Guru Gobind Singh |
రచన: సత్యపాల్ పాటయిత్
అనువాదం: లక్ష్మీనారాయణ
(ములారచన): ఎల్.యస్. శేషగిరిరావు
సకల జగత్ 'మే ఖాల్సా పంథ్' గాజే జగే ధరమ్ హిందూ తురక భండబాజే ||
' ప్రపంచమంతా ఖాల్సాపంధ్ ను ప్రస్తుతించాలి తురకల దురాగతాలకు అంతం పలకాలి. హిందూ ధర్మం జాగృతం కావాలి. అన్న సందేశంతో హిందూ ధర్మరక్షణకై సిక్కు పంథాను రూపొందించిన మహనీయుడు 'గురుగోవిందసింగ్'.
జీవితమంతా యుద్ధరంగంలోనే గడిపి భార్యా బిడ్డలనందరినీ పణంగా పెట్టి, హిందూ
ధర్మం, దేశస్వాతంత్ర్యాలకోసమే పోరాడిన మహావీరుడు 'గురుగోవిందసింగ్'.
పవిత్రత, పరాక్రమం మేళవించిన ఒక నవీన సిక్కు పరంపరను సృష్టించిన మహాపురుషుని జీవితాన్ని ఈ వ్యాసంలో దర్శిస్తాం.
: గురుగోవింద సింగ్ :
"పక్షులతోనై నా కలసి పోరాడు" సామాన్యమైన పక్షులలో సైతం ఇంతశక్తిని జాగృతం చేయగల ఆత్మవిశ్వాసం ఎవరిలో ఉంటుందో అతనే సిక్కుల పదవగురువు గురుగోవింద సింహ అని గ్రహీంచాలి. గురునానక్ తో ప్రారంభమయిన గురు పరంపర పదవ గురువుతో సమాప్త మయింది. తన తరువాతనుండి గురుగ్రంధసాహిబ్ నే గురువుగా భావించాలని గురుగోవింద్ ఏర్పాటు చేసిన
పద్దతే నేటికీ ఆచరణలో కొనసాగుతోంది.
సమాజాన్ని సంస్కరించడానికి, ఏకాత్మత అఖండత, ధర్మంపట్ల నిష్ఠను సమాజంలో నిర్మాణంచేయడానికి, తద్వారా ఒక మంచి మార్పును సాధించే కృషిని ప్రారంభించడానికోసమే గురునానక్ సిక్కు పంథాను ప్రారంభించాడు. అనేక ఆటంకాలను ఈ ప్రయత్నంలో ఆయన విజయవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే గురుతేజ్ బహడూర్ బలిదానం తర్వాత ఆ పంథాకు అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. త్యాగం, బలిదానాలను కోరే ఒక నాయకత్వం అవసరమైంది. సరిగ్గా ఆ పరిస్థితులలో గీటురాయిపై గీచి ఎంపిక చేసినట్లు గురుగోవిందసింగ్ వ్యక్తిత్వం ప్రత్యక్షమైంది.
బాల్యములో గురుగోవిందసింగ్ |
బాల్యమునుండీ ధైర్యసాహసాలకు పెట్టింది పేరు:
గురుగోవిందుని చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ఇది. ఔరంగజేబు అత్యాచారాలకు బలియైన కాశ్మీరీ బ్రాహ్మణులు గురుతేగ్ బహదూర్ వద్దకు వచ్చారు. ఈ అత్యాచారాల నుండి విముక్తికి ఏదైనా మార్గాన్ని చూపమని కోరారు. గురుతేగ్ బహుదూర్ ఆలోచనలో పడ్డాడు. తండ్రి ఆలోచనలో పడడం చూచిన బాలగోవింద సింహుడు తండ్రిని కారణమడిగాడు. దానికి గురుతేగ్ బహదూర్ ఎవరో ఒక మహాపురుషుని బలిదానంతో కానీ ఈ సమస్య పరిష్కారం కాదు” అని అన్నాడు. వెను వెంటనే దానికి సమాధానంగా బాలగోవిందుడు, " మిమ్ములను మించిన మహాపురుషుడు వేరొకరెవరు?" అని అన్నాడు. అప్పటికి గోవిందుని వయస్సు 9 సంవత్సరాలే. ఇంత చిన్నవయసులో అంత నిబ్బరంగా, సూటిగా కొడుకు చెప్పిన మాటలు వినగానే గురుతేజ్ బహదూర్ హృదయం గర్వంతో ఉప్పొంగింది. "గురుతేజ్ బహదూర్ మతాంతరీకరణకు పాల్పడితే మతం మారటానికి బ్రాహ్మణులందరూ సిద్ధంగా ఉన్నారు” అని ఔౌరంగజేబుకు చెప్పించాడు. ఇక ఆ తరువాత ఢిల్లీలో గురుతేజ్ బహదూర్ యొక్క అమరమైన బలిదానం క్రొత్త చరిత్రను సృష్టించింది.
గురుపీఠాన్ని స్వీకరించకముందు గురుగోవింద సింహనికి ఇంతటి దూరదృష్టి ఉండేది. తండ్రినే బలిదానం చేయడానికి సంసిద్దుని చేసిన ఈ వీర కిశోరం ఈ భావననే తన కుటుంబంలో కూడా గాఢంగా నాటుకునేటట్లు చేశాడు. ఇద్దరు కుమారులు నవ్వుతూ నవ్వుతూ యుద్ద గంగంలో దూకారు. మరో ఇద్దరు చిన్నకుమారులు సజీవంగా సమాధి చేయబడ్డారు. వారినోటివెంట అబ్బా' అన్న ఒక్క బాధాకరమైన మూలుగు కూడరాలేదు. అలా తన కుటుంబం మొత్తాన్ని బలిదానంగావించి సమాజంముందు, దేశంముందు ఒక ఆదర్శాన్ని గురుగోవింద్ నిలబెట్టాడు. అంతేకాదు! సన్యాసిగా, బైరాగిగా మారిన ఒక యువకునిలో క్రొత్త ఉత్సాహం, సరియై నజీవన దృష్టి ఆయన నిర్మాణం చేశాడు. ఆ తదుపరికాలంలో అదే బందాబై రాగి విదేశీప్రభుత్వం పాలిట యమధర్మరాజుగా మారాడు. దేశంకోసం అర్పించడంలోనే తనజీవితానికి సాఫల్యం ఉందని అనుభూతి చెందాడు.
అక్బరు నిర్మాణం చేసిన రాజకీయపరమైన శాంతి పూర్తిగా నష్టమైన తరుణంలో గోవిందుని జననంజరిగింది. అదే సమయంలో ఔరంగజేబు కుటిల విధానాల కారణంగా పంజాబ్ మహారాష్ట్టరలలో సంఘర్షణలకు శ్రీ కారం చుట్టబడింది. నిజానికి ఇతరమతాలపట్ల అసహిఘత అనేది ఔరంగజేబుతో ప్రారంభమయినదికాదు. షాజహాన్ పరిసపాలన కాలం నుండి అది కొనసాగుతూ వస్తోంది.
1632వ సం.ములో షాజహాన్ తనరాజ్యంలో క్రొత్తగా దేవాలయాలు నిర్మించరాదని ఒక శాసనాన్ని చేశాడు. నిర్మాణంలో ఉన్నవాటిని కూలగొట్టించాడు. అక్బర్ గోవధపై విధించిన నిషేధం కూడా ఆసమయంలో తొలగించబడింది. వీటన్నింటి ఫలితంగా మొగలాయి పరిపాలన పై వ్యతిరేకత పెరగసాగింది. మధురసమీపంలో జాట్ ప్రజలు 'జమిందార్ గోకుల్' నాయకత్వాన తిరుగుబాటు చేసి మొగలు సర్దారును అతడి సైనికులనుచంపివేశారు. అప్పటికి గురుగోవింద్ వయస్సు కేవలం 3 సం॥|లే. ఈ తిరుగుబాటును పాలకులు అణగదొక్కినప్పటికీ లోలోపల అగ్నిరాజుకుంటూనే ఉంది. గురుగోవిందునికి 5 సం.ల వయస్సు వచ్చేసరికి రాజా ఛత్రసాల్ ఔరంగజేబుతో పోరాడుతున్నాడు. తరువాత సంవత్సరమే నారనేల్ కి చెందిన 'సత్నామీ సంప్రదాయ' ప్రజలు కంపించాయి. దుర్గాదాస్, మహారాణా రాజసింహల వీరగాధలు విన్న 13 సం.ల గురుగోవిందుని ఒళ్ళు పులకరించేది.
బలహీనసమాజం:
ఆ సమయంలో హిందూసమాజం, కుల మతాల పేరిట చీలిపోయి బలహీనపడి ఉంది. విదేశీయుల ఆక్రమణను ఎదిరించే శక్తి లేనిదై ఉంది. ఇటువంటి పరిస్థితులకారణంగా పంజాబును పాలించిన ఆఖరిరాజు అనంగపాలుని తరువాత గురునానక్ వరకు 450 సంవత్సరముల దాకా హిందూ సమాజానికి సహకారమందించేందుకు ఒక్కవ్యక్తి కూడా పంజాబులో ముందుకురాలేదు. గురునానక్ పంజాబులో ఉన్న పీడితులు, ఉషేక్షితులు ఆత్మవిస్మృతిలో ఉన్న వ్యక్తులను మొదటిసారి మేల్కొలిపాడు. ఇటువంటి రాజకీయ, సామాజిక పరిస్థితులలో గురుగోవింద సింహని జననం జరిగింది.
అది 1723 విక్రమశకం శుద్ధ సప్తమి (క్రీ శ..1666). గురుతేజ్ బహదూర్ తన భార్య గుజారి మరియు కొందరు శిష్యులతో కలిసి తూర్పు భారతయాత్రకు బయలుదేరాడు. గర్భవతిగా ఉన్న భార్యను కొందరు శిష్యులతో పాట్నాలో వదలి తేజ్ బహదూర్ అస్సాంకు వెళ్ళారు. అస్సాంలో సమయంలోనే ఆయనకు గురుగోవిందుని జన్మవిషయం తెలిసింది.
తండ్రి బలిదానం తరువాత గురుగోవిందుడు గురు పీఠాన్ని స్వీకరించాడు. అప్పటికి అయన వయస్సు 9 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత 8 సంవత్సరాల కాలం ఆయన ఆనందపూర్ లోనే ఉండి శాస్త్ర, శస్త్ర విద్యలను అభ్యసించాడు. అతని శిష్యులకు కూడా శిక్షణకు వ్యవస్థను ఏర్పాటుచేసాడు. చాలా దూర "ప్రదేశాలనుండి వచ్చిన కవులకు ఆశ్రయం కల్పించాడు. దూర దూరప్రదేశాలలో విస్తరించి ఉన్నసీక్కులకు హకుంనామాజారీ చేసి అస్త్ర, శస్త్రాలను, ధనాన్నిసేకరించాడు. ఒక చిన్న సేనను తయారుచేసి వారిని యుద్ధనీతిలో ఆటతేరిన వారిగా తయారు చేసాడు.
యుద్ధభూమిలో గురుగోవిందసింగ్ |
జీవితంలో మొదటియుద్ధం:
1689వ సంవత్సరం ఏప్రియల్ నెలలో గురుగోవిందుడు జీవితంలో మొదటి యుద్ధాంలో పాల్గొన్నారు. గురుగోవిందుని పెరుగుతున్న శక్తిని చూసి తోటి రాజులలో భయం పెరగసాగింది. జాతీయతా భావాన్ని మేలుకొలిపే గురుగోవిందునీ ప్రయత్నాలను వమ్ము చేయడానికి వారు అందరూ ఒకటైనారు.
కలిహార్ రాజు భీమ్ చంద్ కుమారుడు అజ్మీర్ చంద్ వివాహసందర్భంగా గద్వాల్ లో రాజులందరూ తమతమ సేనలతో సహా సమావేశమయ్యారు. వివాహం తరువాత గోవింద సింహనిపైన యుద్ధానికి సిద్ధమయ్యారు. పైవార్త తెలిసి పావుటా గ్రామంలో ఉన్న గోవింద సింహ యుద్ధ వ్యూహంలో భాగంగా భంగాని గ్రామంలో సైన్యాన్ని మొహరించి యుద్ధంలో స్వయంగా పాల్గొన్నాడు.
పంజాబ్ లోని సింహీరా ప్రాంతఫకీరు సయ్యద్ బహుదూర్ షాతో గురుతేగ్ బహదుర్ కు సంబంధాలుండేవి. అతడి సలహామేరకు గురుగోవిందసింగ్ 5వందలమంది పఠానులను తనసైన్యంలో చేర్చుకున్నాడు. కానీ కాలేఖాన్ అనే సర్దారు మినహా ఆసైన్యంలో మిగిలిన సైనికులందరూ శత్రువుల షక్షంలో చేరిపోయారు. సయ్యద్ బహదూర్ షాకు ఈ విషయం తెలిసింది వెంటనే అతడు తన 7 వందల మంది శిష్యులు, 4గురు కుమారులతో కలిసి గురుగోవిందునికి సహాయం చేసేందుకు బయలుదేరాడు.
సయ్యద్ బహదూర్ షా ఇద్దరుకొడుకులు చాలామంది శిష్యులు యుద్ధములో మరణించారు. యుద్ధములో గురు గోవింద్ సింగ్ గెలిచాడు. పర్వతరాజులు తమ సైన్యముతోసహా పారిపోయారు. గురుగోవింద్ సింగ్ విజయముతో ఆనందపూర్ కి తిరిగివచ్చాడు. తగిన సమయంలో సహకరించినందుకు సయ్యద్ ను ఘనంగా సత్కరించాడు. ఆ తరువాత ఆయన లోహగడ్, ఆనందగడ్, కేశగడ్, ఫతేగడ్ మొదలైన కోటలను నిర్మించాడు.
ఓడిపోయిన రాజులందరు గురుగోవింద్ సింగ్ తో సంధిచేసుకున్నారు. ఆ రాజులందరు ఔరంగజేబుకు వన్ను చెల్లించడం కూడా మానుకున్నారు. దానితో మొగలు సేనలు వారి రాజ్యాలపై దండెత్తి వచ్చాయి. కానీ గురుగోవింద్ సింగ్ సహాయముతో వారు మొగలు సేనలను తరిమి వేసారు. అయితే కొద్దిరోజుల తదుపరి మళ్ళీ బలహీనత కారణనుగా మొగలు చక్రవర్తితో సంధికి సిద్దపడ్డారు. ఔరంగజేబు ఆదేశముతో సుబేదారు దిలావర్ ఖాన్ సైన్యము అతని పుత్రుడు రుస్తు మ్ఖాన్ నేతృత్వంలో గురు గోవింద్ సింగ్ పై ఆక్రమణకు బయలుదేరింది. ఇరుషక్షాలు యుద్దానికి సిద్ధపడ్డాయి. కాని యుద్ధము ప్రారంభమయ్యేసరికి అక్కడి నదిలో పెద్ద ఎత్తున వరదరావడంతో మొగలు సేనలు వెనుదిరగవలసివచ్చింది. దీని తరువాత హస్సేన్ ఖాన్ అనే సేనాపతి రాజులనుండి రాజులు నుండి ధనాన్ని దోచుకోవడం ప్రారంభించాడు. గురు గోవింద్ సింగ్ సైన్యము హస్సేన్ ఖాన్ ను కూడా ఓడించి, వెనుకకు తరిమికొట్టింది. ఆసమయములో దక్షిణాన ఉన్న ఔరంగజేబు ఈవార్త విని తన కొడుకు ముఅజ్జమ్ను సైన్యంతో పంపాడు. మొగలు సైన్యం మిగిలిన రాజులను ఓడించినప్పటికీ, ఆనందపూర్ మాత్రము సురక్షితముగా నే నిలిచింది. ఈ విషయాలన్నీ గురుగోవింద్ సింగ్ తన 'విచిత్రనాటకము' అనే పుస్తకములో వ్రాసాడు.
మొగలు సేన తిరిగి వెళ్ళినప్పటికీ ఎప్పటికైనా తిరిగి వారితో సంఘర్షణ తప్పదని గురుగోవింద్
సింగ్ కు తెలుసు. అందుకే ఆయన సంసిద్ధముగా ఉండుటకు తగిన బలాన్ని తయారుచేసుకోవడము మొదలు పెట్టాడు. సమాజములోని సంపన్న వర్గం సమాజములో మార్పురావడానికి ఒప్పుకోరని, ఆలా మార్పు రావడంవల్ల తమకున్న ప్రత్యేక స్థానం పోతుందేమోనని భయపడతారని ఆయనకు తెలుసు. అందుకే సమాజములోని సామాన్యప్రజలను సమీకరించడానికి పూనుకున్నాడు.
వైశాఖీపండుగ దినం:
గురుగోవింద్ సింగ్ వైశాఖీపండుగ రోజున తన వేలమంది శిష్యులముందర సమావేశమై ఉన్నాడు. ఆ సమయంలో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆయన తన ఒరనుండి కత్తిని సర్రుగబైటకులాగి ఇలా ప్రశ్నించారు "మీలో ఎవరైన ధర్మం కోసం తన ప్రాణమర్పించేవారున్నారా?". ఈ ప్రశ్నవిన్న వెంటనే సభలో కలకలం బయలుదేరింది. ఈ కోలాహలం పెరిగి పెద్దదవడం చూసిన గురుగోవింద్ సింగ్ తిరిగి రెండుమూడు సార్లు అదే ప్రశ్న వేపాడు. ఇంతలో లాహోర్ కు చెందిన క్షత్రియయువకుడు దయారామ్ లేచి 'నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు. గురుగోవింద్ సింగ్ అతనిని లోపలకు తీసుకు వెళ్ళాడు. అప్పటికే అక్కడ కట్టి ఉంచిన మేక తల నరికి, అతనిని అక్కడే ఉంచి రక్తసిక్త మైన ఆ ఖడ్గంతోటి బయటికి వచ్చాడు. తిరిగి అదే ప్రశ్న వేసాడు. ఈసారి ఢిల్లీ నుంచి వచ్చిన జాట్ యువకుడు ధర్మదాస్ ముందుకు వచ్చాడు. అతనిని కూడా లోపలకు తీసుకు వెళ్ళాడు. తిరిగి వచ్చి అదే ప్రశ్న వేసాడు. మూడవసారి ద్వారకకు చెందిన చాకలి మోహన్ చంద్ ముందుకు రాగా అతనిని కూడా పై ఇద్దరిలాగే గదిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విధముగా మరి రెండుసార్లు ప్రశ్నించగా జగన్నాధపురికి చెందిన వంటవాడు హిమ్మత్, బీదరుకు చెందిన మంగలి సాహబ్ చంద్ముం దుకు వచ్చారు.
అయిదుగురితో పంచప్యారాలు |
పంచప్యారాలు:
గురుగోవిందసింహడు ఈ అయిదుగురికీ అందమైన బట్టలు తొడిగి, వారిని "పంచప్యారాలు” గా సంబోధించాడు. వారయిదుగురిని తీసికొని అతడు-సభలోనికి రాగానే సభలోనివారు ఆశ్చర్యపోతూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఈ 'పంచ ప్యారా' లలో ఒక్కడే క్షత్రియుడు. మిగిలిన నలుగురు తక్కువ వర్గాలుగా పిలువబడే వాటికి చెందినవారే. గురుగోవింద సింహ ముందుగావారికి దీక్ష నిచ్చాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ తానూ స్వయంగా అదే దీక్ష స్వీకరించాడు. ఖాల్పాను
గురుస్థానంలో ఉంచి గురువైన తను మాత్రం సామాన్య ఖాల్సగా వారిని సేవించాడు. తరువాత ఆయన వారితో కలిసి కూర్చుని భోజనం చేశాడు. తనకున్న సర్వాధికారాలను వారికిచ్చి వేశాడు. వారి చేత ఏ ప్రతిజ్ఞ చేయించాడో, తాను కూడా స్వయంగా అదే ప్రతిజ్ఞ తీసుకున్నాడు.
ఈవిధంగా గురుగోవిందసింహ తన ముందు తొమ్మిది తరాల నుండి వస్తున్న సిక్కు సముదాయాన్ని ఖాల్సా పద్ధతిలోకి నడిపించాడు. అయన ఈ విధంగా అన్నాడు. “ఈశ్వరునిపట్ల నిశ్చలమైన ఆరాధనలో నే తీర్థయాత్రలు, దానము, దయ, తపస్సు, సంయమనము ఉన్నాయని ఎవరు భావిస్తారో, ఎవరి హృదయంలో పూర్ణజ్యోతి యొక్క ప్రకాశం ఉన్నదో ఆ పవిత్రమూర్తి యే "ఖాల్సా“ గొప్ప, పేద, కులవర్గ భావాలు నాశనం చేసి, అందరూ సమానమే అని ఆయన ప్రకటించాడు. తన వారందరికీ తమ పేరు చివర సింహ శబ్దమును పెట్టుకోమని ఆదేశించాడు. ఈ సమయంలోనే ఆయన తన పేరు గురుగోవిందరాయ్ ని కూడా గురుగోవిందసింహగా మార్చుకున్నాడు.
'పహల్" సంస్కారము |
వాహిగురూజీకా ఖాలసా:
గురుగోవింద్ సింహడు బాహ్యంగా చేసే పనులు, గుర్తుల యొక్క అద్భుత శక్తిని గ్రహించ గలిగాడు. అతనిచే ప్రారంభించబడిన దీక్షాసంస్కారము 'పహల్' యొక్క వాస్తవిక అర్థము ఇదే. 'పహల్" సంస్కారములో అందరూ కలిసి ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా స్వీకరించిన నీటిని అమృతముగా భావిస్తారు. ఆయన ఒక క్రొత్త నినాదమిచ్చాడు.
- " వాహి గురుజీకాఖాలసా - వాహి గురుజీ కేఫతే "
- " ఖాలసా ఈశ్వరునివాడు ఈశ్వరుని విజయము నిశ్చయము "
ఆయన ఈ దీక్ష తీసుకున్న ప్రతిసిక్కుకు ఐదు బాహ్యచిహ్నాలను నిర్దేశించాడు:
1. పంచ కకారాలుగా పిలువబడే అవి జుట్టుముడి పెట్టుకోవడం - కేశ్,
2. తలలో దువ్వెన ఉంచుకోవడం.
3. కంగా చేతికి, కడియం ధరించడం
4. నడుముకు పట్టాధరించడం కచ్చ.
5. ఎల్లపుడు కత్తిని వెంట ఉంచుకోవడం - కృపాణ్.
ఈ ఐదునియమాలను ప్రతీ దీక్షాపరుడు తప్పనిసరిగా పాటించాలని ఆయన నిర్ణయించాడు. 'సమర్పణ' పరిశుద్ధత, దైవభక్తి', 'శీలము' మరియు 'శౌర్యము'.ల భావాలు ఈ చిహ్నముల వెనుకున్నాయని ఆయన భావించాడు.
'ఖలసా' పంథ్ నిర్మాణంలో తీవ్రమైన వ్యతిరేకతలు ప్రారంభమయ్యాయి 'పహల్' దీక్ష తీసుకున్న సిక్కులు తమ ఇండ్లకు వెళ్ళిన తరువాత దీనిని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఐతే కహిలూరు రాజు ఇది చాలా చెడ్డదిగా ప్రమాదమైనదిగాను తలచి భయపడిపోయాడు. గురుగోవింద్ సింగ్ ఒక మత సంప్రదాయాన్ని కాస్తా సంపూర్ణముగా రాజకీయ వ్యవహారాలలో కలపడం కహలూరు రాజుకు ఇష్టములేదు. ఆయన ఒక ఉత్తరములో గురుగోవింద్ సింగ్ ని ఆనందపూర్ విడిచి మరెక్కడికై నా వెళ్ళిపోమ్మని కోరాడు. కాని గురు గోవింద్ సింగ్ అందుకు ఒప్పుకోలేదు.
ఇదే అదునుగా తీసుకున్న , పర్వతరాజులు ఇరవై వేల సైన్యముతో గురుగోవింద్ సింగ్ మీదకు
యుద్ధానికి వచ్చారు. గురుగోవింద్ సింగ్ దగ్గర కేవలం ఎనిమిది వేల సైన్యము మాత్రమే ఉంది. అయినప్పటికీ ఖాలసా సైన్యం విజయము సాధించింది. రోపార్ వరకు శత్రువులము తరిమి కొట్టారు. ఈ యుద్ధము 1700 వ సం.ములో జరిగింది.
ఔరంగజేబుకు ఒక ప్రతినిధిని పంపారు. ఓడిపోయిన రాజులు నిరాశ చెంది, అతనితో పంపిన లేఖలో గురుగోవింద్ సింగ్ శక్తి వల్ల వారికి పెరుగుతున్న ఇబ్బందులు మరియు ఆయన రాజ చిహ్నాలను ధరించిన విషయాన్ని తెలియచేసారు. గురుగోవింద్ సింగ్ తానే. నిజమైన చక్రవర్తి నని భావిస్తున్నాడని "కూడా వ్రాసి పంపారు. అంతేకాక దీనితో ఔరంగజేబు పరిపాలన ప్రమాదములో పడింది అనే భయాన్ని కూడా కలిగించే విధంగా వ్రాసారు.
ఔరంగజేబు వెంటనే తగినచర్యలు తీసుకు న్నాడు. సర్ హింద్ మరియు లాహోరు సుబేదారులను గురుగోవింద్ సింగ్ మీద యుద్ధానికి పంపారు. యుద్ధములోకూడా మొగలు సేన ఓడిపోయింది. కాపీలూరు రాజు మరొకసారి ప్రయత్నించినప్పటికీ చివరికి నిరాశేమిగిలింది.
పర్వతరాజులకు బాధ పెరిగిపోసాగింది. సమయంచూసి గురుగోవింద్ సింగ్ ను దెబ్బతీసే ప్రయత్నములో వారు ఉన్నారు. అదే సమయములో మొగలు సర్దారులు సయ్యద్ బేగ్ , ఆలీఖాన్ అవేవారు లాహోరు నుండి ఢిల్లీ వస్తున్నారు. పర్వతరాజులు వాళ్ళిద్దరికీ రోజుకి రెండు వేలరూపొయలు ధనాన్ని ఇచ్చే ఒప్పందం పైన, వారిని గురుగోవింద్ సింగ్ పైన యుద్ధానికి ఆహ్వానించారు. వారి దగ్గర పది వేలమంది ఆయుధధారులైన సైనికులున్నారు. గురుగోవింద్ సింగ్ చమకౌర్ దగ్గర తన సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు. అక్కడే వారిమధ్య యుద్ధము జరిగింది. గురుగోవింద్ సింగ్ పరాక్రమానికి వ్యక్తి త్వానికి ప్రభావితుడయిన సయ్యద్ బేగ్ గురు గోవింద్ సింగ్ పక్ష ములో చేరిపోయాడు. తన స్నేహితుడి ఈచర్య ఆలీఖాన్ మనోనిబ్బరంపై దెబ్బతీసింది. అతడు యుద్ధభూమివదిలి పారిపోయాడు.
ఆనందపూర్ ముట్టడించిన ఔరంగజేబు సైన్యం ! |
ఆనందపూర్ ముట్టడి:
పర్వతరాజులు తన బలమైన సర్దారులు ఒడిపోవడం చూసి ఔరంగదేబు చాలా చింతా క్రాంతుడయ్యాడు. ఒక వెద్దపైన్యాన్ని పంపాడు. ఆ సైన్యములో సర్ హింద్, లాహోరు, జమ్ము సుబేదారుల సైన్యముకూడా కలసివుంది. ఇరువది రెండుమంది పర్వతరాజులు తమతమ సైన్యములతో కూడా వచ్చివారితో కలిశారు. గోవింద్ సింగ్ తన శక్తి కి తగ్గట్టు తయారయ్యాడు. మొదట పర్వతరాజులు, మొగలుల సైన్యము ఖాలసాసైన్యము చేతిలో నిలువలేక పోయింది. కాని కొద్దిరోజులలోనే ఆవిశాల మొగలు సైన్యము ఆనందపూర్ ను చుట్టుముట్ట గలిగారు. ఆనందపూర్ తో బయవారితో సంబంధము తెగిపోయింది.
ఆ ఊరిలో ధాన్యమునకు, నీటికి కరువొచ్చింది. ఆకలి, దాహంతో సైనికులు అలమటించారు. కోటవిడిచి బయటకు వస్తే, సుక్షితంగా విడిచి పెడతామని మొగలు సేనాని ఖురాను మీద పర్వతరాజులు గీతమీద ప్రమాణం చేసి సందేశాలు పంపసాగారు. కొందరు సైనికులు అందుకు అంగీకరించమని గురువును ఒత్తిడి చేయసాగారు. అప్పడు గురువు 'వెళ్ళదలచిన వారు వెళ్ళవచ్చని అయితే అందుకు ముందు గురు శిష్య సంబంధాన్ని తాము తెంచుకుంటున్నట్లు రాసివ్వమని అన్నాడు. 40 మంది సిక్కులు ఆ విధంగా వ్రాసిఇచ్చి కోట వదిలి వెళ్ళిపోయారు. కోట ముట్టడి మరింత బలంగా తయారైంది. ఎనిమిది మాసములు గడిచిన తరువాత గురుగోవింద్ సింగ్ కూడా ఆకోటను వదిలి వెళ్ళిపోవుటకు నిశ్చయించాడు. తన తల్లి, భార్యలు, నలుగురు' పుత్రులు అజీత్ సింగ్, జుజారాసింగ్, జొరావర్వర్ సింగ్, ఫతేసింగ్ ఇంకా తన మిగిలిపోయిన స్నేహితులతో కలిసి కోట వదిలి వెళ్ళిపోయాడు.
కాళరాత్రి:
అది 21 డిసెంబరు 1704 కాళరాత్రి. శత్రువులకు గురుగోవింద్ సింగ్ కోట నుండి బైటకువచ్చాడని తెలిసింది. వారు తమ ప్రమాణం మరిచిపోయి గురుగోవింద్ సింగ్ ను పట్టుకోవడానికి సరసానది ఒడ్డున వర్షం పడుతున్నప్పటికీ యుద్ధానికి తలబడ్డారు. గురుగోవింద్ సింగ్ తన కొడుకులు అజీత్ సింగ్ , జుజార్ సెంగ్ , మరో 40 మంది శిష్యులను తీసుకొని చముకౌర్ చేరుకున్నాడు. మిగిలిన అతని కుటుంబసభ్యులు అతని నుండి విడిపోయారు. చిన్నకొడుకులు రావజొసింగ్, ఫతేసింగ్ గురుగోవిందుని తల్లితో కలిసి వారికి ఇదివరలో వంటవాడుగా ఉన్న గంగారామ్ గ్రామానికి చేరుకున్నారు. కాని అతను విశ్వాస ఘాతకుడై వీరిని మోసగించాడు. ఆ పిల్లలిద్దరిని సర్ హెంద్ సుబేదారు వజీర్ ఖాన్ కు అప్పగించాడు. వజీర్ ఖాన్ వారిని 27 డిసెంబర్ 1704 నాడు సజీవ సమాధి చేయించాడు. గురుగోవిందుని తల్లి ఈ వార్త విని బాధతో ప్రాణాలు విడిచింది.
ఈ పిల్లలను సజీవసమాధి చేసేముందు నవాబు వీరిని ఇస్లాం మతం తీసుకోమని, వారు కోరిందేదైనా ఇస్తానని ఆశ చూపాడు. అయితే వారు ఒప్పుకోలేదు. “మా ధర్మం ప్రాణాలకంటే కూడా ప్రియమైనది. మేముమాచివరి శ్వాస వదిలే దాకా దానిని , వదలము. మేము గురుగోవింద్ సింగ్ పుత్రులం. మాతాత గురుతేగ్ బహుదూర్ ధర్మ రక్షణకై ఆహతయ్యారు” అని దృఢంగా సమాధానం ఇచ్చారు. దానితో నవాబు కోపోద్రెక్తుడై వారిని సజీవ సమాధి చేసాడు. సమాధి చేసే సమయములో అన్నయ్య కళ్ళలో నీరు కారడం చూసిన తమ్ముడు "అన్నయ్య నీ కళ్ళలోంచి నీరేమిటి? నీవు బలిదానము చేయడానికి భయపడుతున్నావా" అని అడిగాడు. దానికి అన్న సమాధానము చెప్తూ, “నువ్వు చాలా అమాయకుడివి. నేను మృత్యువును చూసి భయపడను. మృత్యువే నన్ను చూసి భయపడుతుంది. అందుకే అది ముందు నీవైపు సాగుతోంది. చిన్నవాడవై న నీవు ముందు బలిదానము చేయవలసివస్తున్నందుకే” నేను దుఃఖిస్తున్నాను అంటాడు. ప్రపంచచరిత్రలో ఇంత దారుణ హత్యలు ఇంకెక్కడా ఉదహరించలేదు. ఇంత చిన్న పిల్లలు ధర్మము గురించి బలిదానము చేసిన సంఘటన చరిత్రలో ఎక్కడా కనటడదు.
గురుగోవింద్ సింగ్ ఇద్దరు పిల్లలను సజీవ సమాధి చేస్తున్న దృశ్యం |
గురుగోవింద్ సింగ్ ఇద్దరు భార్యలు సుందరీ సాహిబాదేవి సోదరుడు మణిసింగ్ తో కలిసి ఢిల్లీ వెళ్ళిపోయారు. చమకౌర్ కోటలో జరిగిన యుద్ధంలో గురుగోవిందుని ఇద్దరు పెద్ద కుమారులు కూడా చనిపోయారు. కోటనాశ్రయించి ఉన్న40 మందితో ఇక అక్కడ సురక్షితముగా ఉండలేమని గ్రహించి గురుగోవిందసింగ్ మిగిలిన ముగ్గురు స్నేహితులను తీసుకొని కోటను విడిచాడు. వేరువేరు దిక్కులలో వారు బయలుదేరారు. మాచీవాడ అడవులలో ముళ్ళమధ్య చెప్పులు లేని పాదాలతో, ఆకులు, అలములుతింటూ గురువు తిరుగాడసాగాడు. బట్టలు చినిగి పోయాయి కాళ్ళకు చెప్పులు లేక నడవడం మూలంగా కాళ్ళు బొబ్బ లెక్కి, నడవలేక ఒకచోట విశ్రమించాడు. ఇక్కడే ఆయన నజీఖాన్, గనీఖాన్ అనే ఇద్దరు పఠాన్ల కంటబడ్డాడు. వాళ్ళకు ఆయనపట్ల ఎంతో భక్తి ఉండేది. గురుగోవిందసింహడు ఆనంద్ పూర్ లో ఉన్న పుడు మధ్యఆసియా నుండి తీసుకొనివచ్చిన గుఱ్ఱాలను వీరు ఆయనకు అమ్ముతూండేవారు.
తమ వెనక మొగలు సైన్యము ఉన్నప్పటికీ వారు ఆపదలో పడతామన్ని తెలిసికూడా వారు గురుగోవిందసింహని రక్షించారు. ఆయనకు ఫకీరు లాగా నల్లటి బట్టలు తొడిగారు. 'ఉచ్చ్-కా-పీర్ అని చెబుతూ ఆయనను ఒక పల్లకీలో కూర్చుండపెట్టుకొని బయలుదేరారు. ఉచ్ అంటే రెండు అర్ధాలు ఉన్నాయి. ఒకటి పెద్దఅని కాగా, రెండవది -ముల్లన్ కి సమీపంలోగల ఒక ముస్లింల పుణ్యక్షేత్రం.
ఒకసారి మొగలు సైన్యంలోని కొందరికి అనుమానం వచ్చింది. ప్రశ్నోత్తరాలు నడిచినా వారికి సంతృప్తి కలుగలేదు. విచారణకోసం కాజీ పీర్ మహమ్మద్ ను పిలిపించమన్నారు. అదృష్టవశాత్తు ఆ కాజీ గురుగోవింద సింగ్ కు చిన్నతనంలో పాఠశీభాష నేర్పేవాడు. అందుచేత అతడు పరిస్థితిని గ్రహించి, ఏదో సర్దిచెప్పి మొగల్ సైన్యాన్ని పంపివేసాడు. ఇక్కడ ఉండగానే కొన్నిరోజులకు తన కొడుకులు జొరావర్ సింగ్ , ఫతేసింగ్ చనిపోయారన్న హృదయవిదారకవార్త గురువుకు తెలిసింది. మెల్ల మెల్లగా పాత స్నేహితులు కలవడం మొదలు పెట్టారు. తిరిగి శక్తిని పెంచుకోవడం జరుగుతోంది. ఇదే సమయంలో సర్ హింద్ సుబేదార్ వజీర్ ఖాన్ గురువును వెతకడం మొదలు పెట్టాడు. గురువు సైన్యం ఖిండరాణాలో ఉండగా ఇరుషక్షాలు ఎదురుపడ్డాయి. యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో వజీర్ ఖాన్ సైన్యం ఓడిపోయింది. సిక్కు సైన్యము ఆనందంతో పండుగచేసుకొంది. మొగలు సైన్యము మాత్రం విచారంలో మునిగిపోయింది.
ఆ 40 మంది సిక్కులు |
ఆ నలభై మంది:
ఈ యుద్ధంలో విశేషం 40 మంది సిక్కులు అత్యంత విరోచితముగా యుద్ధంచేసి తమ ప్రాణాలర్పించడం. ఈ 40 మంది ఆనందపూర్ కోటనుండి గురుశిష్యసంబంధం తెంచుకుని వెళ్ళి పోయిన వారు. తమ ప్రాణాలను అర్పించి ముందు చేసిన దానికి వారు ప్రాయశ్చిత్తము చేసుకొన్నారు. అప్పటి నుండి శిక్కులు తాము ప్రతిరోజు చేసే ప్రార్ధనలో “నలభై మంది ముక్తులు” అనే పేరుతో వాళ్ళను శ్రద్ధగా స్మరిస్తారు. ఈ యుద్ధం జరిగిన కొండరాణా, వీరి వీరత్వానికి చిహ్నంగా 'ముక్త సర్'గా మారింది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వీరిని స్మరిస్తూ ఇక్కడ ఒక పెద్ద జాతర జరుగుతూంటుంది. గురు గోవింద్ సింగ్ అక్కడ నుండి తల్వండి సాహెబ్ లో ఉన్న తన మిత్రుడు డల్లా వద్దకు చేరాడు. వాస్తవానికి ఈ చాలా శ్రేష్ఠమైనది. పంజాబ్ లోని చాలా పురాతన వంశాలకు చెందిన పెద్దలు, రాజవంశాలకు చెందినవారు ఇక్కడ ఉన్నారు. వారందరూ గురునుండి దీక్ష తీసుకొని ఖాల్సా పంథ్ లోనికి వచ్చారు.
ఇక్కడకు వచ్చిన తరువాత గురుగోవింద్ సింగ్ గురుగ్రంథ సాహెబ్ ను తిరిగి రూపొందించాడు. మెల్లి మెల్లిగా ఆస్థలము అధ్యయనానికి కేంద్రం అయిపోయింది. అంతేకాదు అది 'సిక్కు లకు కాశీ'గా ప్రసిద్ధి పొందింది. కధనం ప్రకారం ఇక్కడ ఉండగానే ఔరంగజేబు గురుగోవింద సింహని ప్రత్యేకంగా కలవడానికి పిలిపించాడు. దానికి జవాబుగా గురుగోవిందసింగ్ ఔరంగాజేబు గతంలో చేసిన విశ్వాసఘాతుకవైఖరిని గుర్తు చేస్తూ లేఖవ్రాశాడు. ఔరంగజేబు వెంటనే తన సర్లార్ లను పిలచి గురుగోవిందసింగ్ కు ఎటువంటి ఇబ్బంది కలుగ కూడదని ఆజ్ఞాపించాడు. గౌరవ పూర్వకంగా ఆయనను తనవద్దకు తీసుకొనిరమ్మనిమ్మని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఔరంగజేబు అహమ్మద్ నగర్ లో ఉన్నాడు. 1706 అక్టోబరులో గురువు రాజస్థాన్ గుండా దక్షిణానికి బయలుదేరాడు. దారిలో ఆయనకు ఘనమైన స్వాగతం పలికి గౌరవించారు. ప్రయాణం మధ్యలోనే 1707 పిబ్రవరి 20వ తేదీన ఔరంగజేబు మరణించిన వార్త తెలిసింది. ఈ వార్త తెలిసిన గురుగోవిందసింగ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళాడు. అక్కడే ఉన్న తన ఇద్దరు భార్యలను ఆయన కలిసాడు.
ఔరంగజేబు చనిపోయిన తరువాత అతని కొడుకులు సింహాసనం గురించి దెబ్బలాడు కొంటున్నారు. ఆసమయంలోనే ఒక కొడుకు ముఅజ్జమ్ గురుగోవిందుని . ఆశీస్సులకోసం వచ్చాడు. తరువాత అతనే బహదూర్ షా పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించాడు. కొన్ని రోజుల తరువాత బహదూర్ షా గురుగోవిందుని పిలిపించి ఘనంగా సత్కరించాడు కూడా. సన్మానంలో దర్బారు ఆచారంగా తనకు ఇచ్చిన కిరీటాన్ని ధరించడానికి గురువు ఒప్పుకోక, దానిని తన శిష్యుని ద్వారా తన శిబిరానికి పంపివేసాడు. బహదూర్ షా ఆయనను ఒక ఋషి పుంగవునిగా చూసేవాడు. ఢిల్లీ చక్రవర్తి తనను ఒక గురువులా భావించినప్పటికీ ఆయన బహదూర్ షాని ఒక మిత్రునిలా భావించారు. బహదూర్ షా తన సోదరుడు ఖంజక్ట్ దుర్మార్గాలను అణచడానికి సైన్యంతో దక్షిణానికి వెడుతూన్నప్పుడే ఆయన కూడ దక్షిణానికి బయలుదేరాడు. మొగలు సేనలు ముందుకు సాగుతూండగా గురువు గోదావరి ఒడ్డున నాందేడ్ లో ఆగిపోయాడు.
బందాభై రాగి తో గురు గువింద్ సింగ్ |
బందాభైరాగి:
ఉజ్జయినిలో దావూడ్ మతానికి చెందిన గురునారాయణదాస్ తో గురుగోవిందసింహడు కలసినప్పుడు, ఆయన నా వేల్ లో ఒక బెరాగి ఉన్నాడని, అతను అద్వితీయమైన శక్తికలవాడని, చూడదగిన వాడని చెప్పినట్లు అందరూ చెప్పుకొంటారు. ఆ బైరాగి మాధవ్ దాస్‌తో గురుగోవిందుడు. నాందేడ్ లో కలుసుకోవడం జరిగింది. గురుగోవిందసింగ్ అతని ఆశ్రమానికి వెళ్ళిన సమయంలో మాధవ్ దాన్ ఆశ్రమంలో లేడు. గురువు అతడి పీఠంపై కూర్చున్నాడు. మాధవ్ దాస్ వచ్చి గురుగోవింగసింహని గద్దెదింపడానికి తన మంత్ర విద్యలను ప్రదర్శించాడని, అవేవీ గురువుపై పనిచేయకపోవడంతో మాధవ్ దాస్ ఆయనను మహాత్మునిగా గుర్తించాడని చెబుతారు.
అతనికి కర్మసందేశాన్ని ఉపదేశించాడు. దేశంలోని పరిస్థితులను అతనికి వివరించాడు. బైరాగి మాధవ్ దాన్ గురువు ఉపదేశానికి ప్రభావితుడై ఆయనకు తాను స్వయంగా 'బందా' - దాసుడై ప్రకటించుకున్నాడు. ఈవిధంగా బైరాగి మాధవ్ దాన్ బందాబైరాగి అయినాడు. తన జీవన సర్వస్వాన్ని గురువుకు అర్పించాడు. గురుగోవింద్ సింగ్ అతడిని తన వారసునిగా పంజాబుకు పంపాడు.
పఠాన్ సైనికుడు దాడిలో గాయపడిన గురుగోవిందపింహని! |
నాందేడ్ లో మృత్యువు:
నాందేడ్ చేరిన తరువాత ఒకమాసంలోనే గురుగోవిందపింహని జీవనలీల సమాప్తమైంది. 1708 ఆక్టోబరు 7వ తేదిన ఒక పఠాన్ సైనికుడు ఆయన పై కత్తితో దాడి చేసాడు. గురువు ఆ సమయమున విశ్రాంతి తీసుకొంటున్నాడు. దగ్గరలో ఆయనకు రక్షణగా ఎవరూలేరు. గురువు తన పక్కనే ఉన్న కత్తితీసి ఆ పఠాన్ ను అంతం చేశాడు. గురువు కేకలకు శిష్యులు వచ్చారు. వారు బైటఉన్న ఆపఠాన్ అనుచరులిద్దరిని పట్టి చంపేపారు. వెంటనే గురువు గాయాలకు మందు వేసి ఉపశమనం పొందేలాచేసారు. నాలుగు రోజులు గడిచాయి. అయితే తన అంతిమ సమయం సమీపించిందని అంటూ తెలిసిన గురుగోవిందుడు శిష్యులను దగ్గరకు పిలిచి "వాహెగురుజీకి ఫతే” అంటూ ప్రాణాలువిడిచాడు.
మరణించేనాటికి ఆయన వయస్సు కేవరం 42 సంవత్సరాలు. నాందేడ్ లో ఆయనకు జ్ఞాపక చిహ్నముగా కట్టిన గురుద్వారా "పాజర్ సా హెబ్" పేరుతో ఒక తీర్ధక్షేత్రమయింది. భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. " ఎప్పుడు ధర్మమునకు కీడు జరుగుతుందో, అప్పుడు నేను అవతరిస్తాను. " గురుగోవింద్ సింగ్ కూడా ఇవే మాటలు చెప్పాడు. " నేను ధర్మరక్షణ చేసి, సాధుసంతులను రక్షించడానికి జన్మిచడం జరిగింది " సాధువులను రక్షించడము, దుష్టుల వినాశనము జరిగితేనే ధర్మం నిలిచి ఉంటుంది.
' తేగ్ ' కీ జయహో:
గురువు తన జీవితమంతటిని దారిద్రంచేత పీడించబడుతూ, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన సమాజంలో ఆత్మవిశ్వాసము, సహనము నిర్మించడానికి వినియోగించాడు.
డాక్టర్ నారంగ్ చెప్పినట్లుగా కత్తికి, తుపాకీకి దూరంగా ఉండే వారు సైతం విరులుగా యుద్ధం చేసారు. చాకలి, మంగలి, చెప్పలు కుట్టుకునే వారుకూడ అందరూ ఆశ్చర్యపోయేటంతగా వీరులుగా మారారు. గురుగోవిందుసింగ్ తన రచనలలో పరమాత్ముని గురించి అనేక రకాలుగా
వర్ణించారు అయితే ఆయనకు " కాలు"ని పేరు చాలా ఇష్టం. “మంచివారికి సుభాన్ని కల్పించడానికి, దుష్టులను నశింవచేయడానికి, ప్రపంచాన్ని సుస్థిరవరచడానికి నేను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి “తేగ్” - ఖడ్గం ఒక్క టేసాధనం. 'తేగ్ 'కీ జయహో - ఖడ్గానికి జయమగుగాక అని ఆయన వ్రాసుకున్నాడు.”
వీరభక్తుడు:
గురుగోవింద సింగ్- హిందూశక్తి నంతటిని సమీకరించాడు అనడానికి శైవ, శాక్తీయ, వైష్ణవ సాహిత్యానువాదం ప్రమాణంగా కనబడుతుంది. గురుగోవిందసింగ్ వ్యక్తిత్వం అద్వితీయమైనది. ఆయన ఒక భక్తుడు. దానితోబాటు అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమం నడిపిన నాయకుడు కూడా. సూరదాన్, తులసీదాన్, కబీర్, గురునానక్ లు అందరూ భక్తులే. కాని గురుగోవిందసింగ్ వీరత్వంతో కూడిన భక్తుడు, దానితోబాటు మానవులందరు సమానమని, అందరి హృదయాలలో ఒకే జ్యోతి ప్రజ్వతిస్తున్నదని ఆయన ప్రగాఢ విశ్వాసం.
లక్ష్మమందితో ఒక్కడివై పోరాడు:
గురుగోవింద సింగ్ కాలంలో దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉంది. విదేశియుల పరిపాలన ప్రారంభమై ఆనాటికి 600 సంవత్సరాలైంది. ప్రజలపై అత్యాచారాల ద్వారా కొంతకాలం, సంఘర్షణలతో కొంతకాలం, అప్పడో ఇప్పుడో మంచితనంతో కొంతకాలం దేశంలో విదేశీపాలననడిచింది. తమ శక్తినంతటినీ భారతదేశ సంస్కృతి, ధార్మిక విశ్వాసాలను నాశనం చేయడానికే ఉపయోగించిన ఔరంగజేబువంటివారి పాలన సాగింది.
ఈ పరిస్థితులలో ఈ రాక్షసశక్తిని అరికట్టడానికి దేశ ప్రజలందరినీ మేల్కొల్పవలసిన పరిస్థితి ఏర్పడింది. గురుగోవిందసింగ్ విదేశిపరిపాలనలో నలిగిపోతున్న ప్రాంతాలలోని ప్రజలను సంఘటిత పరచాడు. సామాన్యప్రజలలో మార్పు తీసుకొని రావడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఆత్మవిస్మృతిని దూరం చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని కల్గించడానికి, "లక్ష మందితో ఒక్కడివై పోరాడు' అని. వారిలో ఉత్సాహాన్ని కల్గించాడు.
అందుకే భారతదేశ చరిత్రలో ఆయనకు అత్యంత శ్రేష్ఠస్థానం కల్పించబడింది.
米米米