ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో జరుగుతున్న భారీ మోసాన్ని జాతీయ భద్రతా రంగంలో పనిచేస్తున్న 'లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం' అనే ఎన్జీఓ బయటపెట్టింది.
హిందువులకు మాత్రమే ఇవ్వబడే ఎస్సీ / ఓబిసి సర్టిఫికెట్లు విపత్తు ఉపశమన (Disaster Relief Fund) నిధి ద్వారా ₹ 5,000 ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన 29,841 మంది క్రైస్తవ పాస్టర్లలో 70% మంది షెడ్యూల్డ్ కులం / ఇతర వెనుకబడిన కుల ధృవీకరణ పత్రాలను చట్టవిరుద్ధంగా కలిగి ఉన్నారని 'లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం' పరిశోధనలో తేలింది. అయితే ఎస్సీ / ఓబిసి సర్టిఫికెట్లు హిందువులకు మాత్రమే ఇవ్వాలి, కానీ ఇక్కడ క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా సర్టిఫికెట్లు పొంది ఉండడం గమనించాలి.
చైనా వైరస్ మహమ్మారి వలన విధించిన లాక్డౌన్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్స్ మరియు క్రిస్టియన్ పాస్టర్లను ‘మతపరమైన సేవలకుగాను’ ₹ 5000 గౌరవ వేతనం ఇవ్వబడింది. ఇందులో 31,017 మంది అర్చకులు, 7000 ఇమామ్‌లు, మౌజమ్‌లు, 29,841 మంది పాస్టర్లకు ₹ 5000 గౌరవ వేతనం మొత్తం. 33.92 కోట్లకు చెల్లించినట్లు 'ఎల్ఆర్పిఎఫ్' ఆర్టీఐ (Right to act Information) ద్వారా సమాచారాన్ని సేకరించింది.
ఇదిలా ఉండగా. బాప్టిజం పొంది పాస్టర్లుగా శిక్షణ పొందిన క్రైస్తవులలో అధిక శాతం మంది ఎస్సీ / ఓబిసి ధృవపత్రాలను కలిగి ఉన్నారు మరియు ₹ 5,000 గౌరవ వేతనం రాజ్యాంగ విరుద్దంగా పొందారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 90.86% హిందువులు, 7.33% ముస్లింలు మరియు 1.39% క్రైస్తవులు.
అయితే, గౌరవ వేతనం పొందిన లబ్ధిదారుల డేటా వ్యత్యాసం స్పష్టంగా చూపిస్తోంది:
పైన పేర్కొన్న డేటా ప్రకారం ఎస్సీల జనాభాలో భారీ పెరుగుదల ఉందని స్పష్టంగా తెలుస్తుంది, అయితే క్రైస్తవుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
AP లోని క్రైస్తవుల జనాభా యొక్క అధికారిక అంచనా 1.39% కాగా, గౌరవ లబ్ధిదారులలో 43.99% క్రిస్టియన్ పాస్టర్లు ఉన్నారు. బాప్టిజం పొందిన మరియు పాస్టర్ శిక్షణా కోర్సులు చేసి అక్రమంగా హిందూ కుల ధృవీకరణ పత్రాలను కలిగి ఉన్న క్రైస్తవులలో అధిక శాతం మంది వన్-టైమ్ రిలీఫ్ గౌరవ వేతనం ₹ 5,000 పొందారని LRPF తన పరిశోధనలలో వెల్లడించింది.
ఈ విషయమై ఎల్ఆర్పిఎఫ్ 'జాతీయ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కులాలకు చెందిన (ఎన్‌సిఎస్‌సి)కు లేఖ రాస్తూ వెంటనే వన్-టైమ్ విపత్తు ఉపశమనం. ₹ 5,000 అందుకున్న క్రైస్తవ పాస్టర్ల మతం / సామజిక వివరాలతో కూడిన పూర్తి జాబితాను కమిషన్‌కు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీఐ (RTI) నుండి పొందిన నమూనా డేటా మరియు ఇతర మార్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా, 58.14% క్రిస్టియన్ పాస్టర్లు వాస్తవానికి హిందూ-ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్లను కలిగి ఉన్నారు మరియు 13.37% క్రైస్తవ పాస్టర్లు హిందూ ఓబిసి కమ్యూనిటీ సర్టిఫికేట్లను కలిగి ఉన్నారు.
ఒక నివేదిక ఆధారంగా, ఇక్కడ మనము ఆలోచించినట్లయితే పైన జాబితా చూపించబడిన ఆధారంగా 70% పాస్టర్లు హిందూ సమాజ ధృవీకరణ పత్రాలను కలిగి ఉన్నారని మనము అనుకుంటే (నమూనా డేటాలో 80.81% వెల్లడిస్తుంది), ఆలెక్కన పాస్టర్ల మొత్తం సంఖ్య 20,900 కు వస్తుంది. అయితే వారు అందుకున్న ₹ 5000 రూపాయలుతో చుస్తే మొత్తం 10.45 కోట్లకు వస్తుంది, ఇది స్పష్టంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం జరుగుతోందని అర్ధముతోంది. వాస్తవాలను మోసపూరితంగా తప్పుగా చూపించడం ద్వారా మతం మార్చుకుని ఎస్సీ / ఓబిసి కమ్యూనిటీల సర్టిఫికెట్‌ను చట్టవిరుద్ధంగా పొందిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్సిఎస్సిని NCSCని కోరారు.
మతంమార్చికుని క్రైస్తవులుగా మారి మోసానికి పాల్పడుతున్న వైనం:
షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఇచ్చే ప్రభుత్వ ప్రయోజనాలను వినియోగించుకునేందుకు పాస్టర్లు ద్వంద్వ మత గుర్తింపులు కలిగి ఉన్నారని ఎల్ ఆర్ పిఎఫ్ (LRPF) పేర్కొంది.
"ప్రభుత్వం ఎస్సీ/ఓబీసీల సంక్షేమం కోసం పథకాలు అమలు చేసినప్పుడు, వారు హిందూ అనే గుర్తింపును ఉపయోగించుకుని ఇదే సందర్భంలో క్రైస్తవ పాస్టర్లకు ప్రయోజనం చేకూర్చే పథకం ప్రకటించినప్పుడు, వారు వారి క్రైస్తవ గుర్తింపును ఉపయోగించుకున్నారు", అని పేర్కొంది.
హిందువులైన ఎస్సీ ల ప్రయోజనాలను ఈ పాస్టర్లు ఎంతవరకు దుర్వినియోగం చేస్తున్నారో ఈ క్రింది డేటా నుండి చూడవచ్చు:
పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తాము హిందూ-ఎస్సీలుగా చెప్పుకుని సంబంధిత కమ్యూనిటీ సర్టిఫికేట్లను పొందడం ద్వారా నిజమైన హిందూ ఎస్సీల జీవనోపాధిని కోసం రూపొందించిన అన్ని ప్రయోజనాలను చట్టవిరుద్ధంగా మతం మార్చుకున్న వీరు పొందుతున్నారని ఎల్ఆర్పిఎఫ్ గుర్తించింది. రాష్ట్రంలో పరిపాలన అధికారిత్వం సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం సాధ్యం కాదని పేర్కొంది.
పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తాము హిందూ-ఎస్సీలుగా చెప్పుకుని సంబంధిత కమ్యూనిటీ సర్టిఫికేట్లను పొందడం ద్వారా నిజమైన హిందూ ఎస్సీల జీవనోపాధిని కోసం రూపొందించిన అన్ని ప్రయోజనాలను చట్టవిరుద్ధంగా మతం మార్చుకున్న వీరు పొందుతున్నారని ఎల్ఆర్పిఎఫ్ గుర్తించింది. రాష్ట్రంలో పరిపాలన అధికారిత్వం సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం సాధ్యం కాదని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో క్రైస్తవ పాస్టర్లకు నెల నెలా 5000 నెలవారీ భత్యం ప్రకటించింది. అయితే పాస్టర్లు తాము నిజమైన క్రిస్టియన్లమని క్రిస్టియన్ కమ్యూనిటీ సర్టిఫికేట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయలేదు, ఇది హిందూ కమ్యూనిటీ సర్టిఫికేట్ కలిగి ఉన్న క్రైస్తవులు దరఖాస్తు చేసుకోవడానికి, ప్రయోజనం పొందటానికి అనుమతించినట్టయ్యింది.
"పాస్టర్లకు నెలవారీ పింఛను ఇస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేరుస్తున్నందుకు, వీరందరూ ప్రయోజనాలు పొందుతున్నారని " అని ఎల్ఆర్పిఎఫ్ తెలిపింది.
ఇది ప్రజా ఖజానాను తీవ్రంగా దుర్వినియోగం చేయడం, మోసగించడం మరియు షెడ్యూల్డ్ కుల వర్గానికి ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ మతంలోకి మారడానికి ప్రత్యక్షంగా ప్రోత్సాహంచడం వలన నిజమైన షెడ్యూల్డ్ కుల సభ్యుల కోసం ఉద్దేశించిన అన్ని రాజ్యాంగ ప్రయోజనాలను పక్కన పెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్సాహంతోనే మార్పిడులు జరుగుతున్నాయా?
76 చర్చిల నిర్మాణం / మరమ్మత్తు / పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కోదానికి ₹ 5 లక్షల చొప్పున నిధులు విడుదల చేసిందని గమనించాలి.
"ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము నిందించడం లేదు, ఇది గత 5 దశాబ్దాల కాలంగా జరుగుతోంది. రాష్ట్రంలో వరుస ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను దుర్వినియోగం చేయడానికి చురుకుగా సహాయపడ్డాయి." ఫిర్యాదు చేసారు.
అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం 2014-19 కాలంలో 817 చర్చిల నిర్మాణానికి నిధులు సమకూర్చింది, అప్పటి ఆర్థిక మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఎల్ఆర్పిఎఫ్ తెలిపింది. చాలా చర్చిలు ఎస్సీ కాలనీలలో ఉన్నాయని, తద్వారా అన్యమతలోకి మత మార్పిడికి ఇది సహాయపడుతోంది.
ఎస్సిల మతమార్పిడుల విషయమై FCRA ద్వారా మతమార్పిడుల కై అందుతున్న ఆర్థిక మూలాలపై దర్యాప్తు చేసేందుకు ఒక నిజ నిర్దారణ కమిటీని ఆంధ్రప్రదేశ్ కు పంపించి నిజమైన ఎస్సి/ఎస్టీ లకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి LRPF ఎల్ఆర్పిఎఫ్, 'జాతీయ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) ' ను కోరింది.
ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలలో 10-15% మంది మాత్రమే తమ హిందూ మతం, సంస్కృతి మరియు నాగరికతను గౌరవిస్తూ, ఆచరిస్తూ నిజమైన హిందూ షెడ్యూల్డ్ కులాల వారీగా ఉన్నారని పేర్కొంది.
Andhra Pradesh: We found that 70 % of 29,841 Christian pastors who received one-time honorarium of Rs. 5K through 'Disaster Relief Fund' are holding Hindu SC/OBC Caste Certificates.
— Legal Rights Protection Forum (@lawinforce) September 10, 2020
Wrote to National SC & BC commissions on this state assisted incentive to convert to Christianity
వ్యాస మూలము: ద కమ్మ్యూ మాగ్
అనువాదము: తెలుగు భారత్ - ఈ వ్యాసము రచయితల అభిప్రాయానికి సంబంధించింది, పూర్తి భాద్యత వారిదైయున్నది.