన పని కాదని, ఇద్దరికి పైనే ఉంటారని పోలీసులు తెలిపారు.
పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ.., నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. కానీ పట్టణ ప్రజలు ఇది ఇతర మతస్తులు చేసిన పని అంటూ కోపోద్రిక్తులయ్యారు. వారిని శాంతింపజేయడానికి పోలీసులు స్థానిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా…. తాము విచారణ చేసి ఘటన యొక్క పూర్తి వివరాలు త్వరలోనే తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మత పరమైన ఉద్రిక్తలు వ్యాప్తి చేసే ప్రకటనలకు దూరంగా ఉండాలని పోలీసులు అభ్యర్ధించారు.
పోలీసు వారి ప్రకటన ప్రకారం “ఈ ఆలయం 11 వ శతాబ్దానికి చెందినదని కావడంతో, శివలింగ ఎగువ భాగం అంతర్జాతీయ మార్కెట్లో గణనీయమైన ధరను కలిగి ఉండవచ్చు.” అనే ఉద్దేశంతో తీసుకెళ్లి ఉండొచ్చు అంటున్నారు.
ఐపిసి 379, 427 కింద కేసు నమోదు చేశారు, పోలీసులు పెట్టిన సెక్షన్లను బట్టి దీనిని సాధారణ దొంగతనంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో మతాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే ప్రార్థనా స్థలం యొక్క విధ్వంసంగా వ్యవహరించే ఐపిసి సెక్షన్ 293 ను పోలీసులు చేర్చడం ఆసక్తికరంగా ఉంది. నిజానికి నేరపూరిత కుట్ర కోసం ఐపిసి 120 బిని పెట్టడానికి ఇది సరైన కేసు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు పోలీసులు ఈ విభాగాల నిబంధనలను ఎందుకు అమలు చేయలేదనే విషయం అర్థం కాలేదు.
నేడు భారత్ అంతటా హిందూ మత దేవాలయాలు దాడికి గురవుతున్నాయి. పోలీసులు దొంగలను పట్టుకుని కఠినమైన సెక్షన్లు పెట్టి శిక్షిస్తేనే వీటిని అరికట్టవచ్చు అని స్థానికుల అభిప్రాయం. ఉత్తరాఖండ్ దేవ భూమి కావడంతో కొంతకాలంగా హిందూ వ్యతిరేక శక్తుల ఇక్కడ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బలమైన హిందూ ప్రతిస్పందన మాత్రమే మన దేవాలయాలను, మన నాగరికతను కాపాడుతుంది. దేవాలయాలు ఒకప్పుడు మన పట్టణాలకు కేంద్రంగా అలాగే మన సామాజిక జీవితానికి కేంద్రంగా ఉండేవి. హిందువులు దేవాలయాలను తిరిగి గొప్పగా చేయదగిన సమయం ఇదే.
__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)
11th century temple vandalized in Uttarakhand
An 800 year old temple was vandalized in Uttarakhand yesterday. Located in the small town of Dwarahat in Almora district, the Mrityunjay temple was constructed by the Katyuri dynasty of Uttarakhand in 11th century. It has been under the care of Archaeological Survey of India since decades, although the locals also worship there everyday. Dwarahat has many ancient temples and Mrityunjay temple is one of the most revered of these.
On Wednesday when people went to offer the puja in the Bhairav temple situated in the Mrityunjay temple complex, the Shivalinga had been sawed off and stolen.
The theft had happened in broad daylight, even while the officials of ASI were present in the premises. According to reports, CCTV footage has shown a person with a bag running from the temple. The police have said that prima facie, more than 2 persons are likely to be involved in the vandalism.
The temple had once been attacked and desecrated by the Afghan Rohillas in 18th century, but the Afghans were quickly expelled by Kumaon army. since then, the temple had seen continuous worship.
The police has issued a statement and assured that perpetrators would be caught soon. The people of the town are agitated and the police had to meet with local representatives to pacify the people. Many locals are of the opinion that this has been done by people of other religion. However, police has released a statement saying that the real motives of the act are not known.
संदिग्धों की शीघ्र गिरफ्तारी के प्रयास किये जा रहे हैं। कृपया धैर्य बनाएं, पुलिस को सहयोग करें। pic.twitter.com/OcYl94Q6dv
— Almora police (@almorapolice) February 10, 2021
According to the police statement, “the upper part of Shivalinga might have a significant price in international market, considering that this temple is of 11th century.” It has also registered a case under IPC 379 and 427 which is for theft and mischief respectively. It has requested that people refrain from making any statements that may spread religious tensions. The sections in the FIR indicate that police is taking this as a simple theft.
It is curious that police did not invoke section 153A of IPC, which deals with promoting enmity between religions and section 295 of IPC, which deals with the destruction and vadalism of a place of worship. This is also a fit case for invoking IPC 120B for criminal conspiracy. It is incomprehensible why the police did not invoke the provisions of these sections while registering the FIR.
These persons who committed the crime knew that they will hurt religious feelings of Hindus and still went through it. They should not be booked just for theft and mischief. It is expected that police would not only arrest the perpetrators, but also book the criminals under appropriate sections. Hindu religious places are under attack all over Bharat.
Uttarakhand being Devbhumi has also been in the eyes of anti-Hindu forces for quite some time. Only a strong Hindu response will save our temples and our civilization. Temples were once the center of our towns as well as centers of our social life. It is time for Hindus to make temples great again.
Source: hindu post