ఈ సందర్భంగా జ్ఞాపకార్థం లండన్లోని ఇండియన్ హై కమిషన్ భవనం ఇండియా హౌస్లో ఒక అధికారిక కార్యక్రమం జరిగింది. దీనికి మెట్రోపాలిటన్ పోలీసు అధికారులు, ఇండియా హౌస్ సిబ్బంది మరియు రిమోట్గా కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరైనట్లు హిందుస్తాన్ టైమ్స్ లో ఒక నివేదిక తెలిపింది.
Auspicious moment as 3 more priceless statues of Vijayanagara period stolen from Vishnu temple, Nagapatinnam in 1978, recovered by @HCI_London with support of #MetPoliceLondon, restored to Govt of Tamil Nadu in presence of Hble Union Min for Culture&Tourism Shri @prahladspatel. pic.twitter.com/XRmzQIkWG6
— India in the UK (@HCI_London) September 15, 2020
1947 నుండి 2014 మధ్య 13 వస్తువులు మాత్రమే తిరిగి వచ్చాయని మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. కాని ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితంగా, 2014 తరువాత 40 కి పైగా కళాఖండాలను విదేశీ దేశాలు భారతదేశానికి అప్పగించాయి.
విగ్రహాల ప్రాముఖ్యత:
స్వరాజ్య పత్రిక నివేదిక ప్రకారం, విగ్రహాలను ఆనందమంగళ రాముడు, లక్ష్మణ మరియు సీత అని పిలుస్తారు. అవి విజయనగర కాలం నుండి అద్భుతంగా రూపొందించిన కాంస్య విగ్రహాలు. తంజావూరు జిల్లాలోని ఆనందమంగ్లం, మయూరం తాలూకలోని శ్రీ రాజగోపాల స్వామి ఆలయం నుండి దొంగిలించబడిన విగ్రహాలతో ఛాయాచిత్రాలను సరిపోల్చారు.
ప్రస్తుతం సౌత్ ఈస్ట్ ఆసియాలోని ఒక మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న అదే సమూహానికి చెందిన మరో హనుమాన్ విగ్రహం ఉందని ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ పేర్కొంది.
Source: Opindia