నేడు షహీద్ భగత్ సింగ్ జీవితం లోని కొన్ని సంఘటనలు
- ➣ భారతీయులను అనేక రకాల అవమానాలకు, హింసాకాండకు బలిచేస్తున్న ఆంగ్లేయుల పరిపాలనపై భగ్గున మండినవాడు భగత్ సింగ్. మాతృభూమి సేవలో నవ్వుతూ జీవితాన్ని బలిదానం చేయగల దృఢ సంకల్పంతో ఆంగ్లేయుల నెదిరించిన విప్లవ వీరుడు భగత్ సింగ్. ఉరికంబాన్నెక్కేoదుకు తొందర పడుతూ, నాకు మళ్లీ విప్లవకారునిగానే జన్మనివ్వమని భగవంతుణ్ణి ప్రార్థించిన ఒక అగ్నికణం మన సర్దార్ భగత్ సింగ్.
- ➣ జలియన్ వాలా బాగ్ లో జరిగిన నరమేధం ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టవలసిందేన్న భావన భగత్ లో మరింత బలపడింది. భగత్ తన అభిప్రాయాన్ని తండ్రికి చెప్పి ఆయన అనుమతి కోరాడు. స్వయంగా విప్లవకారుడైన తండ్రి కొడుక్కి సంతోషంగా అనుమతినిచ్చాడు. భగత్ సింగ్ చదువు విడిచి పెట్టి జాతీయోద్యమంలో చేరిపోయాడు.
- ➣ అహింస పట్ల, సహాయ నిరాకరణోద్యమం పట్ల భగత్ సింగ్ కు గల నిష్ఠను భంగపరిచాయి. దేశానికి స్వాతంత్య్రం రావాలంటే సాయుధ పోరాటమే మార్గమని దృఢంగా విశ్వసించి భగత్ సింగ్ ముందుకు సాగిపోయాడు.
- ➣ పెళ్లి గురించి ఒత్తిడి చేయగా ఇల్లు వదిలి వెళ్లేందుకు నిర్ణయించుకొని ఒక లేఖ రాసి పెట్టాడు. ఆ లేఖలో "నా జీవిత లక్ష్యం భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడడం. సంసార సుఖాలపై నాకు కోరిక లేదు. నా స్వంత సుఖాలనూ త్యజించి, దేశ సేవ కోసం ఇల్లు విడిచి వెళుతున్నాను". అని వ్రాసి పెట్టి వెళ్లిపోయినటువంటి త్యాగమూర్తి మన భగత్ సింగ్.
- ➣ 1928 సం.లో ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి సైమన్ కమిషన్ వచ్చింది.ఆ కమిషన్ కు వ్యతిరేకంగా ఒక ఊరేగింపుకు లాలాలజపతిరాయ్ నాయకత్వం వహించారు. సైమన్ కమిషన్ ను ముందుకు పోనివ్వలేదు. ఆ సమయంలో జరిగిన లాఠీచార్జీ లో లాలా లజపతి రాయ్ మరణించారు.
- ➣ లాలాజీ ఛాతిపై లాఠీతో మోదిన ఆ సాండర్స్ ను భగత్ సింగ్ చంపేశారు. ఆ హత్య బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది.
- ➣ భగత్ సింగ్ ఒక విదేశీ యువకుడి వేషం(ప్రస్తుతం ఉన్న ఫోటో) వేసుకొని తలపై టోపీ పెట్టుకుని సురక్షితంగా బయటపడ్డారు. పోలీస్ గాలింపులు జరుగుతూనే ఉన్నాయి.కానీ ప్రయోజనం లేకపోయింది.
- ➣ సాండర్సన్ హత్యానంతరం లాహోర్ లో పోలీసులు ప్రజలను హింసించడం ఎక్కువైంది. దీన్ని వ్యతిరేకిస్తూ విప్లవకారులు తమకు తాము స్వచ్ఛందంగా అరెస్ట్ కావాలని నిర్ణయించారు. అయితే ప్రజలకు తమ సందేశం అందించేందుకు ఢిల్లీలో జరిగే సెంట్రల్ అసెంబ్లీ సమావేశాల్లో ఎవరినీ గాయపరచని బాంబు విసిరి స్వచ్ఛందంగా అరెస్టయ్యారు.
- భగత్ సింగ్ అతని అనుచరులకు విరుద్ధంగా విచారణ ప్రారంభమైంది. కోర్టులో భగత్ సింగ్ వివరణ యిలా వుంది. "చెవిటి వాడు వినాలంటే అతనికి చాల పెద్దస్వరంతో చెప్పవలసి ఉంటుంది. మేము బాంబులు విసిరింది ఎవరినీ హత్య చేయడానికి కాదు, మేము బ్రిటిష్ ప్రభుత్వంపై బాంబులు వేసినది ఆంగ్లేయులు భారత్ ను విడిచి వెళ్లాలి. మా దేశం స్వాతంత్ర్యం కావాలి " భగత్ సింగ్ తమ సంస్థ ఉద్దేశ్యం గురించి వివరించాడు.
- ➣ యావత్ ప్రపంచానికి వారి సంస్థ గురించి పత్రికల ద్వారా తెలిసిపోయింది. చివరగా కోర్టుతీర్పు చెప్పింది. భగత్ సింగ్ ఉరిశిక్ష పడింది. భగత్ సింగ్ కు ఉరిశిక్ష విధించింన వార్త దేశమంతా వ్యాపించింది. జనం ఆగ్రహోదగ్రులయ్యారు, భగత్ సింగ్ కు ఉరిశిక్ష విధించివద్దని ప్రభుత్వాన్నికి వేలాదిగా విజ్ఞాపనలు అందాయి.
- ➣ 1931వ సం.లో మార్చి 24 వ తేదీ ఉరిశిక్ష వేసేందుకు నిర్ణయం జరిగింది. వారి కుటుంబ సభ్యులు వారిని కలిసేందుకు అనుమతినివ్వలేదు. నిర్ణయించిన తేదీకి ఒక రోజు ముందుగానే అంటే మార్చి 23 వ తేదీన ప్రభుత్వం ఉరి తీసింది.
- ➣ ఉరితీసే ముందు భగత్ సింగ్ జైలర్ తో పలికిన మాటలు "మీరు చాలా అదృష్టవంతులు, భారత స్వాతంత్ర్య సంగ్రామ సైనికులు నిర్భయంగా నవ్వు ముఖంతో మృత్యువునెల ఆహ్వానిస్తారో కళ్ళారా చూసే అవకాశం మీకు లభిస్తోంది. మేము మీకు అది చూపిస్తాం".
- ➣ స్వాతంత్ర్య సంగ్రామంలో వీరోచితంగా పోరాడి తమ జీవితాన్ని బలియిచ్చిన భగత్ కు దేశమంతా ఆధారపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించింది. ఈనాటికీ భగత్ సింగ్ ఆత్మ ఈ దేశపు యువకుల హృదయాలలో త్యాగం, బలిదానం, ఆత్మ సమర్పణ యిత్యాది భావనలను జాజ్వల్యమానంగా ఉంచుతూనే ఉంది. ఆయన సాహసం, అసాధారణమైన పనులు చేయడంలో గల నిష్ఠ మరియు అకుంఠిత దేశభక్తి అందరికీ ప్రేరణనిస్తూనే ఉన్నాయి.
- ➣ భగత్ సింగ్ కేవలం విప్లవ వీరుడు మాత్రమే కాదు ఒక ఆలోచనాపరుడు మరియు అధ్యయనశీలి. తన చిన్న జీవితంలో అనేక విషయాల పట్ల అవగాహన కలిగివుండటంతో పాటు చాలా విషయాలపట్ల స్పష్టమైన అవగాహన ఉండేది.
" మేరా షహీద్ నిరుపయోగ్ నహీ హోగా
మేరా దేశ్ కో విజయ్ సత్వర మిలేగా"
◆ భారత్ మాతా కీ జై ◆