విద్యావంతులైన ఇస్లామిక్ యువతరం ఇప్పుడు తమ విశ్వాసంలోని ప్రాధమిక అంశాలను ప్రశ్నిస్తోంది. ఇది కేవలం అమెరికాలోనో, పాశ్చాత్య దేశాలలోనో చోటుచేసుకుంటున్న పరిణామం కాదు. మత విషయాలలో కఠినమైన నిబంధనలు కలిగిఉన్న సాంప్రదాయక ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, ఇరాన్, సుడాన్ లాంటి దేశాలలో కూడా ఇప్పుడు ఈ ధోరణి కనిపిస్తోంది. అమెరికన్ పత్రిక అయిన ‘ది న్యూ రిపబ్లిక్’ సౌదీ అరేబియాలో మరియు ప్రపంచ వ్యాప్తంగా నాస్తికవాదం వైపు మొగ్గు చూపుతున్న ముస్లీముల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నదో వివరిస్తూ ఒక కథనం ప్రచురించినప్పుడు ఆ దేశం నివ్వెరపోయింది. ఆశ్చర్యకరంగా కొన్ని దేశాలలో ఈ సంఖ్య వందల నుండి వేలల్లో ఉంది. freearabs.com అనే వెబ్ సైట్ చీఫ్ ఎడిటర్, “నేను ఈ మధ్య ఫేస్బుక్ లో ఇంగ్లిష్ మరియు అరబిక్ భాషలలో ‘నాస్తికులు’ అన్న పదం ఆధారంగా వెతికినప్పుడు కొద్దిమంది నుండి 11,౦౦౦ వరకు సభ్యత్వమున్న దాదాపు 250 పేజీలు లేదా గ్రూపులు వివిధ అరబిక్ దేశాలకు చెందినవి కనిపించాయి. ఈ సంఖ్య ఆన్ లైన్ లో ప్రభావం చూపడానికి కట్టుబడి ఉన్న అరబ్ నాస్తికులు లేదా నాస్తికవాదం వైపు ఆసక్తి చూపుతున్న వాళ్ళది.” అని పేర్కొన్నారు.
2012 లో జరిగిన WIN/Gallup International poll ని ఉటంకిస్తూ, 5 శాతం మంది సౌదీ పౌరులు – అంటే పది లక్షల కన్నా ఎక్కువ మంది – తమని తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు. అమెరికా లో కూడా వీరి శాతం ఇంతే ఉంది. 19 శాతం మంది, అంటే 60 లక్షల మంది సౌదీలు తాము మత ప్రమేయం లేని వ్యక్తులం అని భావిస్తున్నారు. ఇటలీలో ఇలాంటి వాళ్ళు 15 శాతం ఉన్నారు. మత భ్రష్టుత్వానికి మరణ శిక్ష విధించే షరియా చట్టాలు అమలులో ఉన్న అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సుడాన్, యెమెన్ వంటి దేశాలలో కూడ ఈ సంఖ్యా చెప్పుకోతగిన స్థాయిలో ఉండటం ఆశ్చర్యకరమని ఈ పత్రిక పేర్కొంది.
నాస్తికవాద శాస్త్రవేత్త అయిన రిచర్డ్ డాకిన్స్ వ్రాసిన ‘God Delusion’ అనే పుస్తకం మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఎక్కువగా డౌన్ లోడ్ చేయబడుతోంది. ఇప్పుడు ఇది అరబిక్ భాషలోకి కూడా అనువదించబడింది. అలాగే దీనిని అరబ్ పాఠకులకు ఉచితంగా అందుబాటులోకి తేవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మత వ్యతిరేకతకి మరణశిక్ష విధించే ఇస్లామిక్ దేశాలలో ఈ ధోరణి పెరుగుతోంది. మతాన్ని లేదా విశ్వాసాన్ని మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తోంది కాబట్టి అనేక ఇస్లామిక్ దేశాలు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనను వ్యతిరేకిస్తున్నాయి.
తమను గుర్తిస్తారేమో అన్న భయంతో చాలా మంది అజ్ఞాతంలో ఉండటంతో, ఒకప్పుడు ముస్లిములుగా ఉన్న వాళ్ళ సంఖ్యను సరిగ్గా తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇస్లాం నుండి శాశ్వతంగా బయటకి వెళ్ళినవాళ్ళు తమ మరియు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకు హాని ఉందన్న నిరంతర భయంతో జీవిస్తున్నారు. పాకిస్తాన్ లోని మత బోధకులు ఎవరన్నా మత విశ్వాసాన్ని వదులుకుంటే వాళ్ళ ఇళ్ళను తగలబెట్టమని బోధిస్తునారు. Ex-Muslims, Muslim-ish అనే పేర్లతో వీళ్ళు రహస్యంగా ఆన్ లైన్ లో సంభాషించుకుంటారు. 2015 లో బ్రిటన్ లో జరిగిన ఒక ట్విట్టర్ ప్రచారంలో చాలా మంది Exముస్లిమ్స్ తాము తమ మత విశ్వాసాలను ఎందుకు వదులుకున్నారో తెలియచేసారు. వారు చెప్పినదాంట్లో ప్రధానమైనవి… అసహనం, స్త్రీల పట్ల వివక్ష, స్వేచ్చగా ఆలోచించే హక్కు లేకపోవడం, 700 సంవత్సరాల నాటి మత గ్రంధాన్ని మార్పు చేసే అవకాశం లేకపోవడం… ఒక లిబరల్ ముస్లిం ఈ విధంగా తన అభిప్రాయం వెలిబుచ్చాడు…”స్త్రీ ద్వేషం, హోమోఫోబియా, రాళ్ళతో కొట్టి చంపడం, మత వ్యతిరేకులకి మరణ శిక్ష విధించడం అనేవి ఒక పవిత్ర గ్రంధంలో పెట్టినంత మాత్రాన గౌరవనీయమయిపోవు. (Ali A. Rizvi, Huffington Post, 23 November, 2015)
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కి చెందిన విద్యావేత్త Faisal Devji ‘’Ex-Muslims తమ పేరులో ముస్లిం అనే పదాన్ని ఉంచడం ద్వారా తాము మత విశ్వాసాలను త్యజించడంలో ఉన్న వేదాంత ధోరణిని తెలియచేస్తున్నారు’’ అని వాదిస్తున్నాడు.
నేను పెరిగిన తూర్పు ఆఫ్రికాలోని ముస్లింలు ప్రార్ధన చేయడాన్ని, ఉపవాసాలు ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇస్లాంని వదిలిపెట్టి, నాస్తిక వాదాన్ని కొత్త గుర్తింపుగా పొందుదామనే ఆలోచనే వాళ్ళకి రాదు. (Conversions from Islam in Europe and Beyond, Faisal Devji, The New York Times, 15 April, 2017)
The Economist అనే పత్రిక Mahad Olad అనే సొమాలి మూలాలు కలిగిన ఒక అమెరికన్ ముస్లిం బాలుడిని అతని తల్లిదండ్రులు కెన్యా పర్యటన పేరుతో అక్కడకి తీసుకెళ్ళి అక్కడ అతను మళ్ళీ ముస్లిం మత విశ్వాసం వైపు వచ్చేలా చూడటానికి ప్రయత్నాలు చేసిన కథనాన్ని ప్రచురించింది. కెన్యాలో కాలు పెట్టేదాకా అతనికి తన తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలియదు.
కెన్యాలో విమానంలో నుండి కాలు బయటపెట్టగానే అతనికి అక్కడ ఏదో జరగబోతోంది అని అర్ధమైపోయింది. ఎక్కువగా మతవిశ్వాసం కలిగిన అతని తల్లి అతను సమీపంలో లేనప్పుడు ఎవరితోనో మాట్లాడటం అతనికి తెలుస్తోంది. త్వరలోనే అతని అనుమానం నిజమని తేలిపోయింది.. అత్యంత మత విశ్వాసం కలిగిన అతని తల్లిదండ్రులకు అతను కేవలం నాస్తికుడే కాకుండా స్వలింగ సంపర్కం కూడా చేస్తున్నాడని తెలిసింది. అతనిని కాపాడుకోవడానికి చేసిన ఒక కుట్ర కెన్యా పర్యటన. (The Economist, 15 March, 2018)
అతనికి అసలు విషయం తెలియగానే పారిపోవడానికి పథకం వేసాడు. అతను దొంగచాటుగా అతని తల్లి పడక గదిలోకి వెళ్లి, తన పాస్పోర్ట్ తీసుకుని, అమెరికన్ రాయబార కార్యాలయానికి వెళ్లి, వాళ్ళ సాయంతో అమెరికాలోని తన ఇంటికి చేరుకున్నాడు. అప్పటినుండి అతను తన తల్లిదండ్రులతో మాట్లాడలేదు.
ఈ Olad ఉదంతం వెనుక మనం మాములుగా వినని కథలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే, విశ్వాసాన్ని కోల్పోయిన ముస్లిం యువత ఎలా తమ మతానికి దూరమవుతున్నారు అనేది. ఇస్లాం రోజు రోజుకీ బలపడుతోంది అని మనం వింటున్నాము. ప్రతి రోజూ ఈ మతం కొత్తవాళ్ళని ఆకర్షిస్తోంది అని, ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల మంది ఈ మతాన్ని విస్వసిస్తున్నారని, ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మతం అని జరిగే ప్రచారాన్ని మనం వింటూ ఉన్నాము. అయితే, ఈ మతంలో ఉన్న తీవ్రమైన విషయాలను జీర్ణించుకోలేక ఆధునిక తరానికి చెందిన అనేకమంది యువతీ యువకులు ఈ మత విశ్వాసానికి దూరంగా జరుగుతున్నారన్న విషయం మనకి తెలియడం లేదు. అమెరికాలో ముస్లీముల సంఖ్య దాదాపుగా 50 శాతం పెరగగా, దానిని వదిలేసిన వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంది. అమెరికాలో ముస్లిములుగా పెరిగిన వాళ్ళల్లో 23 శాతం యువత ఇప్పుడు దానికి దూరంగా జరిగారని Pew Research Centre చేసిన ఒక సర్వేని ఉటంకిస్తూ ‘The Economist’ అనే పత్రిక ప్రచురించిన నివేదిక తెలియచేస్తోంది. అమెరికాకి వలస వచ్చిన వారిలో రెండవతరం వారితో పాటు, పాత తరం ముస్లిములు కూడా ఇదే బాట పడుతున్నారు. ‘మతభ్రష్టులు’ అన్న ముద్రని తప్పించుకోవడం కోసం వీళ్ళు ఇస్లాం విశ్వాసం కలిగిఉన్న స్త్రీలను పెళ్లి చేసుకోవడం, తమ పిల్లలలను ఖురాన్ నేర్చుకోమని మసీదులకు పంపడం లాంటివి చేస్తున్నారు.
The Apostate: When Muslims Leave Islam అనే డాక్యుమెంటరీ లో Simon Cottee అనే బ్రిటిష్ విద్యావేత్త అనేక మంది మాజీ ముస్లీముల కథనాలను చేర్చాడు. దానికి కారణాలు మత చాందసం, అణచివేత, ఇస్లాం పేరుతో జరిగే హింస. 15 మార్చ్, 2018 లో The Economist లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన ఖురాన్ లోని కొన్ని అంశాలకి స్పందనగా ఇలా జరుగుతోంది. అందులో చెప్పిన బానిసత్వం, లింగ వివక్షలకు కుటుంబ సభ్యులు కానీ, ఇమాములు కానీ సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. Ayaan Hirsi Ali, Richard Dawkins, Christopher Hitchens లాంటి రచయితల పుస్తకాలను చదవడం కూడ ఇదే రకమైన స్పందనకు దారి తీస్తోంది. కొంతమంది ఇస్లాం లోని Sexism మరియు హోమోఫోబియా ను వ్యతిరేకిస్తున్నారు.
మధ్య ప్రాచ్యంలో పనిచేసే ఒక ప్రముఖ విలేకరి మరియు Arabs Without God అనే పుస్తక రచయిత అయిన Brian Whitaker మాత్రం ఇలా ఇస్లాం కి దూరమవడానికి కారణం ఆ మతం ప్రేరేపిస్తున్న హింస అనిపించడం లేదని అభిప్రాయపడ్డాడు. “నేను నా పుస్తకం రాస్తున్నప్పుడు అనేక మంది అరబ్బులను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళల్లో ఒక్కరు కూడా హింసను ప్రేరేపిస్తోంది అన్న కారణం చేత ఇస్లాంకి దూరమయ్యాము అని చెప్పలేదు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది కూడ ఏమీ లేదు. నాస్తికవాదం అనేది మతాలలోని అన్ని అంశాలకు దూరంగా జరగడం. కేవలం అందులో ఉన్న విపరీత ధోరణిని వ్యతిరేకించడం కాదు.”
ఇంతకు ముందు పేర్కొన్న New Republic లోని ఆర్టికల్ లో Benchemsi, “అరబ్బులలో నాస్తికవాదానికి ప్రధాన కారణం వ్యక్తిగత సందేహాలు. పవిత్ర గ్రంధంలో ఉన్న హేతుబద్దత లేని అంశాలను వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మంచివాళ్ళు అయినప్పటికీ, ఇస్లామేతరులు నరకానికి ఎందుకు పోతారు? భవిష్యత్తు అంతా తెలిసి ఉండి, అన్నిటినీ నియంత్రించగలిగిన దేవుడు ఎందుకు కొంతమందిని దారితప్పేలా చేసి, తరువాత శిక్షిస్తున్నాడు? పుణ్యాత్ములైన ముస్లిములకు స్వర్గంలో అపరిమితంగా మద్యం లభిస్తుంది అని చెప్పి, అదే మద్యాన్ని ఇక్కడ తాగకూడదు అని ఎందుకు చెప్తున్నారు?”
మాజీ ముస్లీముల అభిప్రాయాలను నేను చదివినప్పుడు వాటన్నిటిలో ఒక ఉమ్మడి అంశం కనిపిస్తోంది. ఇస్లాంని వదిలిపెట్టడం అనేది అంత సులభమైన నిర్ణయం కాదు. కొంతమంది సంవత్సరాలపాటు ఆలోచించారు. తాము ఇస్లాంలో చదివిన అనేక మంచి విషయాలను బయట వాస్తవంగా జరుగుతున్న వాటితో సమన్వయము చేసుకోలేక వాళ్ళు చాలా సంఘర్షణకు గురయ్యారు. మతానికి దూరంగా జరిగేముందు కొంతమంది వాస్తవాలను తెలుసుకోవడం కోసం, తమ సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం అరబిక్ భాషని నేర్చుకుని, మూల గ్రంధాలని అధ్యయనం చేసి, తాము చేస్తున్నది పొరబాటు కాదని తెలుసుకున్నారు. తాము ఆ మత విశ్వాసానికి కట్టుబడి ఉండలేమని, అయిష్టంగానే దానికి దూరంగా జరుగుతున్నామని తెలిపారు.
మతానికి దూరంగా జరిగాక కొంతమంది తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యారు. ఇంతకు ముందే ప్రస్తావించినట్టు ఇస్లాం వాళ్ళ జీవితాలను ఎంత మేర ప్రభావితం చేసింది అనేదానిని ఇది తెలియచేస్తోంది. ఆ గుర్తింపును కోల్పోవడం వాళ్ళల్లో సాంఘిక, నైతిక ఒంటరితనాన్ని కలగచేసింది. ఇలాంటి సంఘర్షణకు గురి అయిన Irtaza Hussain అనే ఒక బ్రిటిష్ ముస్లిం యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యావంతులైన ఆధునిక ముస్లిం యువత తమ మతం లోని అంధ విశ్వాసాలను ప్రశ్నించడాన్ని ‘ticking of bomb’ గా అభివర్ణించవచ్చు.
(Extracted from Who Killed Liberal Islam by Hasan Suroor, with permission from Rupa Publications)
తెలుగు అనువాదం : శేషశాయి దీవి. - విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర రాష్ట్రము)
SOURCE : THE TELEGRAPH