ఈ దుఃఖహేతువునే మనం మాయ, అజ్ఞానం అవిద్య అని పిలుస్తున్నాం. ఈ మాయకు వశులమైపోవడం వలననే మన నిజస్వరూపాలను మర్చిపోయి ఈ శరీరమూ, ఇంద్రియాలూ, మనస్సు ఇవే మనమని భ్రమపడుతూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాము.
ఎప్పుడు, ఎలా మనం ఈ మాయ యొక్క వశంలోకి వచ్చామనేది జవాబులేని ప్రశ్న ఈ మాయ నుంచే పుట్టి, దాని పరిధిలోనే పనిచేసే ఈ మనస్సును, బుద్ధిని ఆధారం చేసుకుని ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అసంభవం. అయితే శాస్త్రాల, గురువుల ఉపదేశాలననుసరించి నడుచుకుంటే మాయ నశించి ఆత్మజ్ఞానాన్ని పొందుతాము.
రచన: స్వామి హర్షానంద