తాను స్వయంగా అనేక గ్రంథాలను చదవడమే కాకుండా ఏన్నో అమూల్యమైన గ్రంథాలను సేకరించి “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” పేరుతో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించారు స్వర్గీయ శ్రీరామశాయి. “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఔత్సాహిక, వర్ధమాన జాతీయవాద రచయితలకు వ్యాస రచన, గీత రచన, కవితా రచన పోటీలను నిర్వహించాలని సంకల్పించాం.
అందుకే ఔత్సాహిక, వర్ధమాన రచయితల నుంచి ఈ క్రింద తెలిపిన అంశాలపై వ్యాసాలను సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పంపే రచనలు తప్పనిసరిగా క్రింద పేర్కొన్న అంశాలపైననే ఉండాలి.
- 1) భారతీయతకు విజయ కేతనం రామజన్మభూమి తీర్పు
- 2) ఆంధ్ర నాట స్వాతంత్ర పోరాట అపురూప ఘట్టాలు (ఏవేని 1,2 ఘట్టాలు వివరించవచ్చు)
- 3) మాతృభాషను కాపాడుకుందాం
- 4) మతమార్పిడులు – పర్యవసానాలు – ప్రమాదాలు
అలాగే పై నాలుగు అంశాల తోపాటు ఏదేని ఇతర దేశభక్తియుత, ప్రేరణాత్మక అంశాలపై కూడా గీతాలు, కవితలు వ్రాసి పంపవచ్చు.
కొన్ని సూచనలు :
1) పోటీలకు 18 ఏండ్లు పైబడిన వారందరూ అర్హులే.
2) వ్యాసరచన కంపోజ్ చేసినదైతే 14 సైజు ఫాంట్ తో రెండు A4 పేజీలకు, చేతి వ్రాత అయితే మూడు A4 సైజు పేజీలకు మించరాదు.
3) గీతాలు, కవితా రచన కంపోజ్ చేసినదైతే ఒక A4 పేజీకి, చేతి వ్రాత అయితే 2 A4 పేజీలకు మించరాదు.
4) ఆసక్తి ఉన్నవారు వ్యాస రచన, గీత రచన, కవితా రచన మూడింట్లోనూ పాల్గొనవచ్చు. అలాగే అన్ని అంశాలపైనా వ్రాసి పంపవచ్చు.
5) ఒక విభాగంలో ఒక అంశంపై ఒకటి కన్నా ఎక్కువ రచనలు ఒక రచయిత నుంచి స్వీకరించబడవు.
6) రచయితలు ఒక స్వీయ ధృవీకరణను కూడా తాము పంపే రచనతో పాటు జత చేయాల్సి ఉంటుంది.
7) రచయితలు తాము పంపే రచనలను ఈ క్రింది ఈమెయిల్, వాట్సప్ లకు పంపాలి :
మెయిల్ ఐడి : c4isap@gmail.com
వాట్సప్ నం : 9491365665
8) పోస్టు ద్వారా పంపేవారు ఈ క్రింది చిరునామాకు పంపాలి :
Centre for Integral Spirit, Sri Pisipati Sriramasai building, FF2, Krishnaraja Apartments,
2nd lane, Kedareswarapet, Vijayawada – 520003.
9) రచనలు చేరవలసిన ఆఖరు తేది 10/1/2021.
10) ఈ పోటీలలో ఒక్కొక్క విభాగంలో ఉత్తమంగా నిలిచిన వారికి 24/1/2020 వ తేదీన బహుమతి ప్రదానం ఉంటుంది. స్థలము, సమయము తర్వాత తెలియజేయబడతాయి.
11) సంస్థ న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం.
వివరములకు : 9550463236, 9701076007.
జాతీయవాద రచనా పోటీలకు ఆహ్వానము |
__విశ్వ సంవాద కేంద్రము