యూరోపియన్లు ఆవిష్కరించిన 'జాతులు' - ఒక ఆలోకన
పాశ్చాత్య విద్యావిషయక నిర్మాణాలు హింసకు దారితీశాయి:
గత అయిదు శతాబ్దాలలో యూరోపియన్ రాజ్యాలు, చాలా ఆసియా, ఆఫ్రికా, అమెరికా ప్రాంతాలలో, వలసరాజ్యాలు ఏర్పాటు చేసుకొన్నాయి. ఈ పాశ్చాత్యదేశాలు వలస సంస్కృతుల మీద వివిధరకాల యూరోపెంట్రిక్ ప్రపంచ దృక్పథాన్ని విధించాయి. వలసరాజ్యస్థాపనను సమర్థించుకోడానికి విశ్వవ్యాప్తమైన చారిత్రక కథనంతో పాటు స్థానిక సంస్కృతుల చరిత్రలను కూడా నిర్మించడం జరిగింది. ఈనాడు, ఈ పక్షపాతధోరణిలో చాలా వాటిని బహిర్గతం చేసినప్పటికీ అవి ఇంకా విద్యావిషయక సామాజిక, రాజకీయ రంగాలలో అధికారం చెలాయిస్తున్నాయి. ప్రపంచం మొత్తం మీద యూరోసెంట్రిక్ నిర్మాణాలు ఏవిధంగా హింసాత్మక సంఘర్షణలకు దారితీశాయో పటం 2.1లో క్లుప్తంగా చూడవచ్చు..
హింసాత్మక యూరోసెంట్రిక్ నిర్మాణాలు - పటం 2.1 - Breaking India పుస్తక సౌజన్యంతో |
యూరోప్:
పదెమిమిదో శతాబ్దంలో, యూరోప్ సాంప్రదాయిక మత భావనకు విజ్ఞానం వల్ల ప్రమాదం వాటిల్లినప్పుడు యురోపియన్లు, బంగారు (స్వర్ణమయమైన) గతంవైపు చాతారు. శతాబ్దాలుగా యూరోప్ దిగుమతులకు ప్రధాన వనరుగా ఉన్న భారతదేశంలో ఆ గతాన్ని చూడగలమని చాలామంది భావించారు. ఈ అస్తిత్వాన్వేషణలో బారతీయమత గ్రంథాలను వక్రీకరించి పఠించడం ద్వారా, ఆదర్శవంతమైన ఆర్యజాతి'ని నిర్మించడం ప్రారంభించారు. తీవ్రమైన జర్మన్ జాతీయవాదంతోనూ, యూదు వ్యతిరేకవాదంతోనూ, జాతి విజ్ఞానంతోనూ విసిగిపోయిన ఈ పరిస్థితి, చివరికి నాజీవాదానికీ మారణహోమానికీ దారితీసింది.
భారతదేశం:
పద్దెనిమిదో శతాబ్దం మలిదశలో ప్రముఖ సంస్కృతీ అధ్యయన వేత్త మాక్స్ ముల్లర్ ఆర్యవర్గాన్ని కచ్చితంగా భాషావరమైన వర్గంగా ప్రతిపాదించాడు. అయితే వలసపాలకులు, దాన్ని ఆర్యజాతిగా మార్చారు. ఈ పాలకులు, సంప్రదాయ భారతీయ సముదాయాలను వర్గీకరించడానికి జాతి విజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆర్యేతరకులాలుగా పేర్కొన్న కులాలను సమాజ చిత్రణలలో తొలగించారు. దీనికి సమాంతరంగా, 'దక్షిణ భారతదేశంలో పనిచేస్తున్న క్రైస్తవ ధర్మోపదేశకులు ద్రావిడ జాతిని నిర్మించారు. వీరు, తమిళ సంస్కృతిని, అఖిల భారత సంస్కృతి నుంచి వేరు చేశారు'. దాని ఆధ్యాత్మికత, ఉత్తర భారతదేశ ఆర్య సంస్కృతి కంటె క్రైస్తవానికే సన్నిహితంగా ఉందని పేర్కొన్నారు.
శ్రీలంక:
శ్రీలంకలో, దివ్యజ్ఞాన సమాజం రేకిత్తించిన బౌద్ధమత పునరుద్ధరణ కూడా ఆర్యజాతి సిద్దాంత భావనలను విస్తరింపజేసింది. బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్, మాక్స్ ముల్లర్లు తమిళులను ద్రావిడులుగానూ, సింహళీయులను ఆర్యులుగానూ వర్గీకరించారు. వలసపాలకులు ఈ విభజనను ప్రోత్సహించారు. క్రమంగా ద్రావిడ ఆస్తిత్వాన్ని కల్పించుకున్న చాలామంది దక్షిణాది ప్రజలు ఈ విభజనను పాటించారున . ఆర్యులుగా పేర్కొంటున్న వారికి వ్యతిరేకంగా దాన్ని మార్చారు. ఫలితంగా భయంకరమైన జాత్యంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం శ్రీలంకలో కొన్ని
శతాబ్దాలపాటు కొనసాగింది.
ఆఫ్రికా:
నోవా కుమారుడు హామ్ వంశజులు శాపగ్రస్తులయ్యారనే బైబిల్లోని కల్పితగాథను, బానిసత్వాన్ని సమర్థించుకోవడానికి బానిస వర్తకులూ బానిసల యజమానులూ ఉపయోగించుకొన్నారు. హామ్ వంశానికి చెందిన భాషా వర్గాలను గుర్తించి, మిగిలిన ఆఫ్రికా ప్రజల నుంచి వారిని వేరు చేశారు. ఆఫ్రికన్ సంస్కృతిలోని విశిష్టత అంతా ఆఫ్రికామీద దాడిచేసి నాగరీకరించిన ఒక కల్పిత శ్వేత ఉపజాతి కృషి ఫలితంగా వివరించారు. సంప్రదాయ ఆఫ్రికా సముదాయాలను జాతులుగా చేసిన పాశ్చాత్య వర్గీకరణ, రువాండాలోలాగా జాతి విధ్వంసంతో సహా తీవ్రమైన శత్రుత్వాలకు దారితీసింది.
రచన: రాజీవ్ మల్హోత్రా & అరవిందన్ నీలకందం
గ్రంథ మూలము: Breaking India