
బ్రూసిల్లోలిస్నే ‘మాల్టా ఫీవర్’ అని కూడా పిలుస్తారు. ఇది సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కీళ్ల-కండరాల నొప్పి, వెన్ను నొప్పి, చలి, చెమటలు పట్టడం, ఆయాసం, బరువు తగ్గడం, ఆకలిగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇది జంతువుల నుంచి వ్యాపిస్తుంది. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది.
మనిషి నుంచి మనిషికి సోకడం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి కీళ్లనొప్పుల సమస్య జీవితకాలం వేధించే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే కొందరు సంతానసాఫల్యత సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మరికొందరిలో అవయవాల్లో వాపు ఏర్పడుతుందని తెలిపారు. వ్యాధి ముదురుతున్న కొద్దీ కాలేయం, గుండె, నాడీ వ్యవస్థపైనా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు.