కాల ప్రమాణము
ధర్మం కాలాన్ని అనుసరించి మారుతూవుంటుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు త్వరగా భోజనం చేయటం ధర్మం. సూర్యోదయానికి ముందు నిద్రలేవటం ధర్మం, రాత్రిపూట పడుకోవటం ధర్మం.
మనిషితన ధర్మాన్ని కాలానుగుణంగ ఆచరించటానికి వేదాలలో కాలవిభజన ఇలా చేయబడింది:
- ➧ పరమాణువు (అతిసూక్ష్మమైన కాలకొలమానము) - 26.3µs (మైక్రోసెకండ్స్ ఆంటే సెకనులో 10,00,000 వ వంతు)
- ➧ 2 పరమాణువులు - 1 అణువు (2 *26.3µs = 52.6µs)
- ➧ 3 అణువులు - 1 త్రసరణువు (3 * 52.6µs = 158µs)
- ➧ 3 త్రసరణువులు - 1 తృటి (3 * 158µs = 474µs)
- ➧ 100 తృటిలు - 1 వేద (100 * 474 µs = 47.4ms (మిల్లిసెకండ్స్ ఆంటే సెకనులో 1000 వ వంతు))
- ➧ 3 వేదలు - 1 లవ (3 * 47.4ms = 0.14s (సెకండ్స్))
- ➧ 3 లవలు - 1 నిమిషా (3 * 0.14s = 0.43s)
- ➧ 3 నిమిషాలు - 1 క్షణ (3 * 0.43s = 1.28s)
- ➧ 5 క్షణాలు - 1 కస్త (5 * 1.28s = 6.4s)
- ➧ 15 కస్తలు - 1 లఘు (5 * 6.4s = 1.6 min(నిమిషాలు))
- ➧ 15 లఘులు - 1 దండ (15 * 1.6min = 24min)
- ➧ 2 దండలు - 1 ముహూర్తం( 2 * 24min = 48min)
- ➧ 30 ముహూర్తాలు - 1 అహోరాత్రం(1 రోజు)(24గంటలు)
- ➧ 30 అహోరాత్రాలు - 1 మాసం(1 నేల/month, 30 రోజులు)
- ➧ 2 మాసాలు - 1 ఋతువు(season)(2నెలలు/months,60 రోజులు)
- ➧ 3 ఋతువులు - 1 ఆయనం (6నెలలు/months, 180 రోజులు)
- ➧ 2 ఆయనాలు - 1 సంవత్సరం (12నెలలు/months, 360 రోజులు)
- ➧ 1 సంవత్సరం (12 నెలలు/months, 360 రోజులు) - 1 రోజు దేవతలకి,మనుష్యుల 1సంవత్సరం దేవతలకి 1రోజు, ఉత్తరాయణం(సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన లగాయతు కర్కాటకరాశిలో ప్రవేశించే వరకు) దేవతలకి పగలు, దక్షిణాయనం(సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించిన లగాయతు మకరరాశిలో ప్రవేశించే వరకు) దేవతలకి రాత్రి.
- ➧ 360 దేవత రోజులు(360 మనుష్య సంవత్సరాలు) - 1 దివ్య సంవత్సరం(అంటే దేవతలకి ఒక సంవత్సరం)
- ➧ 71(71 * 360 = 25560 మనుష్య సంవత్సరాలు) దివ్యసంవత్సరాలు కలిపి - 1 మన్వంతరం, అంటే ఒక మనువు జీవిత కాలం, ఇది ఇంద్రుడి పదవి కాలము కూడా.
- ➧ 14 మన్వంతరాలు - 1 కల్పం
- ➧ 2 కల్పాలు - 1 బ్రహ్మకి ఒక రోజు. బ్రహ్మదేవుడు తన ఒక రోజులో 28 (28*71*360 = 715680 మనుష్య సంవత్సరాలు) మంది ఇంద్రులను చూస్తాడు. ఇలాంటివి 360 రోజులుకలిపి బ్రహ్మదేవుడుకి ఒకసంవత్సరం.
- ➧ ఇలా బ్రహ్మ గారి ఆయుర్దాయం 108 సంవత్సరాలు(108 * 360 * 28 * 71 * 360 = 27,82,56,38,400 మనుష్య సంవత్సరాలు). బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తిఅయితే ప్రళయంసంభవిస్తుంది, దీన్నిప్రాకృతికప్రళయంఅంటారు. ఇటువంటిప్రళయంజరిగేదాక వున్నకాలం అంతాకలిపి ఎన్నికోట్లమనుష్యసంవత్సరాలు అవుతుందో అదంతా శ్రీమహాకామేశ్వరాంకనిలయ శ్రీలలితాపరాభట్టారికకి ఒకరెప్పుపాటుకాలం.
కాలవిభజన
ధర్మం కాలాన్ని అనుసరించి మారుతూవుంటుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు త్వరగా భోజనం చేయటం ధర్మం. సూర్యోదయానికి ముందు నిద్రలేవటం ధర్మం, రాత్రిపూట పడుకోవటం ధర్మం. మనిషితన ధర్మాన్ని కాలానుగుణంగ ఆచరించటానికి వేదాలలో కాలవిభజన ఇలా చేయబడింది
యుగాలు:
యుగాలు నాలుగు, అని మనపురాణాలలో చెప్పబడినది, అవి
- 1. కృతయుగము (4800 దివ్యసంవత్సరాలు అంటే 1728000 (4800 * 360) మనుష్య సంవత్సరాలు )
- 2. త్రేతాయుగము (3600 దివ్యసంవత్సరాలు అంటే 1296000 (3600 * 360) మనుష్య సంవత్సరాలు )
- 3. ద్వాపరయుగము (2400 దివ్యసంవత్సరాలు అంటే 864000 (2400 * 360) మనుష్య సంవత్సరాలు )
- 4. కలియుగము (1200 దివ్యసంవత్సరాలు అంటే 432000 (1200 * 360) మనుష్య సంవత్సరాలు )
ఈ నాలుగుయుగములను కలిపి ఒకమహాయుగము (లేదా చాతుర్ యుగము) అనిపిలుస్తారు. ఒకమహాయుగం 12,000 దివ్యసంవత్సరాలు.
మన్వంతరాలు:
స్వాయంభువ మన్వంతరం
సప్తమహర్షులు – మరీచి,అత్రి,అంగీరసుడు,పులహుడు,క్రతువు,పులస్త్యుడు,వశిష్టుడు
యములు అనబడే వాళ్ళు దేవతలు
యజ్ఞుడు ఇంద్రుడు
స్వారోచిష మన్వంతరం
సప్తమహర్షులు – ఊర్జస్తంభ,పరస్తంభ,ఋషభ,వసుమంత,జ్యోతిష్మంత,ద్యుతిమంత,రోచిష్మంత
తుషితులు అనబడే వాళ్ళు దేవతలు
రోచను ఇంద్రుడు
ఉత్తమ మన్వంతరం
సప్తమహర్షులు – వశిష్టుడు,కాకుంది,కురుంది,దలయ,శంఖ,ప్రవంహిత,మిత,సమ్మిత
సత్య,వేద,శ్రుతాదులు అనబడే వాళ్ళు దేవతలు
సత్యజిత్తు ఇంద్రుడు
తామస మన్వంతరం
సప్తమహర్షులు – గార్గ్య,పృథు,వాగ్మి,జన్య,ధాత,కపినక,కపివంతుడు
సత్యులు అనబడే వాళ్ళు దేవతలు
త్రిశంఖుడు ఇంద్రుడు
రైవత మన్వంతరం
సప్తమహర్షులు – దేవబాహుడు,జయముని,వేదశిర,హిరణ్యరోమ,పర్జన్య,ఊర్ధ్వబాహు,సుధాముడు
భుతరజస్కులు అనబడే వాళ్ళు దేవతలు
విభువన ఇంద్రుడు
చాక్షుష మన్వంతరం
సప్తమహర్షులు – సుమేధ,విరాజ,హవిష్మత్,ఉత్తమ,మధు,అభినామ,సహిష్ణు
అప్యయనులు అనబడే వాళ్ళు దేవతలు
మంత్రద్రుమ ఇంద్రుడు
వైవస్వత మన్వంతరం
సప్తమహర్షులు – కశ్యపుడు,అత్రి,వశిష్టుడు,విశ్వామిత్రుడు,గౌతముడు,జమదగ్ని,భరద్వాజుడు
ద్వాదశ అదిత్యులు,ఏకాదశ రుద్రులు,అష్ట వసువులు,అశ్వనీదేవతలు(వీళ్ళు ఇద్దరు) మొత్తం ౩౩ దేవతలు
పాకశాసనుడు ఇంద్రుడు
సావర్ణి మన్వంతరం
సప్తమహర్షులు – దీప్తిమత,గాలవ,పరశురామ,కృపా,ద్రుని,వ్యాస,ఋష్యశృంగ
సుతపులు దేవతలు
బలి ఇంద్రుడు
దక్ష సావర్ణి మన్వంతరం
సప్తమహర్షులు – సావన,ద్యుతిమంత,భవ్య,వసు,మేధాత్థీ,జ్యోతిష్మంతుడు,సత్య
మరీచిగర్భులు దేవతలు
అద్భుత ఇంద్రుడు
బ్రహ్మ సావర్ణి మన్వంతరం
సప్తమహర్షులు/ఋషులు – హవిష్మంతుడు,సుకృతి,సత్య,అపామూర్తి,నాభాగ,అప్రతిమౌజా,సత్యకేత
సువసనులు దేవతలు
శంభు ఇంద్రుడు
ధర్మ సావర్ణి మన్వంతరం
సప్తమహర్షులు – నిశ్చర,హవిష్మంతుడు,అగ్నితేజ,వపుష్మంతుడు,విష్ణు,అరుణి,అనఘ
విహంగములు దేవతలు
వైద్రితుడు ఇంద్రుడు
రుద్ర సావర్ణి మన్వంతరం
సప్తమహర్షులు – తపస్వి,సుతప,తపోముర్తి,తపోఅర్తి,తపోద్రితి,తపోద్యుతి,తపోధన
హరితులు దేవతలు
ఋతధామడు ఇంద్రుడు
దేవ సావర్ణి మన్వంతరం
సప్తమహర్షులు – నిర్మోహ,తత్వదర్శన,నిష్ప్రకంప,నిరుత్సుక,ద్రితిమతి,అవ్యయ,సుతప
సుకర్మ దేవతలు
దివస్పతి ఇంద్రుడు
ఇంద్ర సావర్ణి మన్వంతరం
సప్తమహర్షులు – అగ్నిబాహు,శుచి,శుక్ర,మాఘద,గ్రిధ్ర,యుక్త,అజిత
పవిత్రులు,చాక్షుషులు దేవతలు
శుచి ఇంద్రుడు
సంకలనం: కోటేశ్వర్