కోవిడ్ ను తరుముతున్న ఆవిరి వైద్యం
కరోనా నియంత్రణలో ఇప్పుడు సంప్రదాయ వైద్యానికే జేజేలు పలుకుతున్నారు. భారతీయ సంప్రదాయాల్లో ఆనాదిగా ఉన్న ఆవిరి పట్టే పద్దతి ది బెస్ట్ గా వైద్యనిపుణులు అనేక పరిశోధనలు చేసి తేల్చారు.. దేశంలోని పలువురు నిపుణులతో పాటు ఇతర దేశాల్లోనూ దీనిపై అధ్యయనాలు జరగ్గా, ఇపుడు ఆవిరికి కరోనా వైరస్ను తగ్గించగలిగే కతిఉందని తేల్చారు. కరోనా రోగులపై ఆవిరి పట్టే పద్దతిని అమలుచేయగా, వారంరోజుల్లోనే ఇది గణనీయ ప్రభావం చూపుతోందని, వైరస్ను తగ్గించగలిగిందని పరిశోధనల్లో తేలిందట. ముంబైకు చెందిన ఓ వైద్యుడు కూడా మూడునెలల పాటు రోగులపై దీనిని పరిశీలించి స్టీమ్ థెరపీ గొప్పతనంపై అంచనా కొచ్చారు.ఎవరిపై ఎలా పనిచేస్తుంది?
- ➧ మొదటి గ్రూపులోని లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడుసార్లు ఆవిరిచికిత్సచేయగా, మూడు రోజుల్లోనే కోలుకున్నారు.
- ➧ లక్షణాలుండి తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ప్రతి మూడుగంటలకోసారి ఐదునిమిషాలు ఆవిరిపట్టగా వారంలో సాధారణ సిత్తికి వచ్చారు.
- ➧ కొన్నిరకాల క్యాప్సూల్స్, అల్లం, పతంజలి బామ్, పతంజలి దివ్య ధార ఇలా కొన్నింటితో ఆవిరిపట్టడం వల్ల ప్రయోజనం బాగా ఉంటోంది.
- ➧ మొత్తంగా లక్షణాలు లేని వారు ఆవిరి మంత్రం వల్ల వారంరోజుల్లో పేకోలుకుంటుండగా, లక్షణాలున్న వారు వారం నుండి పదిరోజుల్లో కోలుకుంటున్నారట.
- ➧ మే, జూన్ మాసంలో పలు మందులు అందుబాటులోకి రావడంతో పాటు అనేక క్లినికల్ ట్రయల్స్
- ➧ జరగ్గా, అదే పద్దతిలో ఆవిరి ప్రభావంపై కూడా జాగ్రత్తగా అధ్యయనాలు చేశారు. ఫలితం అద్భుతంగా ఉందని వైద్యనిపుణులు ఉత్సాహపడుతున్నారు.
- ➧ ఆవిరివల్ల శ్లేశ్మం తొలగించబడి నాసిరారంధ్రాలు గొంతు స్వేచ్చగా గాలిపీల్చుకునే వెసులుబాటు కలిగిస్తాయి. ముక్కు, గొంతులో శ్వాసమార్గాలను స్వేచ్చాయుతం చేస్తాయి.
- ➧ 70నుండి 80డిగ్రీల సెంటిగ్రేడ్ ఆవిరితో కొవి వైరస్ చనిపోతున్నట్లు తేలిందని, వైరస్ తగ్గి తోలుకున్న తర్వాత వీరి ద్వారా ఇతరులకు సోకలేదని కూడా నిర్ధారణ జరిగినట్లు పరిశోధనలు చేసిన వైద్యనిపుణులు చెబుతున్నారు.
గమనిక:
పైనుదహరించిన ఆరోగ్య సూచనలు అవగాహన కొరకే, మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించగలరు.