యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ “లవ్ జిహాద్” కు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని తన ఉద్దేశాన్ని ప్రకటించిన ఒక రోజు తరువాత, హర్యానా ముఖ్యమంత్రి మనోహార్ లాల్ కట్టర్ కూడా లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ మహిళలతో కొంత మంది ముస్లిం యువకులు ప్రేమ పేరుతో మోసం చేసి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపించే ధోరణిని ఎదుర్కోవటానికి రాష్ట్రంలో లవ్ జిహద్‌కు వ్యతిరేకంగా ఒక చట్టాన్నితీసుకురావాడానికి ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
గత వారం ఫరీదాబాద్ బల్లభాగర్లో 21 ఏళ్ల కళాశాల విద్యార్థిని ప్రేమను ఒప్పుకోవడంలేదని తన గతంలో తన క్లాస్మేట్ అయిన ఒక ముస్లిం యువకుడు హత్య చేయడంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తోంది. హర్యానా దినోత్సవం సందర్భంగా కర్నాల్‌లో మాట్లాడిన ఖత్తర్, బాలిక హత్య “లవ్ జిహాద్‌తో ముడిపడి ఉంది” అని కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిశీలస్తున్నాయన్నారు
బలవంతపు మతమార్పిడులు పునరావృతం కాకుండా, బల్లభాగర్లో జరిగిన హత్యల వంటి చర్యలను నివారించడానికి చట్టాల పరిధిపై రెండు ప్రభుత్వాలు న్యాయ సలహాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు సీఎం తెలిపారు. దోషులు తప్పించుకోకుండా, అమాయకులను శిక్షించకుండా ఉండటానికి చట్టపరమైన నిబంధనలు పరిశీలించబడుతున్నాయని ఆయన తెలిపారు.
___విశ్వ సంవాద కేంద్రము