కర్ణాటకలో మాండ్యలోని అర్కేశ్వర ఆలయానికి చెందిన ముగ్గురు పూజారులును గురువారం గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసారు.
మాండ్యా పట్టణ శివారు ప్రాంతమైన గుత్తలులో ఉన్న ఆలయ ప్రాంగణంలో గణేష్ (55) ప్రకాష్ (58), ఆనంద్ (40) మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు.
శ్రీ అరకేశ్వర ఆలయం, మాండ్యా, కర్ణాటక |
దుండగులు ముగ్గురు పూజారులను దారుణంగా పొడిచి, బండరాళ్లతో తలలు పగులగొట్టి, ఆలయ హుండి (విరాళం పెట్టె) లో కరెన్సీ నోట్లతో దోచుకుని, నాణేలను వదిలిపెట్టారు. విలువైన వస్తువులను వెతుక్కుంటూ దుండగులు ఆలయ గర్భగుడిలో కి వెళ్లి దోచుకున్నారని తెలిపారు.
శుక్రవారం తెల్లవారుజామున గ్రామస్తులు ఆలయం లోపలికి వెళ్లి ప్రధాన తలుపు తెరవగానే ఈ ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ ప్రాంగణంలో రక్తపు మడుగులో పడి వున్న పూజారులు దారుణంగా హత్యకు గుర్తించిన వెంటనే, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ సహా సీనియర్ పోలీసు అధికారులు అందరూ సంఘటన స్థలానికి చేరుకుని ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. నేరస్థలంపై దర్యాప్తు చేయడానికి ఫోరెన్సిక్ బృందాలు మరియు స్నిఫర్ కుక్కలను కూడా తీసుకువచ్చారు.
మరణించిన పూజారుల కుటుంబాలకు కర్ణాటక సిఎం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు:
కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యెడియరప్ప పూజారుల మరణానికి సంతాపం ప్రకటిస్తూ, మరణించిన పూజారుల కుటుంబాలకు కర్ణాటక సిఎం సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.