అరవై ఏళ్ళ క్రితం వరకు, మన దేశంలో ఏ ఇల్లుచూసినా అన్నీ ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అప్పట్లో అందరూ కలిసి ఉంటేనే సుఖం అన్నట్టుగానే ఉండేవారు. ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్లకు బాగా గౌరవం ఉండేది.
అన్ని విషయాల్లో అన్నదమ్ములు ఒకమాటపై ఉండేవారు, ఇప్పుడు మాదిరిగా, వయసైపోయిన తల్లితండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలెయ్యడం లాంటివి అప్పట్లో అసలు ఉండేవి కాదు. ఇంటి కట్టుబాట్లు సంప్రదాయాలు లాంటివి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తరతరాలుగా పాటిస్తూ వచ్చేవారు. చిన్నవాళ్లు పెద్దవాళ్ళను గౌరవించడం అనేది కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే బాగా ఉండేది.
కానీ ఆనాటి సంఘసంస్కర్తలు, మేధావులు అని చెప్పుకునేవాళ్ళు ఈ ఉమ్మడి కుటుంబాలలో ఉండే సాధారణ సమస్యలను భూతద్దంలో చూపిస్తూ, చిన్న కుటుంబాలే సమాజానికి మేలు అన్నట్లు, నిత్యం పత్రికలలో, పేపర్లలో రకరకాల శీర్షికలు రాస్తూ, ఉమ్మడి కుటంబ వ్యవస్థని కొద్దికొద్దిగా బలహీనం చేస్కుంటూ వచ్చారు!
నిజానికి ఎప్పుడయితే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి?
ఎవరికీ వారే అన్నట్టు చిన్న కుటుంబాలుగా విడిపోతూ వచ్చారో, ఆనాటి నుండే ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్లకు కష్టాలు మొదలయ్యాయి! సమాజంలో వృద్ధాశ్రమాలు మొదలయ్యాయి! నిజానికి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అసలు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా లేవు! ఇప్పుడున్నవన్నీ చిన్న కుటుంబాలే, పెళ్లి అయిన మరుక్షణం వేరు కాపురాలే! పోనీ ఈ చిన్ని కుటుంబాలు వల్ల సమాజం అద్భుతంగా ఉందా అంటే, చిన్న కుటుంబాలలో మొగుడు పెళ్ళాలే సరిగ్గా కలిసి ఉండట్లేదు!
వాళ్ల మధ్య గొడవ వస్తే సర్దిచెప్పే పెద్దవాళ్ళు ఉండరు ఇంట్లో! పిల్లల్ని కంటే చూస్కునే వాళ్ళు లేక, ఒకర్ని కనేసి చేతులు ఎత్తేయడం! వయసు అయిపోయిన పెద్దలను చూసుకోలేక వృద్ధాశ్రమాలులో వదిలేయడం! చివరికి ఎటుచూసినా విచ్చలవిడితనం విశృంఖలతే పరమావధి అన్నట్టు తయారయింది ఈనాటి సమాజం!
అన్ని విషయాల్లో అన్నదమ్ములు ఒకమాటపై ఉండేవారు, ఇప్పుడు మాదిరిగా, వయసైపోయిన తల్లితండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలెయ్యడం లాంటివి అప్పట్లో అసలు ఉండేవి కాదు. ఇంటి కట్టుబాట్లు సంప్రదాయాలు లాంటివి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తరతరాలుగా పాటిస్తూ వచ్చేవారు. చిన్నవాళ్లు పెద్దవాళ్ళను గౌరవించడం అనేది కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే బాగా ఉండేది.
సుందరమైన ఉమ్మడి కుటుంబం |