రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ధర్మ జాగరణ సమితి సహకారంతో శెట్టి బలిజ కులస్థులు తమ కులస్థులు 40 మందిని మతం మారకుండా కాపాడుకున్న సంఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది.
కృష్ణాజిల్లాలోని పోడూరు మండలం మట్టపర్రు పాలెం మరియు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు శెట్టి బలిజ కులస్థుల కమిటీలను ఏర్పాటు చేయడం కోసం పర్యటన చేస్తున్నారు. మట్టపర్రు పాలెం గ్రామంలో కొంతమంది శెట్టి బలిజ కులస్థులు మతం మారి ఉండడం, వారు మరో 40 మంది శెట్టిబలిజలను మతం మార్చే ప్రయత్నం చేస్తూ ఉండడం ధర్మ జాగరణ సమితి కార్యకర్తల దృష్టికి వచ్చింది.
కృష్ణాజిల్లా ధర్మ జాగరణ పరియోజన ప్రముఖ్ శ్రీ చింతపల్లి రమేష్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత శెట్టి బలిజ పరియోజన ప్రముఖ్ శ్రీ కడలి నాగరాజు, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సహ పరియోజన ప్రముఖ్ శ్రీ రాయుడు ముత్యాలరావు తదితర కార్యకర్తలు మట్టపర్రు గ్రామంతో సహా చుట్టుపక్కల ఉన్న మరో ఐదు గ్రామాల శెట్టి బలిజ కుల పెద్దలను కలిసి వారికి హిందూ ధర్మం యొక్క విశిష్టతను, శెట్టి బలిజ కులం యొక్క చరిత్రను, గొప్పతనాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను వారికి వివరించారు.
దాంతో వారు తమ కులం యొక్క చరిత్రను, గొప్పతనాన్ని, హిందూ సంస్కృతి విశిష్టతను గుర్తించి తమ పూర్వీకుల లాగే తాము కూడా హిందూ ధర్మంలోనే కొనసాగుతూ ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగించాలని తీర్మానించుకున్నారు. సమీప భవిష్యత్తులోనే ఈ 5 గ్రామాలకు సంబంధించి ఒకచోట శెట్టి బలిజ సమ్మేళనం జరపాలని కూడా నిర్ణయించినట్లు ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య తెలిపారు.
__విశ్వ సంవాద కేంద్రము