"ఫ్రెండ్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన బాబ్ బ్లాక్ మన్ కశ్మీర్ సమస్యలో భారత్ కు బలమైన మద్దతుదారుగా ఉండి, కశ్మీరీ హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న వారిలో బాబ్ ప్రముఖుడు. ఇతను పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని ప్రపంచ వేదికపై బహిర్గతం చేసినందుకు , 2020 జనవరిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది."
లోయలో కశ్మీరీ పండిట్ల మారణకాండ 31వ సంవత్సరాలు దాటాయి. ఈ సందర్బంగా సోమవారం ఇంగ్లాండ్‌లోని ' కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ యూకే పార్లమెంట్ లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడున్నారు. బాబ్ బ్లాక్ మన్ ఒక కన్సర్వేటివ్ పార్టీ రాజకీయ నాయకుడు మరియు హారో ఈస్ట్ నియోజకవర్గం నుండి UK పార్లమెంటు సభ్యుడు.
1990 జనవరిలో సీమాంతర ఇస్లామిక్ ఉగ్రవాదులు కశ్మీరీ హిందూ పండిట్ వర్గానికి వ్యతిరేకంగా చేసిన హింసాకాండపై ఈ తీర్మానం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బాబ్ బ్లాక్ మన్, వేలమంది కాశ్మీరీ హిందువుల మారణకాండ తోపాటు విధ్వంసం మరియు పవిత్ర హిందూ స్థలాలను అపవిత్రం చేయడాన్ని ఖండించారు. నిర్దయగా చంపబడిన, మానభంగానికి గురైన, గాయపడిన కాశ్మీరీ పండిట్ల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు.
కశ్మీరీ పండిట్ల కుటుంబాలు ఇస్లామిస్టుల చేతిలో హింస నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు తమ స్వస్థలాలనుంచి నుంచి పారిపోవాల్సి వచ్చిందని ఆ తీర్మానం పునరుద్ఘాటించింది. ఈ భయంకరమైన మారణకాండ నుంచి బయటపడి, ఆయుధాలు ధరించే, దానికి బదులుగా విద్య, ఆకాంక్షను అవలంబించిన కాశ్మీరీ పండిట్ సమాజసభ్యులు చూపిన దృఢత్వాన్ని, ధైర్యాన్ని ఈ తీర్మానం ప్రశంసిస్తుంది" అని అయన కొనియాడాడు.
ఇంగ్లాండ్ లో నివసిస్తున్న కాశ్మీరీ పండిట్లతో బాబ్ |
కశ్మీరీ పండిట్లకు న్యాయం చేయాలని యూకే పార్లమెంట్ లో తీర్మానం
సీమాంతర ఉగ్రవాదాన్ని నిరసిస్తూ, కశ్మీరీ హిందువుల విషయంలో మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను నిరోధించడం ఆయాదేశాల , అంతర్జాతీయ సమాజం బాధ్యత అని ఈ తీర్మానం మరింత నొక్కి వక్కాణిస్తోంది.
UK పార్లమెంటులో ప్రవేశపెట్టిన తీర్మానం యొక్క పూర్తి పాఠం:
Full text of the motion moved un UK parliament
That this House commemorates with deep sadness and disappointment, the 31st anniversary of the attack in January 1990 by cross-border Islamic militants on the population of Jammu and Kashmir; expresses its condolences to the families and friends of all those who were killed, raped and injured in this massacre; condemns the desecration of the holiest sites in Jammu and Kashmir; is concerned that the Kashmiris who fled persecution have still not seen justice for the atrocities committed against them; commends the resilience and courage shown by the members of Kashmiri Pandit community who survived this gruesome ethnic genocide and who did not resort to taking up arms but instead pursued education and aspiration; deplores those sponsoring such cross-border terrorist attacks and demands that such attacks cease immediately; further notes that the international principle of the responsibility to protect obliges individual states and the international community to take effective measures to prevent the commission of genocide and crimes against humanity as suffered by the Kashmiri Hindu community; and urges the Government of India to fulfil its long-standing international commitment to recognise and acknowledge the worst form of genocide of Hindus in Jammu and Kashmir and enact the proposed Panun Kashmir Genocide Crime Punishment and Atrocities Prevention Bill in the Indian Parliament, therefore delivering the long awaited justice for the Kashmiri Pandits in exile.
You can read about my stance on the Indian government's decision to revoke article 370 here:https://t.co/eP9V8Y7SKt
— Bob Blackman (@BobBlackman) August 13, 2019
Source: Opindia