ఆర్యజాతి ఆవిష్కరణ - అభూత కల్పనలు
సర్-విలియమ్ జోన్స్, తన సంస్కృత 'ఆవిష్కరణ'ను ప్రకటిస్తూ, 1799లో యూరోపియన్లకు ఈ విధంగా రాశాడు. "సంస్కృత భాష అద్భుత నిర్మాణం గలది; గ్రీకు కంటె ఎక్కువ కచ్చితమైంది, లాటిన్ కంటె ఎక్కువ విస్తృతమైంది; ఆరెండింటి కంటె ఎక్కువ సమగ్రంగా సంస్కరింపబడింది. అయినా ఆ రెండింటితో పటిష్టమైన సంబంధం కలిగి ఉంది.. ఈ పోలికలు యాదృచ్చికం కావడానికి వీల్లేదు."
పద్దెద్మిదో శతాబ్దంలోనూ, పందొమ్మిదో శతాబ్దం ప్రారంభంలోనూ యూరప్'లో నెలకొని ఉన్న ఆదర్శవంతమైన, కల్పనాత్మకమైన భారతీయ దృక్పథానికి సంబంధించి ఈ వివరణ విశిష్టమైంది.
పటం 3.1, యూరోపియన్ కాల్పనిక వాదులు సంస్కృతీవాదుల వల్ల ప్రభావితమైనట్లుగా 'భారతదేశ అధ్యయ'నాన్ని సూచిస్తుంది. ఇది, భారతదేశానికి సంబంధించిన కింది యూరోపియన్ మేధాచరిత్ర దశలతో పాటు ఈ భావాలు, యూరోపియన్ ఆధిక్యతను ఎలా రూపొందించాయినే విషయాన్ని వివరిస్తుంది.
ఆధునిక కాలంలో ఎదురయిన నూతన సవాళ్ల ఫలితంగా సంక్షోభంలో పడిన యూరో-క్రైస్తవ ఏకదేవతారాధన చట్రం నుంచి తప్పించుకోడానికి యూరోపియన్ కాల్పనికవాదులకొక చారిత్రక ప్రాతిపదిక అవసరమైంది. స్వీయ చరిత్రకు తగిన ఆధ్యాత్మికత కోసం వారు తీవ్రమైన అన్వేషణ సాగించారు. తమ గతంలోనే వారు తమ కాల్పనిక దృక్పథం తెలుసుకోడానికి ప్రయత్నించారు. భారతదేశాన్ని కనుక్కొన్నారు. వారి బంగారు మూలంకోసం జరుగుతున్న అన్వేషణకు భారతదేశం ప్రధాన వాహికగా మారింది. ఇండాలిజిస్ట్ లు, యూరప్ లో అవతరిస్తున్న జాతి- రాజ్యాలలో పాటు వలసరాజ్యాల అవసరాలను తీర్చే విధంగా ప్రాచీన భారతదేశ చరిత్రను భావించారు.
మానవజాతికి నాగరకత నేర్పిన అగ్రగాములుగా ఆర్యుల భావనను వారు కన్పించారు. యూరోపియన్ ఆర్యులను జాతిపరంగా స్వచ్ఛమైన వారుగానూ, ఆధ్యాత్మికంగా వారి సర్వోత్కృష్ట క్రైస్తవులుగానూ భావించారు. ఉత్తర భారతదేశంలోని ఆర్యులను, నిమ్న స్థానికులలో కలిసిన యూరోపియన్ ఆర్యులవల్ల జనించిన మిశ్రజాతి వారుగా భావించారు. అందువల్లనే వీరిలో విగ్రహారాధన, బహుళ అస్తిత్వవాదం, జాతిపరమైన మాలిన్యం ఏర్పడ్డాయనేది వారి భావం.
విశాలమైన ఆర్యవర్గం, ప్రధానంగా జర్మన్ జాతీయవాద చింతనాపరుల ద్వారా ఉత్తమ ఆర్యజాతి రూపొందింది. ఈ కల్పనకు విశ్వసనీయత కల్పించడం కోసం నవజాత జాతివిజ్ఞానాన్ని ఆశ్రయించడం జరిగింది. యూరోపియన్ యూదువ్యతిరేక వాదం, యూదుల నుంచి యూరోపియన్ లను వేరుచేయడానికి ఆర్యసిర్మాణాన్ని ఉపయోగించుకొన్నది. యూరోప్‌లో ఆర్యక్రైస్తవ భావన బాగా ప్రచారంలోకి వచ్చింది.
జర్మనీలో ఆర్యఉత్తమ జాతి సిద్ధాంతం కల్పించిన జాతీయ వాదగర్వం, నాజీవాడ అవతరణలోనూ, మారణకాండలోనూ ప్రముఖపాత్ర వహించింది. రెండో పసంచ యుద్ధం తరవాత, యూరోపియన్ విద్యావిషయక, సామాజిక సంస్థలు, యూరోపియన్ మనస్సుల నుంచి ఆర్యజాతి సిద్దాంతాన్ని తొలగించడానికి గొప్పగా కృషి చేశాయి. కానీ భారతదేశ అధ్యయనంలో ఇప్పటికీ ఈ భావాలను వర్తింపజేయడం కొనసాగుతూ ఉంది.
యూరోప్ మీద భారతీయ ప్రభావం - ఆలోకన : పునరుజ్జీవనం నుంచి జాతివాదం వరకు:
రేమాండ్ ష్వాబ్ రచించిన 'ది ఓరియంటల్ రినైజాన్స్ (1984)' గ్రంథం పునరుజ్జీవన కాలంలో యూరోప్ పై ప్రభావం చూపిన అనేక కీలకమైన ఆసియా ప్రభావం గురించి చర్చించింది. జొరాస్ట్రియన్ల జెండ్ అవెస్తా కూ భగవద్గీత కూలలో వచ్చిన అనువాదాలు, బైబిల్ కూ ప్రాచీన సంప్రదాయాలకూ పూర్తిగా భిన్నమైన దృకథాన్ని ప్రథమంగా అందించాయని ష్యాబ్ వివరించాడు. జాన్ హాల్వల్, 1765లో, హిస్టారికల్ ఇంటరెస్టింగ్ ఈవెంట్స్ రిలేటింగ్ టు బెంగాల్ ప్రచురణలో భారతదేశం, విద్యావేత్తలలో బాగా ప్రచారం పొందింది. క్రైస్తవ ధర్మబోధకుల దివ్యక్ఞా
చర్చ్‌లలో హిందూమతం, ముఖ్యమైన వాదనలకు ఆధారమైంది. 1789లో విలియన్ జోన్స్, కాళిదాసు శాకుంతలాన్ని ఇంగ్లీషులోకి అనువదించగా 1791లో దాన్ని జర్మన్లోకి తిరిగి అనువదించారు. అవి, హెర్డర్, గోథె, షిల్లర్ లాంటి ప్రముఖ మేధావులను ప్రభావితం చేసింది.
యూరోపియన్ జాతివాద క్రమ పరిణామంలో రెండు దశలున్నాయి. ఒకటి నవజాత యూరోపియన్ నరవర్గ, జాతి-రాజ్య అస్తిత్వాలతో పోటీ పడుతున్న జర్మన్ జాతీయ అస్తిత్వపరిణామం; రెండు : యూరోపియన్ వలసవాదం.
మొదటిదశ 19వ శతాబ్దం మధ్యకాలం వరకు కొనసాగింది. యూరోపియన్ సంస్కృతికి భాషా పరమైన మూలానికి సంబంధించిన నిర్మాణంలో సంస్కృతాన్ని ఉపయోగించడం పట్ల యూరోప్ పండితులు మనస్సు కష్టపెట్టుకొన్నారు. కొత్త విద్యా విషయక శాస్త్రవిషయం భాషాధ్యయనం ఆవిర్భవించింది. సంస్కృత అధ్యయనాలు దీనికి మూలమయ్యాయి. ప్రజామూలాలను తెలుసుకోవాలనే యూరోపియన్ల ఆకాంక్షకు ఈ అధ్యయనం ప్రేరణ నిచ్చింది. కొత్తగా ఆవిష్కృతమైన భాషాధ్యయన పారంపర్యానికి సంబంధించి భిన్నదేశాల యూరోపియన్లు వాదులాడుకున్నారు. ఈ పరంపరలో ఆర్యులు, ఇండో-జర్మన్లు, ఇండో-యూరోపియన్లు, కాకసియన్లు ఉంటారని వారు పేర్కొన్నారు. వారు ప్రజలు, జాతి, భాషాకుటుంబం అనే పదాలను తోచిన రీతిలో ఉపయోగించారు. ప్రముఖ సంస్కృత పండితుడు, తులనాత్మక భాషా శాస్త్ర స్థాపకుడు అయిన ఫ్రాంజ్ బాప్ (1791-1867), సంస్కృతంతో సంబంధం ఉన్న భాషా కుటుంబాన్ని 'ఇండో-జర్మానిక్'గా ప్రస్తావించడాన్ని వ్యతిరేకించాడు. దానికి బదులు 'ఇండో- యూరోపియన్' పదాన్ని ఉపయోగించడం పట్ల మొగ్గు చూపాడు.
1875లో మాక్స్ ముల్లర్ సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్ సీరీస్ ప్రచురణతో మొదటిదశ ముగిసింది. గతశతాబ్దం, భూగోళ శాస్త్ర సంబంధమైన క్రైస్తవ ప్రతిరూపాల స్వరూపాన్ని మార్చివేసింది. సంస్కృతం ఆవిష్కరణ వల్ల, తమ సాంస్కృతిక వారసత్వానికి మూలంగా మధ్యధరా ప్రాంతం మీద యూరోపియన్లు దృష్టి సారించడం మానుకొన్నారు. సంస్కృత అధ్యయనాలు కార్టేసియన్ సంపూర్ణ వాదానికి ప్రత్యామ్నామాలు సమకూర్చాయి. సంస్కృతీపరమైన ఈ మథనం, యూరోప్‌లో అంతర్గత నరవర్ధ- రాజకీయ పోరాటానికి దారితీసి చివరికి ఫ్రెంచి- జర్మన్ విప్లవ వాదంగా రూపుదిద్దుకొంది. ఈ మధ్యలో ఆంగ్లపండితులు భారతీయ సమాజానికి సంబంధించిన 'మార్మిక' లక్షణాన్ని ప్రధానంగా ఎత్తి చూపారు. ఇది కాల్పనికంగా ఆదిమదశలో ఉందనీ పారలౌకికంగా ఉందనీ చెప్పారు. దీంతో ప్రపంచ వ్యవహారాల మీద పాశ్చాత్యుల ఆధిపత్యానికి ఇది వీలు కల్పించింది.
రెండోదశ, రెండో ప్రపంచయుద్ధకాలమంతా కొనసాగింది. యూదు వ్యతిరేకతను ఆర్యుల మీద, హీబ్రూల మీద ప్రముఖంగా దృష్టి సారించిన ఊహాత్మక తత్వశాస్త్రం చరిత్ర రచన విజృంభించాయి. ఈ రెండు ప్రాచీన నాగరక ప్రజల అస్తిత్వాలు, యూరోప్‌లోనూ వెలుపలా కూడా మేధాపరమైన, రాజకీయపరమైన సంబంధాలు సృష్టించాయి. పండితులు, మానవజాతి పరమైన చిత్రణలు ప్రారంభించడంలో ప్రాచీన ఆర్యుల, హీబ్రూల అధ్యయనం భాషాధ్యయనాన్ని మించి పోయింది.
ఉదాహరణకు, తత్వవేత్త ఎర్నెస్ట్ రెనన్ (1823-92), హిబ్రూలు, ప్రపంచానికి ఏకదేవతారాధనను బహుమతిగా అందించారని, యూదులు స్వార్ధపూరితులనీ సమస్యలు సృష్టించేవారనీ, స్థిరంగా ఉండేవారనీ పేర్కొంటారు. ఆర్యులకు ఊహాశక్తి హేతువు, శాస్త్రవిజ్ఞానం, కళలు, రాజకీయాలు వంటి ఉత్కృష్ట గుణాలున్నాయి కాబట్టి వారు గతిశీలంగా ఉంటారు. ఈ గుణాలను బహుదేవతారాధనకు అనుసంధానం చేయడమైంది. ఆర్యుల బహుదేవతారాధన, యూదుల ఏకదేవతారాధనకు వ్యతిరేకం ఈ పరిణామం వల్ల, ఆర్యుల పట్ల మొగ్గుచూపే పండితులకూ క్రైస్తవ మత వ్యవస్తకూ మధ్య ఉద్రిక్తత తలెత్తింది.
పందొమ్మిదో శతాబ్దపు పండితుల మధ్య తీవ్రమైన విభేదాలున్నప్పటికీ, దేవుడి అదృశ్య హస్తంవల్ల, ఇతర ప్రజల కంటె యూరోపియన్ క్రైస్తవులు తప్పనిసరిగా అధికులనే వాదాన్ని చాలామంది అంగీకరించారు. యూరోపియన్ మేధావులు ప్రకృతి శాస్త్రాలు, తులనాత్మక అధ్యయనాల పద్దతులను అవలంబించిన తరవాత కూడా ఈ విశ్వాసం అలాగే నిలిచి పోయింది. యూదులకూ ఆర్యులకూ చెందిన ఉత్తమ అంశాల నుంచి తాము ఉద్భవించామని యూరోపియన్లు భావించారు. తమ జాతి వారసత్వాన్ని ఆర్యవారసత్వంగా పునరాలోచించుకున్నారు. పాత, కొత్త నిబంధనల మధ్యగల చారిత్రక సంబంధాలు, హీబ్రూ, గ్రీకు, లాటిన్ల మధ్యగల భాషాపరమైన సంబంధాల విషయంలో సాగిన సమకాలీన మేధాపరమైన అన్వేషణలతో పాటు ఈ ఆలోచనలు సాగాయి. యూరోప్ వారసత్వంగా ఆర్యులు, యూదుల ఉత్తమ వారసత్వ లక్షణాలను గ్రహించే దృష్టిలో, రెనన్, ఆ రెండింటినీ యూరోపియన్లకు మాతృకలుగా ఉపయోగించుకోడానికి ప్రయత్నించాడు.
సంస్కృత అధ్యయనం, దాదాపు అన్ని సామాజిక శాస్త్త్రాలలోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. యూరోపియన్ అస్తిత్వరాజకీయాలు శాశ్వతంగా రూపాంతరం చెందాయి. విలియమ్ జోన్స్ తరవాత దాదాపు ఒక శతాబ్దానికి, ప్రముఖ యూరోపియన్ పండితులలో ఒకరయిన ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ (1823-1900), 'ప్రాచీన భారతీయ సంస్కృతాన్ని ఆవిష్కరించడం వల్ల ఈ భాషకూ ప్రధాన యూరోప్ జాతుల జాతీయాలకూ మధ్యగల సన్నిహిత సంబంధం వల్ల... ప్రపంచ ప్రాథమిక చరిత్రను అధ్యయనం సంపూర్ణ విప్లవం చోటు చేసుకొంది' అని పేర్కొన్నాడు.
భారతీయ గ్రంథాలను వెలికితీసి, వాటిని అనువాదాలు, తప్పుడు అనువాదాలు, గ్రంధ చౌర్యం వంటి మార్గాల ద్వారా భారతీయ విజ్ఞానాన్ని పాశ్చాత్య విజ్ఞానంగా మార్చడం జరిగింది. దీంతో భారతీయ మూలం, మునుపటి సౌందర్యాన్ని కోల్పోయింది. బారతదేశం నుంచి గ్రహించిన కావ్య, తాత్విక అంశాలన్నిటినీ అదేరీతిలో పాశ్చాత్యులు ఉపయోగించుకొంటున్నారు. యూరోపియన్ నాగరకత చరిత్రగా చిత్రించుకోడానికి వాటికి రంగులద్ది అందమైన రూపం కల్పించుకొంటున్నారు. భారతీయ సంస్కృతి, యూరోపియన్లకు సంబంధించిన అలంకరణలు, స్మారకాంశాల సంకలనంగా మారింది. వాస్తవానికి భారతదేశం, అందమైన గతంగా యూరోపియన్ ప్రదర్శనశాలల్లోకి చేరిపోయింది. ఈ క్రమంలో భారతీయ నాగరకత, తన సంఘటితత్వాన్నీ సమైక్యతనూ కోల్పోయింది. ఒకదాని నుంచి మరొకదాన్ని
వీడదీయడానికి అనువయిన విడిభాగాల కూర్పుగా మారిపోయింది. స్థానిక ప్రజలకు అసందర్భంగానూ యూరోపియన్ పరిస్థితులకు సందర్భోచితంగానూ తయారయింది.
హెర్డర్ కాల్పనిక వాదం
యొహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డర్ (1744-1803) జర్మన్ కాల్పనిక వాదానికి ఆగ్రగామి. అనేక విషయాలకు సంబంధించిన ప్రముఖ రచయిత. ఇతను యూదులు- ఈజిప్షియన్లు, బ్రాహ్మణులు వంటి ఆదర్శవర్గాల మధ్య భేదం చూపాడు. ఈయన రచనలు, జాతివాదానికీ బహుళతావాదానికీ మధ్య ఊగిసలాడాయి. హెర్డర్ అభిప్రాయంలో భారతదేశం, మానవజాతి అమాయకశైశవ దశను-ప్రకృతి ఒడిలో ఆదమమతాన్ని- ప్రతిబింబించింది. భారతదేశానికి చెందిన అలాంటి గతానుగతమైన ప్రతిబింబాలను ప్లెగెల్ లాంటి సంస్కృతీ వేత్తలు షెల్లింగ్లాంటి తత్వవేత్తలతో సహా కాల్పనిక వాదులు కూడా బాగా స్వీకరించారు. ఈ కాల్పనిక వాదులు, భారతదేశాన్ని సాహితీపరమైన, సాంస్కృతిక పరమైన 'పునరుత్పత్తి'కి మూలంగా భావించారు.
మానవచింతనకు సంస్కృతం అందించిన తోడ్పాటును హెర్టర్ ఫ్రస్తుతించాడు. సంస్కృతం తన ఇండో-యూరోపియన్ (ఆర్య) గతానికి చెందిందని అతను భావించాడు. యూరోప్, భారతదేశాన్ని ఆవిష్కరించడం అంటే తాను విస్మరించిన స్వీయపునాదిని తిరిగి ఆవిష్కరించడమే అని ఆయన భావం.
ఈ భావాన్ని అనుసరించి ప్రాచ్యం అనేది పాశ్చాత్యం నుంచి వేరయింది కాదు. దాని మూలమే. ఈ విషయంలో హెర్డర్, హెగెల్ (1770-1831తో తీవ్రంగా విభేదించాడు. హెగెల్ అభిప్రాయంలో చరిత్ర అనేది, గతానికి దూరంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రాచీనతను మానవజాతికి వైభవోపేతమైన మూలంగా భావించే వారిని హెగల్ విమర్శించాడు. హెగెల్ ప్రభావం విస్తృతంగా ఉన్నప్పటికీ హెర్టర్ మైభవోపేతమైన ఫ్రాచీనతవాదం, ఆయన మరణం తరవాత కూడా అర్ధశతాబ్దం పాటు కొనసాగింది. తర్వాత కాలంలో ఎర్నెస్ట్ రెనాన్, మాక్స్ ముల్లర్ లాంటి వాళ్లు దాన్ని చేపట్టారు.
కార్ల్ విల్ హెల్మ్ ఫ్రెడరిక్ ప్లైగెల్ (1772-1829)
ఫ్రెడరిక్ ప్లెగెల్, పాశ్చాత్య మేధాచరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరతీసాడు. ఈయన సాగించిన సంస్కృతీ అధ్యయనం, 'పాశ్చాత్య ఆర్యమూలాల పునరావిష్కరణ వాదాలకు దారితీసింది. యూరోపియన్ లలోనూ యూరోపియనేతరులలోనూ జాతిపరమైన క్రమశ్రేణి సిద్దాంతాన్ని రూపొందించడంలో ప్లెగెల్ ప్రధాన పాత్ర పోషించాడు. విలియమ్ జోన్స్, భారతీయ మతాల గురించి రాసిన రచనలను ప్లెగెల్ అధ్యయనం చేశాడు. జోన్స్ మొత్తం మానవజాతికి సంబంధించిన జాతివర్గీకరణను ప్రతిపాదించాడు కానీ ఇండో- యూరోపియన్ కుటుంబానికి మూలాలు భారతదేశంలో ఉన్నాయని ఇతను పేర్కొన లేదు. తన క్రైస్తవ సిద్ధాంతంలో సర్వేశ్వరవాదంగా పేర్కొన భారతీయ ఆధ్యాత్మికతను ప్లెగెల్ తిరస్కరించాడు.
జాతికి సంబంధించి జోన్స్ వెలిబుచ్చిన నిర్దిష్ట భావనలను తిరస్కరించినప్పటికీ ఫ్లెగెల్ 1802లో తాను పారిస్'లో చదువుకొన్న సంస్కృతంతో కలిసిపోయిన కొన్ని భారతీయ జాతి అస్తిత్వ భావనలను గ్రహించాడు. ప్లైగెల్ భారత అధ్యయనాలను ప్రధానంగా జర్మనీ గతం పట్ల భూస్వామ్య వాదమూలాల పట్ల అతనికి ఉన్న ఆసక్తి నడిపించింది. జర్మన్ సంస్కృతి, భూస్వామ్య సామాజిక వ్యవస్థలు ప్రాచీనభారతం నుండి ప్రారంభమయ్యాయని చెప్పడానికీ పునరుజ్జీవన- ఆధారిత ఫ్రెంచి ఆధిపత్యానికి ప్రతిగా వాటికి గౌరవనీయమైన ప్రాచీనతను కట్టబెట్టడానికీ అతనికి సంస్కృత అధ్యయనం వీలు కల్పించింది.
ప్లెగెల్ భారత నిర్మాణాన్ని ఉపయోగించుకుంటూ జర్మన్ గతాన్ని ఊహించడం:
భారతదేశ మతాలను ప్లైగెల్ తిరస్కరించాడు. భారతదేశం మరేమాత్రం మతపరమైన ప్రేరణకు మూలంగా లేదు. అయితే, ఇది జర్మన్లకూ వారిమధ్యముగపు భూస్వామ్య వాదానికీ గౌరవనీయమైన చారిత్రక వారసత్వాన్ని అందించింది. జర్మన్ కాల్పనిక వాదంలో భారతదేశ ప్రభావం ఉందని చెప్పే పాత కల్పితగాథలో, భారతదేశ ప్రాచీనతపట్ల, నాగరకతకు నిలయంగా దాని పాత్ర పట్ల హెర్డర్ర్కుగల విశ్వాసాన్ని చేర్చబడింది. భారతదేశానికి సంబంధించిన గతంలోని కల్పితగాథ సౌందర్యపరమైనదీ, మతపరమైనదీ కాగా కొత్త కల్పితగాథకు జర్మన్ రాజకీయ దురభిమానం కారణం. మూరోపియన్ సంస్కృతికి సంబంధించిన గ్రీకు మూలానికి ప్రత్యామ్నాయం అనుకోవడమే రెండింటి ప్రధాన లక్ష్యం. పాతగాథను నవ్య-సంప్రదాయ వాదానికి వ్యతిరేకంగా తీసుకురాగా కొత్తగాథను ఫ్రెంచి సంస్కృతికి వ్యతిరేకంగా జర్మన్ సంస్కృతి హోదాను పెంచడానికి ఉద్దేశించడం జరిగింది.
ప్లెగెల్ మొదటి కల్పితగాథ, జర్మన్ గొప్పతనానికి మూలంగా భారతదేశ చారిత్రక పాత్రమీద నిర్మితమైంది. ఆధునిక జర్మన్ల పూర్వికులు, భారతదేశం నుంచి వలస వచ్చారనేది ఆయన వాదన. ఎక్కడో మారుమూలన ఉన్న యూరప్ ఉత్తర ప్రాంతంతో పోలిస్తే భారతదేశం 'అత్యంత ఆనందమయమైన, సారవంతమైన భూమి' అని వర్ణించాడు. పవిత్ర పురుషుల నాయకత్వంలో సాగిన ఈ వలసకు కేవలం భౌతికమైన ప్రయోజనాలే కారణమై ఉండవని ఆయన భావించాడు. వారు ఉత్తరాదికి వస్తున్న క్రమంలో అనేకమైన చిన్న చిన్న తెగలు వారిలో కలిసిపోయి ఉండవచ్చు. ఇదే ఉత్తరాది యూరోపియన్ల జాతివైవిధ్యానికి దారితీసి ఉండవచ్చుననేది ఆయన భావం.
భారతీయుల రెండోవలస, పశ్చిమదిశగా సాగి, గ్రీక్, రోమ్ నాగరకతలకు పునాది వేసింది. ప్రకృతిని ఆరాధించే ఈ సంప్రదాయ వ్యతిరేక తెగలు, తీవ్రమైన మత ఘర్షణల కారణంగా భారతదేశాన్ని వదలి ఉండవచ్చు. అత్యంత నాగరక జాతిగా ప్రాచీన జర్మన్లు, ప్రాచీన గ్రీకులు, రోమన్ల కంటె ఉన్నతులని గమనించాడు. చాలామంది చరిత్రకారులు, ప్రాచీనజర్మన్లను ప్రాచీన గ్రీకు, రోమన్ నాగరకతలను ధ్వంసం చేసిన అనాగరకులుగా గుర్తించారు. అయితే ప్లెగెల్ మాత్రం జర్మన్ తెగలు తమ స్వేచ్ఛను కాపాడుకుంటూ సహజమైన అమాయక స్థితిలో జీవించిన ‘ఉత్కృష్ట అనాగరక' తెగలని ప్రతిపాదించాడు. వారి పారంపరిక లక్షణమైన ఉత్కృష్టత, వారికి భారతీయ ఆర్య మూలాల వల్ల సమకూరింది. నెపోలియన్ నాటి ఫ్రాన్సు అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్లైగెల్ ఇచ్చిన జాతీయవాద పిలుపులో ఈ భావం ప్రముఖపాత్ర పోషించింది.
యూరోప్'లో ఆర్యపదం జాతివాచకంగా మారడం:
ఆర్య' శబ్దం, సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధం. దీన్ని మొట్టమొదట మాక్స్ ముల్లర్ భాషాకుంబానికీ ఆ భాషలు మాట్లాడే ప్రజలకూ వర్తింపజేశాడు. ఆర్యజాతి భావన, సొంతరూపం సంతరించుకొని, ఇరవయ్యో శతాబ్దపు నాజీవాదానికి ప్రాతిపదిక అయింది. ప్రస్తుతం, భాషాధ్యయన చరిత్రలోనూ దక్షిణాసియా అధ్యయనాలలో 'అర్య'' శబ్దం స్థానంలో 'ఇండో-యూరోపియన్' అనే పదాన్ని వాడటం జరుగుతూవుంది.
జర్మన్'లు తమ జాతీయ సారంగా ఆర్యన్ అస్తిత్వాన్ని గ్రహించి, దాన్ని అత్యంత తీవ్రమైన స్థాయిలకు తీసుకుపోయారు. అయితే, భారతీయులను పాలించి ఆంగ్లేయులకు ఈ శబ్దంతో విభిన్నమైన సంబంధం ఉంది. ఆంగ్లేయులకు సంబంధించినంత వరకు, ఆర్య శబ్దం, బంధుత్వ వర్గాల కుటుంబానికి సంబంధించింది. ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబ సభ్యులు అంటే ఆంగ్లేయులు, నిమ్న స్థానంలో ఉన్న కుటుంబసభ్యులకు అంటే భారతీయులకు సహాయం అందించడానికి ప్రయత్నించే కుటుంబ పునరేకీకరణ లేదా ప్రేమ వ్యవహారంలో భారతీయుల మీద ఆంగ్లేయుల పాలనను న్యాయబద్ధం చేయడానికి వాడటం జరిగింది. అనతికాలంలోనే బ్రిటిష్ దృక్పథంలో దీన్ని సమానుల కుటుంబంగా భావించడం జరిగింది. తరువాత శతాబ్దంలోపలే భాషా శాస్త్రం, జాతివాదానికి మూలంగా మారింది.
ఎర్నెస్ట్-రెనాన్ - ఆర్యన్ క్రీస్తు
ఎర్నెస్ట్ రెనాన్, హీబ్రూ అధ్యయనాలకు ప్రాధాన్యం లేని కాలంలో ఇండో-యూరోపియన్ అధ్యయనాలు ముమ్మరంగా ఉన్నకాలంలో హీబ్రూ పండితుడుగా జీవితం ప్రారంభించాడు. సెమిటిక్ భాషలలో సాధికారత సాధించిన తరవాత ఈయన ఆయా భాషల ద్వారా రెండు నాగరకతలను తులనాత్మకంగా పరిశీలించడానికి ఈ భాషా విజ్ఞానాన్ని సాధనంగా మలచుకొన్నాడు. సెమిటిక్ భాషలలోని క్రియ, కాలాన్ని క్రియావృత్తినీ మిళితం చేయలేదు కాబట్టి యూదు భాషలు ఏకేశ్వర వాదాన్ని ప్రచారం చేశాయని ఈయన అంటాడు. ఈభాషలు, బాహుళ్యాన్ని రూపొందించలేవు కాబట్టి యూదులు ఎప్పుడూ వైవిధ్యం గురించి ఊహించలేదు. రెనాన్ అభిప్రాయంలో యూదుల సరళమైన భాష, హేతుబద్ధత, ఆధిభౌతిక శాస్త్రం, సృజనాత్మక కార్యకలాపం వంటి విషయాలలో యూదుల సామర్గ్యాన్ని పరిమితం చేసింది. దీనికి విరుద్ధంగా,
సంపన్నమైన వ్యాకరణం, వాక్యనిర్మాణం ఉన్న ఆర్యులు, ప్రకృతిలో సహజసిద్ధంగా ఉన్న గతిశీలతనూ బాహుళ్యాన్ని అర్థం చేసుకొన్నారు.
మాక్స్ ముల్లర్'ను ఉదాహరిస్తూ రెనాన్, ఆర్యుల దేవతల పేర్లలో కనిపించే సహజ దృగ్విషయ బాహుళ్యాన్ని పేర్కొన్నాడు. ప్రతిపదం ధాతువులో 'ఒక ప్రచ్ఛన్నదేవత' ఉండటం విశేషం. యూదు ప్రజలకూ ఇండో-యూరోపియన్ ప్రజలకూ మధ్య భాషలోనే కాకుండా మతం విషయంలో
కూడా వ్యత్యాసం ఉంది. యూదులు, ఏకేశ్వరవాదాన్ని పాటించగా ఆర్యమతం 'ప్రకృతికి ప్రతిధ్వనిగా ఉంటుంది. అందువల్ల ఈ మతంలో అనేకమంది దేవతలను ఆరాధిస్తారు.
పౌరాణికగాథ, దేవతల విస్తృతికారణంగా ఆర్యులకు సృజనశీలత ఎక్కువని రెనాన్ భావించాడు. ఈ సృజనాత్మకత వల్ల వారు, తరవాత కాలంలో అధిభౌతిక శాస్త్రం వంటి శాస్త్రవిజ్ఞానాలను ఆవిష్కరించారు. యూదుల ఏకేశ్వరవాదం, తొలుత కాప్పు ఆస్తిగా ఉన్నప్పటికీ తరవాత 'మానవ ప్రగతికి అవరోధంగా' మారింది. వారు మొదట్లో సంపూర్ణ దైవత్వాన్ని గుర్తించినప్పటికీ వారి ప్రారబ్దం, తొలి తొలి బాల్యదశలోనే ముగిసిపోయింది. వారి భాషల్లాగే వారి మతం కూడా వైవిధ్యరహితంగా, స్థిరంగా ఉండి పోయింది. ఫలితంగా మానవవికాస శైశవదశలోనే వారుండి పోయారు. ఆ విధంగా మొదట్లో మానవతాపరమైన సేవలందించిన ఘనత యూదులకు ఉన్నప్పటికీ చివరికి, ఇండోయూరోపియన్ల కంటె తక్కువ స్థాయికి వారు దిగజారారు. ఆ విధంగా, యూదులు, ఆర్యుల చరిత్రలో భాగమయ్యారు. రెనాన్, జీసస్ ను జుడాయిజమ్ నుంచి వేరు చేశాడు. 'ఆర్యీకృత' క్రీస్తుగా రూపొందించాడు.
రెనాన్ భావన ప్రకారం:
- ఆర్యులు, మొదట్లో బహుదేవతారాధకులుగా ఉన్నారు. తరవాత క్రైస్తవ ఏకేశ్వరాధకులుగా మారారు.
- క్రైస్తవమతం, విభిన్న ఆర్యజాతుల స్ఫూర్తిని విలీనం చేసుకొంది. కొత్త క్రైస్తవం యూదు స్ఫూర్తిని పూర్తిగా అధిగమించింది.
- క్రైస్తవం జుడాయిజమ్ నుంచి వేరయింది. తద్వారా క్రైస్తవం, జుడాయిజమ్ లేదా ఇస్లామ్ కంటే 'తక్కువ స్వచ్చమైన యూదు' మతంగా రూపొందింది. యూదు ' అబ్రహామిక్ మతాల 'కనిష్ఠ ఏకేశ్వరవాదం'గా మారింది.
వివిధ నాగరికతల వికాసానికి సంభందించి రెనాన్ దృక్పథాన్ని పాటం 3.2లో చూడవచ్చు.
ఆ విధంగా రెనాన్ మానవజాతి చరిత్రలో ఆర్య, యూదు తంతువులకే రెండు తంతువులున్నాయి. ఈ ఆర్య-యూదు జన్యుపరమైన నాటకం నిమిత్తం అతను అతని సమకాలికులు క్రైస్తవ మత విజయం కోసం కృషి చేస్తూ వచ్చారు. ఇందులో ఆర్యులు, భాషాపరమైన, సాంస్కృతిక పరమైన పూర్వికులు. యూదులు, శిశువుల్లాంటి స్థాపకులు.
జీసస్ మతాన్ని ఆర్యీకృతం చేయాలి. ప్రగతికోసం యూదు సంబంధమైన లోపాల నుంచి విముక్తం చేయాలి. ఈ విధానంలో
, అతని యూదుజననాన్ని విస్మరించి జీసస్ క్రీస్తును ఆరాధించడం సాధ్యమైంది. ఆ విధంగా, మూఢవిశ్వాసాన్ని తొలగించి విజ్ఞానంతో సంఘటితం చేయడం ద్వారా క్రైస్తవమతానికి శాస్త్రీయ ప్రాతిపదిక కల్పించడానికి రెనాన్, భాషా శాస్త్రాన్ని ఉపయోగించాడు.
ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్
మాక్స్ ముల్లర్ (1823-1900) రెనాన్ మాదిరిగా భాషా శాస్త్రానికీ మతపరమైన అధ్యయనాలకూ సంబంధించి విశేషమైన కృషిచేశాడు. ఇతని రచనలు పాఠకులు బాగా ఆదరించారు. ఈ ఇద్దరూ పండితులూ నలభై సంవత్సరాలకు పైగా జాతిభావన ఆధారంగా కృషిచేశారు. అయితే, అనేక విషయాలలో వీరు పరస్పరం భేదించారు. మానవజాతి ఉమ్మడి ఆస్తి అయిన ఏకేశ్వరవాదంతో ఏ ఒక్క సంస్కృతీ ప్రత్యేకంగా ఆవిర్భవించదని మాక్స్ ముల్లర్ భావించాడు. భాషా నిర్మాణాలు, ఏకేశ్వరవాద, బహుదేవతారాధన రూపాలు రెండింటితో సహా అనేక మతాలుగా ఈ సంస్కృతిని
మార్చాయి.
రెనాన్ కోరుకొన్నట్లుగా, క్రైస్తవ వికాసంలోకి బహుదేవతారాధనను ప్రవేశపెట్టడానికి భారతీయ నాగరకతను ఉపయోగించడం మాక్స్ ముల్లర్ కు ఇష్టంలేదు. పిక్ టేట్ చెప్పినట్లుగా, ఆర్యులను ఏకదేవతారాధకులుగా రూపొందించడానికి కూడా ముల్లర్ ప్రయత్నించలేదు. ఈయన, విభిన్న మత దృక్పథాలను వివరించడానికి భాషా పరమైన వ్యత్యాసాలకు ప్రాధాన్యం ఇచ్చాడు ముల్లర్, సమస్త వస్తువుల్లోనూ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడానికి మతాల శాస్త్ర విజ్ఞానాన్ని కోరుకొన్నాడు.
మాక్స్ ముల్లర్, వలసవాదులకూ క్రైస్తవ ధర్మోపదేశకులకూ కార్యకర్తగా పనిచేశాడు. ప్రాచీన భారతీయ గ్రంథాలపట్ల ఎక్కువ ఆసక్తి కనబరిచాడు. ఖారతదేశంలో బ్రిటిషు రాజ్య కార్యదర్శిగా ఉన్న ఒర్గోయిల్ ను ఉద్దెశించి రాసిన లేఖలో ఒకదానిలో ముల్లర్ 'ప్రాచీన భారతదేశమతం పూర్తిగా నాశనమైంది. క్రైస్తవమతం ప్రవేశించలేకపోతే అది ఎవరి తప్పవుతుంది?' అని రాశాడు.
1868లో తన భార్యకు రాసిన లేఖలో కూడా ముల్లర్ ఇలా రాశాడు. 'నేను పని పూర్తి చేస్తాననుకొంటున్నాను | దాన్ని చూడటానికి నేను జీవించి ఉండకపోయినప్పటికీ, నేను రాస్తున్న ఈ సంపుటమూ వేదాల అనువాదమూ భారతదేశ ప్రారబ్దం గురించి ఈ దేశంలోని కోట్లాది ప్రజ
గురించీ చాలావరకు వెల్లడిస్తాయనే నమ్మకం నాకుంది' అదే లేఖలో ఆయన ఇంకా
ఇలా రాశాడు. 'వారి మతానికి మూలం వేదమే. మూలం ఏదో వారికి చూపడానికి
గత మూడు వేల సంవత్సరాల నుంచీ దాన్నుంచి ఉత్పన్నమైనదాన్నంతా తొలగించడమే
ఏకైక మార్గమని భావిస్తాను'. మరో విధంగా చెప్పాలంటే, సమకాలీన భారతీయ నాగరకతను, ముఖ్యంగా దానిలోని అనేక దేవతలను, ప్రాచీన వైభవానికి విరూపంగా భావించాడు.
అడాల్ఫ్ పిక్ టేట్
అడాల్స్ పిక్టేట్ (1799-1875), స్విస్ భాషా శాస్త్రవేత్త, క్రైస్తవ యూరోప్ లో ఆర్యవారసత్వాన్ని ప్రశంసించిన మరో నరవర్గ శాస్తరవేత్త. యూరోపియన్ ఆర్వన్ మూలాలు, ఆధిపత్య భావనకు ఈయన పూర్తిగా కట్టుబడ్డాడు. ఈయన ప్రకారం ప్రజ్ఞావంతులయిన సహజ సౌందర్యవంతులయిన ఆర్యులు ప్రపంచాన్ని జయించడానికి నియమితులయ్యారు. ఈయన ప్రత్యేక ప్రాధాన్యం, ఆర్యుల సాధారణ మత ప్రాధాన్యం ఏక దేవతారాధన భావనకు సంబంధించింది. మొదట్లో భారతీయులు
ఏకదేవతారాధకులనీ కాలక్రమంలో బహు దేవతారాధకులయ్యారనీ ఈయన భావించాడు.
రెనాన్, ముల్లర్ మాదిరిగా ఇతని లక్ష్యం కూడా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన జాతి జన్మస్థలం గురించి యూరోపియన్లకు తెలపడానికి భాషా విజ్ఞానాన్ని వినియోగించడమే. కావ్య సంబంధమైన బహుదేవతారాధన ఉన్నప్పటికీ ఆర్యులు, ఏకదేవతారాధకులుగా కనిపిస్తారని ఈయన వ్యాఖ్యానించాడు. సంస్కృతానికి భాషా పరమైన విశ్లేషణను వర్తింపజేస్తూ, ప్రాచీన భారతీయులలో ఆదిమ ఏకదేవతారాధన ఉండేదనీ దానిలో తీవ్రత లోపించడంవల్ల, వారు సహజ
దృగ్విషయానికి సంబంధించిన బహుళతను వివరించడానికి బహుదేవతారాధనలో పడిపోయారనీ ఆయన పేర్కొన్నాడు. ఆర్యులు, మొదట్లో విత్తిన ఏకదేవతారాధన అనే బీజాన్ని పునరుద్ధరించే కీలకమైన పాత్రను క్రైస్తవం నిర్వహించాలి.
పిక్ టేట్ ప్రకారం, ఇండో-యూరోపియన్ వారసత్వంలో సహజంగానే అంతర్నిర్మితమైన భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ప్రారంభం నుంచీ ఆర్యభాషల్లో భిన్నత్వం ఉంది. ఇండో-యూరోపియన్ ప్రజల్లో చరిత్రపూర్వ రాజకీయ సంఘీభావం ఉంది. ప్రపంచంలోని ప్రతి జాతికి దేవుడు అప్పగించిన పాత్రను వెల్లడించడం చరిత్రకారుడి పని అని ఈయన భావించాడు. రెనాన్ మాదిరిగా, హీబ్రూలకూ ఆర్యులకూ స్వీయలక్షణాలున్నాయని ఈయన భావించాడు.స్వాతంత్య్రం, స్వేచ్చ పట్ల తమకు గల ప్రేమ నేపథ్యంలో ఆర్యులు మొదట్లో బహు దేవతారాధనలో తమ మార్గం కోల్పోయారు. అయితే, పాదార్థిక ప్రకృతి విషయంలో ఆధిపత్యం సాధించిన మీదట క్రైస్తవ ఏకదేవతారాధన దిశగా మళ్లారు. సర్వమతాల ఉత్తమగుణాల సంశ్లేషణ క్రైస్తవం కాట్టి, మానవజాతి భవిష్యత్తుగా పేర్కొనడమైంది. మొత్తం భూగోళాన్ని పాలించడానికి క్రైస్తవులు నియమితులయ్యారు.
ఈ ప్రక్రియలో 'తొలి ఆర్యుల' వంశజులయిన భారతదేశంలోని ప్రజలు, ప్రస్తుతం 'ప్రయోజనకరమైన ప్రభావం' అందుకోడానికి యూరో వాసులుగా రూపొందారు. పిక్ టేట్ 'నాలుగైదువేల సంవత్సరాల విభజన తరవాత తమ సోదరులకు ఉన్నతమైన నాగరకతను అందించడానికీ, వారిలో ఉమ్మడి మూలానికి సంబంధించిన ప్రాచీన రుజువును ఆవిష్కరించడానికీ, వారిపై ప్రాబల్యం వహించడానికీ యూరోప్ ఆర్యులు తిరిగి రావడం అపురూపమేమీకాదు' అని పేర్కొంటూ భారతదేశంలో యూరోపియన్ వలస రాజ్యస్థాపనను ప్రస్తుతిస్తాడు. క్రైస్తవ వలస ఆర్యుల వలస ప్రాంత రాజ్యస్థాపన ద్వారా నాగరకత విస్తరించాలి.
రుదాల్ఫ్ ఫ్రెడరిక్ గ్రా
ఆర్.ఎఫ్.గ్రా (1835-93) ఆగమనంతో, ప్రాధాన్యాలు దాదాపు పూర్తిగా ఏకీకృత బైబిల్ సంప్రదాయం వైపుకు తరలిపోయాయి. సొంత శిబిరంలోని అసమ్మతిని తగ్గించడానికి క్రైస్తవానికి యూదు వారసత్వాన్ని గుర్తించవలసి వచ్చింది. ఆ విధంగా చేయడం వల్ల క్రైస్తవేతరులు, ముఖ్యంగా భారతీయుల మతం మార్పిడికి మంచి అవకాశం ఏర్పడింది.
జర్మన్ మత గురువైన గ్రా, తాను ఇండో-జర్మన్లుగా పేర్కొన్న ఆర్యులకు ప్రాముఖ్యం ఇవ్వడం ప్రమాదకరమనీ అలా చేస్తే క్రీస్తు మరుగునపడి పోతాడనీ భావించి, యూదులకు ప్రాముఖ్యం కల్పించాడు. భగవంతుడికీ క్రైస్తవాన్ని నమ్మే ప్రజలకూ మధ్య ఏకైక అనుసంధానంగా యూదు జాతీయులకు ఆయన ప్రాముఖ్యం ఇచ్చాడు. ఈ విధంగా ఇండో - జర్మన్లకు ప్రాముఖ్యం తగ్గించడం, ఆధునిక ప్రపంచ సమతుల్యానికి భంగం కలిగిస్తుంది. తన కాలంలోని చాలామంది యూరోపియన్లలోగే ఈయన కూడా సెమిటిక్ ఏకదేవతారాధనను స్వీకరించాడు కానీ తాను దేతి
యూదుల నుంచి దాన్ని వేరు చేశాడు. సెమైట్ల ఏకదేవతారాధనను ఇండో-జర్మన్'ల (ఆర్యుల) గతి శీలతతో మిలితం చేయడం ఉత్తమ మార్గం.
గ్రా అభిప్రాయంలో, కళల్లోనూ, శాస్త్ర విజ్ఞానాల్లోనూ ఇమిడి ఉన్న ఇండో-జర్మన్ ల అసాధారణ గతిశీలతకు క్రైస్తవమతం ద్వారానే సార్థక్యం ఉంటుంది. క్రైస్తవమతం లేకుంటే వారు అనాగరకతలో మునిగిపోతారు. ఈ అంశాన వివరించడానికి ఆయన, అనియంత్రితమైన సృజనాత్మకత భారతీయులకు ఉందని వివరిస్తూ క్రైస్తవ ప్రాబల్యం ద్వారా సెమిటిక్ రక్షకుడు మాత్రమే వారిని అయోమయ స్థితి నుంచి కాపాడగలడంటాడు, ఏ సాంస్కృతిక అవగాహనకయినా, మధ్యలో విలువను స్థిరంగా నిలపాలి. ఇతని పుస్తకాలలో అనేకం ఆంగ్లంలోకి అనువదితమయ్యాయి. భారతదేశంలోని హిందువులనూ ఇతర ధార్మిక ప్రజలనూ మతం మార్పించడానికి క్రైస్తవ చిహ్నాల పరిధిలో వైదిక చింతనను కూర్చడానికి చేసే తమ ప్రయత్నాలలో క్రైస్తవ మత ప్రచారకులు వీటిని ఉపయోగించుకున్నారు.
గోబిన్యు - జాతి విజ్ఞానం
జోసెఫ్ ఆర్డర్ కోమ్టె డి గొబిన్యూ (1816-82), ఫ్రెంచి దౌత్యవేత్త. తత్తవేత్త చరిత్రకారుడు, నవలాకారుడు, యూరోపియన్ ఆర్యులు, భారతదేశాన్ని ఆక్రమించుకున్న తరవాత, స్థానికులయిన నల్లజాతులతో కలిసిపోయి, విలువ కోల్పోయారని ఈయన పేర్కొన్నాడు. ఇతనికి సంబంధించినంత వరకూ భారతదేశ ప్రాముఖ్యం, తన జాతి సిద్ధాంతాలను సంస్థిరం చేసుకోవడానికి పరిశీలనాంశాధ్యయనంగా అది ఉపయోగపడటం వరకే.
విదేశీదాడులు తప్ప భారతదేశానికి సొంత చరిత్రలేదని కార్ల్ మార్క్స్ వివరించిన సంవత్సరం (1853) లోనే గొబిన్యూ 'ఎస్సే ఆన్ ది ఇనీక్వాలిటీ ఆఫ్ హ్యుమన్ రేసెన్' పేరుతో నాలుగు సంపుటాలలో తన జాతివాద సిద్ధాంతాలను ప్రచురించడం ప్రారంభించాడు. ఇతని రచన అనేక యూరోపియన్ భాషలలో అనువదితమై, జాతీ విజ్ఞానాలకు ప్రధానాధారమైంది. 'వర్ణవ్యవస్థ'ను వివరించడానికి ఆర్యుల దాడి ఉదాహరణగా చూపాడు కాబట్టి, గొబిన్యూ సిద్ధాంతంలో భారతదేశం, సోదాహరణ పాత్రను పోషించింది. గొబిన్యూ, జాతులకు సంబంధించిన భాషాపరమైన వర్గీకరణలో తిరస్కరించాడు. ప్రపంచంలోని నాగరికతలన్నీ శ్వేత జాతి నుంచే ఉద్భవించాయనీ అయితే, ఉత్తర యూరోప్ తప్ప మిగిలిన భౌగోళిక ప్రాంతాలన్నీ అంతర్వివాహాల వల్ల సతమతమయ్యాయని ఇతని వాదన.
తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు జాతులు |
గొబిన్యూ, బైబిల్ చట్ర పరిధిలోనే కృషి చేశాడు. 'మన శ్వేత జాతులకు ఆడమ్ మూల పురుషుడ'ని పేర్కొంటాడు. ఈయన అభిప్రాయంలో తెలుపు, పసుపు, నలుపు జాతులు మూడే ఉన్నాయి. వీరిలో తెల్లవారు అగ్రస్థానంలో ఉంటారు. సంస్కృతిని సృష్టించి, వ్యాప్తి చేసే సామర్థ్యం వీరికే ఉంది. అయితే, నిమ్న జాతులు నివసిస్తున్న ప్రాంతాలలోకి ఈ సాంస్కృతిక విస్తరణ ఫలితంగా పరస్పరం జాతుల సమ్మేళనం జరిగి, ఉన్నత జాతి పవిత్రత పతనమైంది. గొబిన్యూ సిద్ధాంతాన్ని హల్ప్ ఫాస్ ఈ విధంగా సంక్షిప్తీకరిస్తాడు. 'శ్వేతజాతి'కి చెందిన అత్యంత శక్తివంతులయిన ఆర్యులు, భారత ఉపఖండంపై దండెత్తారు. స్థానిక ప్రజలతో కలిసిపోవడం ప్రారంభించారు. ప్రమాదాన్ని గ్రహించిన ఆర్యన్యాయవేత్తలు, స్వీయ పరిరక్షణ సాధనంగా వర్ణవ్యవస్థను అమలు చేశారు. తదనుగుణంగానే ఇతర నాగరకతల కంటే భారతదేశంలో వర్ణసంకరం, పతన ప్రక్రియలు నెమ్మదించాయి.
మరో విధంగా చెప్పాలంటే, నిమ్నజాతి ప్రజలతో తమజాతి ప్రజలు కలిసిపోవడాన్ని తగ్గించడానికి శ్వేతజాతీయులు కులాన్ని సృష్టించారు. ఈ పరస్పర కలయిక వల్ల భారతీయ బ్రాహ్మణులు, పతనమైన ఆర్యులని గొబిన్యూ వివరించాడు. అయితే, కులవిభజన లేకపోతే ఈ పతనం మరింత ఎక్కువగా ఉండేదని ఆయన వాదించాడు. ఆవిర్భవిస్తున్న మార్క్విస్ట్ వర్గ పోరాటభావాలతో పాటు ఫ్రెంచి విప్లవం వెనక ఉన్న భావాలకు వ్యతిరేకంగా వాదించడానికి గొబిన్యూ, భారతదేశ ఉదాహరణను తీసుకొన్నాడు.
ఆర్య సిద్ధాంత కర్తలు - వంశాభివృద్ధి శాస్త్రం
జాతి సిద్దాంతాన్ని గొబిన్యూ ఒక్కడే ప్రతిపాదించలేదు. 1870లలో ఆక్స్ఫర్డ్ ఉపన్యాసకుడు, జాన్ రస్కిన్ యూరోపియన్లు 'ఉత్తమ ఉత్తరాది రక్తం' అనే ప్రపంచాన్ని పాలించాలనే భావనను రోడ్స్ వంటి తన విద్యార్థులలో పాదు కొలిపాడు, రోడ్స్, తరవాత కాలంలో ఆఫ్రికా నుంచి దోచుకున్న తన అపారమైన సంపదను, ప్రసిద్ధిగాంచిన రోడ్స్ స్కాలర్షిప్ కోసం ఉపయోగించాడు. మొదట్లో ఈ స్కాలర్షిప్ ను శ్వేత జాతి యువత కొరకే ఉద్దేశించడమైంది. వలసవాద యూరోప్అం తటా ఇలాంటి జాతివాద సిద్ధాంతాలుభావాలు వెల్లువెత్తాయి. పందొమ్మిదో శతాబ్దిలో వంశాభివృద్ధి శాస్త్రం లాంటి విద్యానిషయక వర్గాలలో ఊపందుకొన్నాయి.
'వంశాభివృద్ధి శాస్త్రం' అనే మాటను తొలుత 1893లో డార్విన్ సవతి సోదరుడయిన ఫ్రాన్సిస్ గాల్టన్ ఉపయోగించాడు. ప్రపంచం మొత్తం మీద మానవ నాగరక జాతులు, అనాగరక జాతులను తొలగించి, ఆ స్థానాన్ని ఆక్రమిస్తాయని డార్విన్ పేర్కొన్నాడు. మానవ జాతి నాణ్యతను మెరుగుపరచడానికి, నిమృజాతులలో పుట్టుకను నివారించడంతో పాటు ఉన్నతజాతులలో పుట్టుకను ప్రోత్సహించడం ద్వారా వరణాత్మక ప్రజననాన్ని వంశాభివృద్ధి శాస్త్రం సూచిస్తుంది. ఒకజాతి ఎలా నాగరకమైందో మాపనం చేయడానికి గాల్డన్, బ్రిటిష్ ఉన్నత వర్గాన్ని ప్రమాణంగా తీసుకొన్నాడు. ఆ ప్రమాణానికి భిన్నమైన జాతిని అనాగరక జాతిగా నిర్ధారించాడు.
వంశాభివృద్ధి శాస్త్ర సిద్ధాంత కర్త అయిన జార్జెస్ వాచెర్ డి లాపౌజ్ (1854-1936) మానవజాతుల వర్గీకరణను మరింత 'శాస్త్రీయ' వర్గీకరణగా మార్చాడు. 1899లో 'లాపౌజ్ ది ఆర్యన్ అండ్ హిస్ సోషియల్ రోల్' ను ప్రచురించాడు. ఆయన 'ఆర్యశ్వేతజాతి' ని మానవజాతి శిఖర స్థానంలో ఉంచాడు. ఇతను, తరువాత నాజీ జాతివాద ప్రేరకులలో ఒకడుగా రూపొందాడు.
చాంబర్లిన్ : ఆర్య క్రైస్తవ జాతివాదం
హూస్టన్ స్టూవర్ట్ చాంబర్లిన్ (1855-1927), తత్త్వశాస్త్రం, చరిత్ర, సంస్కృతి అంశాలమీద అనేక గ్రంథాలు రాసిన బ్రిటిష్ రచయిత. గొబిన్యూ సిద్ధాంతాలకు మరింత శాస్త్రీయ, తాత్త్విక ప్రాతిపదికను సమకూర్చడానికి కృషిచేశాడు. ఆ కృషిలో భాగంగానే, నాజీ నాయకత్వం మీద సాధికారికమైన ప్రభావం చూపాడు. ది ఫౌండేషన్స్ ఆఫ్ ది నైన్టీస్త్ సెంచరీ (1899) అనేది ఇతన సాహిత్య రచన. ఆంగ్లేయుడయనా చాంబర్లిన్, తన ఆర్యన్ - టుటనిక్ వారసత్వాన్ని ప్రముఖంగా చూపడానికి ఈ గ్రంథాన్ని జర్మన్ లో రచించాడు. ఈ గ్రంథం భారతీయ కులాన్ని జాతితో మడి పెట్టింది. టుటనిక్ వారసత్వాన్ని ఆర్యజాతులలో పరిణామం చెందిన వారసత్వం” ప్రముఖంగా పేర్కొంది.
చాంబర్లిన్, భారతదేశాన్ని, ఆర్యుల బలం తగ్గిపోయిన దేశానికి ఉదాహరణగా చూశాడు. అతని అభిప్రాయంలో, భారతదేశ ఆధ్యాత్మికరంగంలో కూడా ఇలాగే జరిగింది. బ్రాహ్మణభావన, సరికొత్త సజీవరూపాన్ని సృష్టిచడానికి మరేమి మిగలనంత సాయికి చేరుకొంది. బౌద్ధమతం, వృద్ధాప్య స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ది పౌండేషన్ నూతన నాగరకతకు నవోదయంగా జీసస్ ను ప్రతిపాదించింది. చాంబర్లిన్ జీసస్ కు సంబంధించిన అధ్యాయాన్ని మహాభారతం నుంచి గ్రహించిన కొటేషన్'తో ప్రారంభిస్తాడు. భారతీయ పవిత్ర సాహిత్యం, క్రైస్తవమత ఆగమనాన్ని ముందుగా ఊహించిందన్న రీతిలో సమర్పిస్తాడు. ఈ విధానం తరవాత భారతదేశంలోని క్రైస్తవమత ధర్మ ప్రబోధకులకు మంచి అనుకూలమైన సాధనంగా రూపొందింది.
చాంబర్లిన్, క్రైస్తవమతాన్ని అఖిల యూరోపియన్, ముఖ్యంగా టుటనిక్ దృగ్విషయంగా భావించాడు. ఈయన రోమన్ కాథలిక్ మతాన్ని యూదుల కుట్రగా భావించిన ఉదారవాదం నుంచి రక్షణగా ఉన్న మతంగా ప్రశంసించాడు. ఆయన జర్మన్ నేషనల్ చర్చికి సైద్ధాంతిక ప్రాతిపదిక కోసం టాథరేనిజమ్ వైపు చూశాడు. జుడాయిజమ్ ను తిరస్కరించినందుకు సెయింట్-పాల్ ను ప్రశంసించాడు. గొబిన్యూ మాదిరి కాకుండా చాంబర్లిన్ కు ఆర్యకల్పిత గాథకు సంబంధించిన బైబిల్ ప్రాతిపదికకు గల పరిమితులు తెలుసు. ఏదో ఒకరోజు చారిత్రక ఆర్యజాతి భావన పూర్తిగా అసత్యం కావచ్చుననే పూర్వసంకేతం ఆయనకు ఉంది. అయినా, అలాంటి భావన, యూరోప్ కు ముఖ్యమని ఆయన భావించి ఇలా రాశాడు:
గతంలో ఆర్యజాతి అనేది ఎప్పుడూ లేదని రుజువయినప్పటికీ భవిషత్తులో అలాంటిది ఒకటి ఉండాలని మనం కోరుకుంటాం. అదే కార్యకర్తలకు నిశ్చయాత్మకమైన దృక్పథం.
చాంబర్లిన్, ఆర్యకథనంలోకి శాస్త్రీయ, తాత్త్విక, క్రైస్తవ అంశాలను చొప్పించాడు. జర్మన్ జాతి ఆధిపత్యాన్ని సమర్థించిన అఖిల - యూరోపియన్ దృగ్విషయంగా తనను తాను సంకల్పించుకోవడం ద్వారా క్రైస్తవం పొందే ప్రమోజనాలను ఆయన వివరించాడు - ఈ దృక్పథం వల్ల గొబిన్యూ ఆర్యజాతివాదం, యూరోప్ మొత్తం మీద పలుకుబడి ఉన్న వర్గాలకు అంగీకార యోగ్యమైంది. మానవశాస్త్రవేత్త ఎ.ఆర్. కెన్నెడీ ఈ విధంగా పేర్కొన్నాడు:
"పద్దెనిమిదో శతాబ్దం చివర కలకత్తాలో జోన్స్ నిర్వహించిన భాషా పరిశోధనలో మూలాలున్న ఆర్యభావనను గొబిన్యూ, చాంబర్లిన్ లిడద్దరూ, అడాల్ఫ్ హిట్లర్ థర్డ్‌రీచ్ సంబంధించిన రాజకీయ, జాతిపరమైన సిద్ధాంతాలుగా మార్చారు'. నాజీ జర్మనీ, చాంబర్లిన్ మరణానంతరం 'థర్డ్ రీచ్ ద్రష్ట'గా ప్రకటించి, అతనిని గౌరవించింది.
నాజీలు - ఆ తరవాత
అలాంటి సిద్దాంతాలు, పందొమ్మిదో శతాబ్దంలోనూ ఇరవయ్యో శతాబం ప్రారంభకాలంలోనూ మరింతగా వృద్ధిపొందసాగాయి. దాదాపు 1900 ప్రాంతంలో చెలరేగిన రాజకీయ మేధాపరమైన ఉద్యమాలను ఇవి ప్రభావితం చేశాయి. ఈ సిద్దాంతాలు, యూరోపియన్ ఆధిపత్యానికి యోగ్యమైన రీతిలో నాగరకతల, జాతులు చరిత్రలను నిర్మించడానికి ఇండాలజీ నుంచి అవసరమైన సమాచారాన్ని మాత్రమే గ్రహించాయి.
ఇవన్నీ హిట్లర్ ను ప్రభావితం చేశాయి. జి.లాంజ్ లీబెన్ ఫెల్స్ (1874-1954) 'ఒస్తారా' అనే పత్రికను ప్రారంభించాడు. ఇందులో ఆయన, నలుపురంగు చర్మంగల చండాలుర గురించీ బంగారు జట్టుగల ఆర్యుల గురించీ తన జాతివాద సిద్ధాంతాన్ని రూపొందించాడు. 1908లో ఈ పత్రికకు సంబంధించిన రెండు సంచికలను మనుస్మృతి ప్రాచీన ఇండో - ఆర్యులలో జాతి వృద్ధికీ కేటాయించాడు. హిట్లర్, ఈ పత్రికను క్రమం తప్పకుండా చదివేవాడు. ఇలాంటి అనేక పుస్తకాలు, థర్డర్చ్ కి పాఠ్యగ్రంథాలయ్యాయి.
ఈ జాతివాద భావాలు, ఫాసిస్ట్ ఇటలీలోకి ప్రవేశించినప్పుడు, అవి మరింత జటిలమయ్యాయి. ఫాసిస్ట్ ఇటలీలో యూదుల పరిస్థితికి కేట్ కోహెన్ వివరణ ఇలా ఉంది. ఫాసిస్ట్ ఇటలీకి వర్తింపజేసినప్పుడు ఆర్యశబ్దం విడ్డురమైన అర్థం సంతరించుకొంది. శ్యామల వర్ణంలో ఉన్న దక్షిణాది కాథలిక్ ఆర్యుడే కానీ రాగిరంగు నీలికళ్లు ఉన్న మిలనీస్ యూదుడు కాదు. ఇటాలియన్ ఆర్యజాతి భావన హాస్యాసప్పదంగా తయారయింది.
గిలియొ కోగ్ని అనే ఇటాలియన్ ఆచార్యుడు, నాజీ ఆర్యుల భావాలను ఇటలీలో ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడు, తరవాత ఈయన, ముస్సోలినీకి దూరమైనప్పటికీ ఫాసిస్ట్ నియంత ఆలోచనలకు రూపుకల్పించడంలో ఇతను ప్రముఖపాత్ర వహించాడు. యూదుల విషయంలో కాథలిక్ దివ్యజ్ఞాన దృక్నథాలను జర్మన్ నాజీజమ్ మిశ్రం చేశాడు.
రెండోప్రపంచ యుద్ధం తరవాత, హిట్లర్ కు మారణకాండకూ వ్యతిరేకత ప్రబలిపోయింది. ఫలితంగా యూరోపియన్ ప్రధాన జనజీవన స్రవంతి నుంచి జాతి విజ్ఞానం, వంశాభివృద్ధి శాస్త్రం తొలగిపోయాయి. కేవలం విద్యావిషయక పదజాలం నుంచే కాకుండా యూరోప్ ప్రజల మనసుల్లోంచి కూడా ఆర్యజాతి భావనను తొలగించడానికి ప్రత్యేకంగా కృషి చేయడం జరిగింది.
భారతీయ నాగరికతను నిందించడం
యూరోపియన్ అస్తిత్వ రాజకీయ ప్రయోజనాల కోసం, భారతదేశ సంప్రదాయాలను యూరోపియన్ పండితులే వక్రీకరించి, దుర్వినియోగ పరిచినప్పటికీ కొంతమంది పాశ్చాత్య పండితులు ఇప్పటికీ యూరోపియన్ జాతివాదానికీ నాజీయిజమ్ కూ భారతదేశాన్నే నిందిస్తున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యులుగా ఉన్న షెల్డన్ పొల్లాక్ ఈ అభిప్రాయాన్ని పెంపొందించాడు. పొల్లాక్ అభిప్రాయంలో, మీమాంస సంప్రదాయం ప్రాతినిధ్యం వహించిన 'ఉన్నత బ్రాహ్మణ వాదం' వలసరాజ్యానికి పూర్వపు భారతదేశంలో సైద్ధాంతిక రూపకల్పనలకు దోహదం చేసింది. నాజీయిజం, దీన్ని జర్మనీలో అమలుచేయడానికి ప్రయత్నించింది. అయితే వాస్తవం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. చరిత్రకారుడు 'రాల్హిల్ బర్గ్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ యూరోపియన్ జూస్' అనే తన మూడు సంపుటాల బృహద్రంథంలో విలియమ్ నికోల్స్ అనే చరిత్రకారుడు పేర్కొన్న కింది అంశాన్ని చేర్చాడు:
..... మధ్యయుగంలోని చర్చికి సంబంధించిన క్రైస్తవ ధర్మనియమాలకూ తదుపరి నాజీల చర్యలకూ మధ్య రూపొందించిన తులనాత్మక పట్టిక, నిస్సందేహంగా రెండో అంశం మూలం కాదనీ, తెలిసినగతాన్ని అనుసరించిందనీ చూపుతూ ఉంది. (2010 సంవత్సరంలో భారత ప్రభుత్వం, పొల్లాక్ ను పద్మశ్రీ బహుమతితో సత్కరించింది).
ఆర్యులదాడులు మొ॥ అంశాలకు సంబంధించి, భారతదేశం విషయంలో ఆర్యభావనను ఉపయోగించడం కొనసాగిస్తున్న పాశ్చాత్య ఇండాలిజిస్ట్ల పేచీలను మనం గమనించవచ్చు. యూరోపియన్ జాతి భావనలు సులభంగా, భారతదేశంలోకి ప్రవేశించాయి. ఇక్కడ, తెల్లరంగు చర్మం గల 'ఆర్యులు' గానూ, నల్లరంగు చర్మం గల 'ద్రావిడులు' గానూ తిరిగి పేర్కొనడమైంది ఈ తేడాలు మొదట వలసపాలకుల కాలంలోనే రూపుదిద్దుకొన్నాయి. అయితే, భారతదేశపు వివిధ అధ్యయనాలలో ఈ నాటికీ శక్తిమంతంగా నిలిచి ఉన్నాయి
రచన: రాజీవ్ మల్హోత్రా - అరవింద్ నీలకంఠన్
ఈ వ్యాస మూలము: 'భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు' ఈ పుస్తకాన్ని కొనాలనుకున్నవారు ఇక్కడ క్లిక్ చేయండి:...🖛 🔗