Manglik Dosha, Kuja Dosha - కుజ దోషము
కుజుడు ఉష్ణ ప్రకృతి గల గ్రహము. దీనిని పాప గ్రహముగా చెప్పబడును. వివాహము మరియు వైవాహిక జీవితములో కుజుని యొక్క అశుభ ప్రభావము అధికముగా కనిపించును. కుజ దోషము కలవారిని మాంగళీకునిగా చెప్పబడును. ఈ గ్రహ దోషము కారణముగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతము అవివాహితులుగా వుండిపోయెదరు. ఈ దోషము వలన గల భయమును తొలగించుటుకొనుటకు దీని గురించి పూర్తిగా తెలుసుకొనుట అవసరము.
మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నది .
వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి , నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడి అంతర్ధానం అయ్యాడు. ఆ తర్వాత అంగారకుడు (మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది. అమృతం సేవించిన తరువాత కుజుడు (మంగళుడు) ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ,ఆ వినాయకుడిని శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు. ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది. అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజు ( బహుళ చతుర్ధి ,కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజు) మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు వారికీ ఉన్న అన్ని కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి.అని వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒకక్క నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో? అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసీ వినాయకుడి వ్రతం వల్ల కలేగే ఫలితం సమానం..అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించ బడతాయి.
'ఇంత వయసు వచ్చినా ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా'' ? అనే ప్రశ్న వినిపించిన వెంటనే, ''ఆ అమ్మాయికి కుజ దోషం ఉందట'' అనే సమాధానం వినిపిస్తూ వుంటుంది. ఇక ఈ మాట విన్న వాళ్లంతా కుజదోషం అంత భయంకరమైనదా? అని అనుకోవడం సహజం. అయితే కుజదోషం గురించి అంతగా భయపడవలసిన పనిలేదు. అది పరిహారం లేనంత పెద్ద సమస్యకూడా కాదు. జాతకాలు చూసే వాళ్లలో కొందరు ఈ విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ రావడంవల్ల, కుజుడు అంటేనే కంగారు పడిపోయేంత పరిస్థితికి చేరుకోవడం జరిగింది. కొన్ని గ్రహాలతో కలిసి వున్నప్పుడు కుజుడు కూడా మేలు చేస్తాడనే విషయం చాలా మందికి తెలియదు.
కుజ పుట్టుక :
భరద్వాజ మహర్షి ఓ సౌందర్యవతిని చూడటం వలన ఆయన మనసు అదుపు తప్పి 'రేతస్సు' భూమిపై పడింది. 'మంగళుడు' అనే పేరుతో ఆ శిశువు భూదేవి ఆలనా పాలనలో పెరిగాడు. అగ్నికి సమానమైన తేజస్సు కలిగినవాడు కాబట్టి అంగారకుడిగా ప్రసిద్ధి చెందాడు. విపరీతమైన కోపం ... అనుకున్నది సాధించేంత వరకూ నిద్రపోని పట్టుదల కుజుడి లక్షణాలుగా చెప్పబడ్డాయి. ఈ కోపం వలన తాత్కాలికమైన నష్టం జరిగినా ... పట్టుదల కారణంగా విజయాలు అందుకున్న వారి సంఖ్య ఎక్కువని చరిత్ర చెబుతోంది.
ఇక జాతకం లో కుజుడు శుభస్థానంలో వున్నాడా? లేక దోషస్థానంలో ఉన్నాడా ? అనేది ముందుగా చూసుకోవాలి. కుజదోషం వుంటే అది ఏ స్థాయిలో ఉందో ... అది తన ప్రభావాన్నిఎప్పుడు చూపిస్తుందనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకోవాలి. పంచాంగం పైపైన చూసి కుజదోషం వుందని చెప్పగానే ఆడపిల్ల జీవితంపై ఆ ముద్ర వేయకూడదు. శాస్త్రం బాగా తెలిసిన వారితోనే చూపించి జాతక ఫలాన్ని నిర్ణయించవలసి వుంటుంది.ఇక కుజ దోషం వుందని చెప్పినా విచారంలో మునిగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దోషం ప్రభావం అందరికీ ఒకేలా వుండదు. అది వున్న స్థానాన్ని బట్టి తీవ్రత ... ఫలితం మారుతూ వుంటుంది. ఇక మేషం - వృశ్చిక రాశులలో పుట్టినవారికి కుజదోషం వర్తించదని 'జ్యోతిష్ గ్రంధ్' అనే ప్రాచీన కాలంనాటి గ్రంధం చెబుతోంది.కుజ దోషం వున్నవారు భూమాతను ... సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వలన, అంగారకుడి అనుగ్రహం లభిస్తుందని తెలుస్తోంది. అలాగే మంగళ వారాల్లో దేవాలయాల్లో దీపారాధన చేయడం ... పగడాన్ని ధరించడం పరిష్కార మార్గాలుగా చెప్పబడుతున్నాయి. ఇక దోషం ఎంత బలంగా ఉన్నా డీలాపడి పోవలసిన పనిలేదు. ఎందుకంటే అన్ని దోషాలకు విరుగుడు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆంజనేయస్వామి ఉపాసన వల్ల జాతకంలోని దోషాలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. మంగళ, శనివారములు 'మారుతి' కి పరమప్రీతికరమైన దినములు. విశేషించి కుజ దోషం గల ఆడపిల్లలు, వివాహంకాని వారు, భర్తచే అనాదరణకు గురైన స్త్రీలు, భర్తతో తగవు, ఎడబాటు కలవారు తమలపాకులతో హనుమంతుని పూజించి, అప్నాలు నివేదించి 'సిందూరం' నొసట ధరించడం వల్ల మేలు కలుగుతుంది.
రచన: పోలాకి అనంత శర్మ