యూరప్‌లో సంభవించిన తాజా పరిణామాల చర్చకు ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఫ్రాన్స్‌లో నిర్వహించారు. కరోనా వైరస్, బెలారస్ రాజకీయ అస్థిరత, లెబనాన్ పేలుళ్లు, రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యస్థితి తదితర అంశాలను గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వివిధ యూరప్ దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫ్రాన్స్ అధినేత అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశానికి విచ్చేసిన జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కల్‌కు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రోన్ స్వాగతం పలికారు.
_విశ్వ సంవాద కేంద్రము
ఈ సందర్భంగా వారిరువురూ భారతీయ సాంప్రదాయమైన నమస్కారంతో అభివాదం చేసుకోవటం విశేషం. కాగా, ఈ వీడియోను ఫ్రాన్స్ అధ్యక్షుడు స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిలో ఫ్రెంచి ప్రథమ మహిళ బ్రిగిట్టె మాక్రోన్‌ను కూడా చూడవచ్చు. ఈ కీలక సమావేశంలో చైనా-యూరప్ సంబంధాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.Bienvenue au Fort de Brégançon chère Angela ! pic.twitter.com/6VSiTSAuJz— Emmanuel Macron (@EmmanuelMacron) August 20, 2020
_విశ్వ సంవాద కేంద్రము