విజయవాడలోని స్థానిక అయోధ్యనగర్లో గల హైందవి భవనంలో హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి – ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో “దళితుల రిజర్వేషన్ల దుర్వినియోగం – పరిరక్షణ” అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బోని గణేష్ విచ్చేసి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా దళితులకు లభిస్తున్న రిజర్వేషన్లు దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు. మతం మారిన క్రైస్తవులు నేడు హిందూ SC లుగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొంది నిజమైన హిందూ దళితులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. దళితుల నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారిని ప్రభుత్వం BC – C గా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో పూర్తిస్థాయిలో సంఘాన్ని ఏర్పాటు చేసి హిందూ దళితుల హక్కుల పరిరక్షణ కొరకు ఉద్యమిస్తామని ఆయన అన్నారు.
సంఘం నాయకులు శ్రీ పేరం విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవులుగా మారిన దళితులు, మతం మారకుండా హిందువులుగా జీవనం సాగిస్తూ ఉన్న నిజమైన దళితులను మతపరమైన వివక్షకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారిన నకిలీ దళితుల కారణంగా నిజమైన దళితులు ఉద్యోగం, విద్య, ఉపాధి, రాజ్యాధికారాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిడులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి, రాష్ట్రంలో క్రైస్తవులుగా మతం మార్చుకున్న దళితులను గుర్తించి వారి కుల ధ్రువీకరణ పత్రాలను రద్దుచేసి నిజమైన దళితులకు న్యాయం జరిపించాలని హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి – ఆంధ్ర ప్రదేశ్ వారు అధికారులను కోరుతున్నారు.
- 1) మతం మారిన దళితులను BC – C గా గుర్తించాలని,
- 2) మతం మారిన వారి SC కుల ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని
ప్రభుత్వాన్ని కోరుతూ వారు ఈ సమావేశంలో తీర్మానం చేశారు.
ధర్మ జాగరణ సమితి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య గారు మాట్లాడుతూ దళితులందరూ హిందువు లేనని, మాయమాటలకు, ప్రలోభాలకు లొంగి మతం మారిన వారినందరినీ తిరిగి సనాతన ధర్మానికి చేరువ చేయడమే ధర్మ జాగరణ సమితి లక్ష్యమని తెలిపారు. హిందూ దళితుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితికి ధర్మ జాగరణ సమితి సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తుందని, మున్ముందు వారితో కలిసి పనిచేస్తుందని శ్రీ తిరుపతయ్య తెలియజేశారు.

ఈ సమావేశంలో హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి తుపాకుల రమణమ్మ, నాయకులు శ్రీ అద్దేపల్లి రాఘవులు, శ్రీ రంగారావు, శ్రీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
__విశ్వ సంవాద కేంద్రము