భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడమే తమ ప్రయత్నం అని ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు అసిఫ్ ఇక్బాల్ తన్హా పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగానికి ఈ విషయాన్ని వెల్లడించినట్టు జీ న్యూస్ తెలిపింది.
జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి అయిన ఆసిఫ్ ఇక్బల్ 2014 నుండి స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ సంస్థ సభ్యుడుగా కొనసాగుతున్నాడు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన పేరిట ఢిల్లీ జరిపిన అల్లర్ల కేసులో ఇతడిని మే నెలలో పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసారు.
భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో పాటు తన ఇతర అనేక విస్మయకరమైన ఉద్దేశాలను అసిఫ్ ఇక్బల్ పోలీసుల విచారణలో తెలియజేసాడు. పౌరసత్వ సవరణ చట్టం ముస్లిములకు వ్యతిరేకమైనందున దాన్ని నిరసిస్తూ జామియా మిలియా ఇస్లానియాలో జరిగిన అల్లర్లలో పాల్గొని, ‘శాంతియుత ప్రదర్సన’ పేరిట బస్సులకు నిప్పు పెట్టిన విషయాన్ని కూడా అంగీకరించాడు .
జామియా మిలియా ఇస్లామియా అల్లర్ల వెనుక కుట్ర:
జీ న్యూస్ నివేదిక ప్రకారం.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 12న ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీ గేటు నెంబర్ 7 నుండి 2500 మందిని రాలీకి సిద్ధం చేసినట్టు ఒప్పుకున్న ఆసిఫ్ ఇక్బల్, మరో నిందితుడు షర్జీల్ ఇమామ్ ఇచ్చిన రెచ్చగొట్టే ప్రసంగం ద్వారా స్ఫూర్తి పొందినట్టు తెలిపాడు. డిసెంబర్ 15 జామియా మెట్రో స్టేషన్ నుండి జాకిర్ నగర్, బాట్లహౌస్ మీదుగా పార్లమెంట్ రోడ్ చేరేవిధంగా ఒక ర్యాలీ రూపకల్పన చేసినట్టు, ఆ ర్యాలీకి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఆకర్షితులై హాజరయ్యే విధంగా దానికి ‘మహాత్మాగాంధీ శాంతి ర్యాలీ’ అని పేరుపెట్టినట్టు వెల్లడించాడు.
పోలీస్ బ్యారికేడ్లను ధ్వంసం చేయాల్సిందిగా నిరసనకారులను రెచ్చగొట్టిన ఆసిఫ్ ఇక్బల్:
ర్యాలీ జరుగుతున్న సమయంలో పోలీసులు నిరసనకారులను నిలువరించేందుకు సూర్య హోటల్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులు నిస్సహాయులుగా భావించి, బ్యారికేడ్లను ధ్వంసం చేయాల్సిందిగా ఇక్బల్ అక్కడివారిని రెచ్చగొట్టాడు. అయితే పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో ఇది సాధ్యం కాలేదు. దీంతో ఆగ్రహించిన జామియా విద్యార్థులు బస్సులను తగలబెట్టారు. ఈక్రమంలో పోలీసులతో పాటు కొంతమంది ‘నిరసనకారులు’ కూడా గాయపడ్డారు.
ఈ ఘటనే కాకుండా, ఆసిఫ్ ఇక్బల్ దేశంలోని కొలకత్తా, కోటా, లక్నో, ఇండోర్, ఉజ్జయినితో సహా మరికొన్ని ఇతర నగరాల్లో సభలకు హాజరై రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చిన విషయం పోలీసుల విచారణలో తెలిసింది.
Source: OpIndia - విశ్వ సంవాద కేంద్రము