శ్రీ శంకరాచార్యుల చరిత్ర
శ్రుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్
శంకరుల జననం:
కేరళ రాష్ట్రమునందు పూర్ణానదితీరమున కాలటియను గ్రామము కలదు. దాని సమీపముననే వృషాచలము అను పర్వతము గలదు. |గ్రామమునకు ఉత్తరమున ఒక మైలు దూరమునందు దుర్గామందిరము, శివాలయమును గలవు, ఆ గ్రామమున శివగురువు, ఆర్యాంబ అను బ్రాహ్మాణ నిపసించుచుండిరి. వీరిది ఆత్రేయస గోత్రము.ఈ దంపతులకు చాలా కాలము వరకు సంతానముకలుగ లేదు. శివగురువు సంతానమునుగోరి వృషాచలముమీ ద నియమ నిష్ఠలతో తపస్సు చేసెను. ఆ తపమునకు మెచ్చిన పరమశివుడు శివ గురువునకు స్వప్నమున కనిపించెను. 'అజ్ఞులు చిరంజీవులగు బహుపుత్రులు కావలయునా, సర్వజ్ఞుడు, అల్పాయువు అగు ఒక కుమారుడు కావలయునా?', అని అడిగెను. శివ గురువు సర్వజ్ఞుడయిన అల్పాయువునే కోరెను.
ఆర్యాంబ గర్భము ధరించెను. క్రీ. పూ. 509వ సంవత్సరమున విభవనామ సంవత్సర వైశాఖ శుక్ల పంచమినాడు శంకరులు రవి కుజ శనులు ఉచ్చయందుండగ కర్కాటక లగ్నమున జన్మించిరి.
శంకరుల విద్యాభ్యాసం:
శ్రీ శంకరులు రెండవయేటనే చదువుట వ్రాయుట నేర్చి రి. మూడవయేట కావ్యపఠనము చేసిరి. ఈ వయస్సు నందే తండ్రి చూడాకర్మచేసి దివంగతుడయ్యెను.
"బ్రహ్మవర్చస కామస్య కార్యం విప్రన్య పంచమే" యను శాస్త్రము ననుసరించి శంకరులకు అయిదవ యేటనే ఉపనయనము జరిగెను. వారు గురుకులమున వేద వేదాంగములను చదివి ఏడవయేట యింటికి తిరిగి వచ్చిరి.
శంకరుల దివ్య చరిత్రము
బాల్యమున శంకరులు దేవినిపూజించి పాలను నివేదన చేసిరి. దేవి పాలను స్వీకరించలేదు. దేవికి తన పై కోపము కలిగినదని శంకరులు విలపించిరి. దేవి ప్రత్యక్షమై బాలశంకరుని తనయొడిలో కూర్చుండ బెట్టుకొని పాలను త్రాగించెను. అందుచేతనే శంకరులు సర్వ విద్యా ప్రసన్ను లయిరి.గురుకులమునంచు చదువు సమయమున శంకరులు భిక్ష కొరకు ఒక పతివ్రత యింటికి వెళ్ళిరి. దరిద్రు రాలగు అమె బ్రహ్మతేజస్సుగల శంకతులకు ఏమియు ఇవ్వజాల నందులకు మిగుల విలపించి ఒక ఉసిరిక మాత్రము అయన జోలెలో వేసెను. శంకరులు అమె పై దయగలవారై లక్ష్మీ దేవిని సుతించిరి, అమె అనుగ్రహించి బంగారు ఉసిరికలను కురిపించెను. ఆ సమయమున శంకరులు చేసిన స్తోత్రమునకే కనకధారా స్తవమని పేరు.
తల్లి ఆర్యాంబ ప్రతిదినము పూర్ణానదికి స్నానమునకు వెళ్ళుచుండెను. ఒక దినమున నడువ లేక మార్గములో పడిపోయెను, తల్లి పై భక్తిగల శంకరులు తన యోగశక్తిచే ఆ నదిని తన యింటి సమీపమునకు తీసుకొని వచ్చిరి ఆ సమయముననే శంకరులు ఆచార్యులుగ నుండిరి.
శంశరులవారి లోకోత్తర శక్తిని విని కేరళ ప్రభువు శంకరులను వారి ఆస్తానమునకు ఆహ్వానించిరి. వైరాగ్యము గల శంకరులు రాజసభకు వెళ్ళలేదు. ప్రభువే స్వయముగ శంకరులను దర్శించి తాము వ్రాసిన మూడు నాటకములను వినిపించిరి. శంకరులు అందలి విషయములను వివరణ చేయగా రాజు సంతసించి సహృదయముతో స్వీకరించెను ఆ మూడు నాటక ములు భస్మము కాగా శంకరులు మరల రాజునకు స్వయముగా వినిపించిరి.
ఒక దినమున శంకరులు పూర్ణానదిలో స్నానము చేయుచుండగ మొసలి పట్టుకొనెను. శంకరులు తల్లితో మొసలి నన్ను చంపుచున్నది. సంన్యాసాశ్రమమునకు అనుజ్ఞ ఇచ్చినచో మొసలి వదలి పెట్టునని చెప్పిరి. అమె అంగీకరించగా మొసలి వదలి వవెళ్లెను.
ఆ యర్దముగల శ్లోక మిటులున్నది
శ్లో|| నక్రోఒంబ మాం తు నయతి తీవ్రతను ర్భలాడ్యః
సంన్యస వేషకరణే మమాపి చ జీవితం స్వాత్
నంన్యస్య శ్రవణం కుర్యాత్ అను వచనము ననునరించి శంకరులు గురువుకొరకు వెదుక సాగిరి.
నర్మదానదీతీరమున ఓంకారనాధ క్షేత్రము గలదు. అచ్చ ట గోవింద భగవత్పాద యతీంద్రులు నివసించుచుండిరి. శంకరులు వారికి నమస్కరించి శిష్యునిగ స్వీకరింప వలసినదని ప్రార్ధించిరి. గోవిందపాదులు నీవు ఎవరు అని ప్రశ్నించిరి. శంకరులు తమ యద్వైత న్వరూపమును శోకములలో వినిపించిరి. ఆ సమయమున నే నిర్వాణషట్కం, నిర్వాణ దశకం, నిర్వాణమంజరి, నిర్దుణమానసపూజ, మొదలగు వానిని రచించిరి, శంకరులు వాక్యములకు సంతసించి గోవింద భగవత్పాదులు ప్రణవ సహితముగా దీక్ష నిచ్చిరి. శంకరులు అచ్చట రెండు సంవత్సరము లుండిరి
ఆ సమయమున ఏకధారగా అయిదు రోజులు వర్షము కురిసెను. నర్మదానదినీరు అ ఆశ్రమములోనికి వచ్చెను. నీటిని అరికట్టిరి. శంకరులు తన కమండలముతో ఆ నీటిని అరికట్టిరి. ఒక మట్టి పాత్రలో నీరంతయు నింపగల వారే తన బ్రహ్మ సూత్రములకు భాష్యము పవ్రాయుటకు సమర్థులనీ వ్యాస మహర్షి గురు గోవిందపాదులకు చెప్పియుండెను. అ విషయము గురువులు చెప్పగ శంకరులు గురువుల యనుమతి ననుసరించి వ్యాసమహర్షి ని దర్శించుటకు కాశీకేషేత్రమునకు బయలుదేరిరి. ఆ సమయమున శంకరులు గురుసుతిని చక్కగ శ్లోకములలో చేసిరి.
సర్వాణి పుణ్యతీర్థాని సేవ్యాన్యేవ ముముక్షుభిః అనియు, తీర్ది కుర్వంతి తీర్థాని, అను నారదవచనము అనుసరించియు, స్వయం. హి తీర్థాని పునంతి సంతః అను భాగవత వచనము నరుసరించి పుణ్య క్షేత్రములు ముక్తి ప్రదములు. ప్రత్యేకముగా కాశీ క్షేత్రమునకు ముక్తిక్షేత్రమునకు ముక్తిక్షే త్రమనియు, శివపురియనియు, |త్రిపురారి రాజనగరి అనియు పేరులు గలవు.
అట్టి క్షేత్రమునకు శంకరులు వ్యాసమహర్షి దర్శనము కోరి వెళ్ళిరి. అచ్చ ట అన్నపూర్ణావిశ్వేశ్వరుల దర్శనముచేసి వారిని స్తుతించిరి. ఒకరోజున గంగాస్నానముచేసి వచ్చు చున్న శంకరులకు పరమశివుడు ఛండాల వేషధారియై ఎదురు గావచ్చెను. శంకరులు అతనిని దూరముగా తొలగుమనిరి, ఆంతట ఛండాల వేషమున నున్న పరమశివుడు ఎవరిని తొలగమందువు? అన్న మ య శరీరమునుండి శరీరమునా? చైతన్యము నుండి చైతన్యమునా? గంగా జలము నందు, ఛండాల వాటిక యందలి గంగాజలాశయమునందు ప్రతి బింబించు సూర్యునికి భేదముండునా? అత్మయందు ఇతడు ఛండాలుడు ఇతడు విప్రుడు అను భ్రమ నీకెట్లు కలిగినది అని ప్రశ్నించెను. ఆ ఛండాలుడే విశ్వనాధుడని గ్రహించి శంకరులు మనీషాపంచకము చెప్పిరి.
ఆ విధము గ కాశీలో నివసిందు సమయమున శంకరులు ఎన్నియో దేవతాస్తో త్రములు అత్మబోథనలు అగు రచనలు చేసిరి.
శ్రీ శంకరులు కాశీనగరము నుండి శిష్యులతో బయలుదేరి హరిద్వార హృషి కేశములమీదగ బదరీ క్షేత్రముచేరిరి. అచ్చటనే భాష్యములను రచించిరి. బదరీ నుండి తిరిగి వచ్చి కాశీనగరములో నివసించు నమయమున ఒక వృద్ద బ్రాహ్మణుడు వచ్చి బ్రహ్మసూత్రములయందలి తదనంతర ప్రతి పత్తా అనుసూతమును వివరించవలసినదనికోరి8ి. ఆ సమయమున వారిద్దరకు ఎనిమిదిరోజులు వాదము జరిగెను. పద్మ పాదులు ఆ బ్రాహ్మణుని వ్యాసునిగ గుర్తించిరి. శంకరులు వ్యాసుని స్తుతించిరి. వ్యాసులు సంతసించి యిటుల అశీర్వదించిరి.
అష్టావయాంసి విధినా తవ వత్స దత్తా
న్యన్యాని చాప్ట భవతా సుధి యార్టితాని
భూయోఒపి షోడశ భవంతు భవాజ్ఞయా తే
భూయాశ్చ భాష్య వింద మా రవి చంద్ర తారకమ్ ||
అనగా శంకరుల ఆయువు ఎనిమిది సంవత్సరములు. వారు తపస్సు చే మరియొక ఎనిమిది సంవత్సరములు సంపాదించిరి. వ్యాసులు మరియొక పదియారు సంవత్సరములు "అనుగ్రహించిరి. భాష్యము సూర్యచంద్రులున్నంత వరకు 'నిలుచునని చెప్పిరి.
శంకరులు కుమారిలభట్టుతో వాదన చేయుటకు ప్రయాగ నగరమునకు వచ్చిరి. కుమారిలభట్టు వైదికమతమును కర్మకాండను గట్టి పునాదులపై నిలబెలటైను. అయన ప్రచ్చన్న వేషములతో భౌద్ధుల నాశ్రయించి వారి విద్యలయందలి రహస్యములను తెలుసుకొని వారిని ఓడించెను. గురువులను తిరస్కరించిన దోషము పోవుటకు తన దేహమును అగ్నియందు అహుతి చేసుకొనుచుండెను. శంకరులు వారిని చూచి దగ్ధదేహమునకు స్వస్థత చేకూర్చగలనని చెప్పిరి. అందులకు కుమారిలభట్టు అంగీళరించక మండన మిశ్రునితో వాదన చేయవలసినదని చెప్పిరి.
శంకరులు మాహిష్మతీ నగరమునకు వెళ్ళి మండన మిశ్రుల గృహమును గురించి విచారించగా నగరవాసులు ఇటుల చెప్పిరి. మండన మిశ్రుని గృహప్రాంగణమున చిలుకలు 'స్వతః ప్రమాణం పరతః ప్రమాణమ్' అని వాదనచేయుచుండును. శంకరులు వెళ్ళిన సమయమున మండనమిశ్రులు శ్రార్ధము పెట్టుచుండిరి. వ్యాస, జైనమహర్షులు భోక్తలుగా నుండిరి. తలుపులు మూసియుండుట చే శంకరులు ఇంటి కప్పులో నుండి లోనికి వెళ్ళిరి. శంకరుల రాకను చూచి మండనుడు కోపగించుకొనెను. భోక్తలు శ్రాద్ధమును శాంతముతో పెట్టవలయుననియు యతిని సత్కరించి భిక్ష పెట్టమనియు చెప్పిరి. మండన మిశ్రుడు భిక్ష స్వీకరించవ లెనని కోరగా శంకరులు వాధభిక్ష నడిగిరి. మండన మిశ్రుడు అంగీకరించెను. మండనమి శ్రుని భార్య ఉభయభారతి మధ్యవర్తిగా ఉండెను. అమె వారిద్దరికంఠములను పూల దండలతో నలంకరించి. ఓడిన వారి దండ వాడిపోవునని చెప్పెను. ఓడినవారు గెలిచిన వారి మూత్రమును స్వీకరించ వలయునని పణముగా పెట్టుకొన్నిరి. అనేక దినములు వాదన జరుగగా మండన మిశ్రుని మెడలోని దండ వాడిపోయెను. సంన్యాసము స్వీకరించవలసిన వాడయ్యెను. ఉభయభారతి విషయము గ్రహించి ఇద్దరిని భిక్ష చేయవలసినదని పిలిచెను. అంతకు పూర్వము మండన మిత్రుని వైశ్వదేవమునకు శంకరులను భిక్షకు పిలుచు చుండెను.
ఉభయభారతి తననుకూడ ఓడించిననేకాని తనభర్తను ఓడించినటుల కాదనియు కా మశాస్త్రమి. తనతో వాదించమనియు శంకరులను కోరినది. శంకరులు తనకు కామశాస్త్రములో పరిచయము లేదనియు నెలరోజులు గడువు కావసినదనియు కోరిరి. ఉభయభారతి ఆంగీకరించెను.
ఆ సమయమున 'ఆ దేశమునేలు రాజు మరణించెను ఆయన శవమును దహనము చేయుటకు శ్మశానమునకు తీసుకొని వెళ్ళిరి. శంకరులు ఆ విషయమును గ్రహించి తన శరీరమును ఒక గుహయందు భద్రపరచుకొని రాజుశరీరమునందు ప్రవేశించిరి తన శరీరమునకు ప్రమాదము సంభవించినపుడు తనను ప్రార్థించవలసినదని శిష్యులతో జెప్పిరి.
రాజు శవమునందు ప్రాణము వచ్చుటచే రాజు మరలబ్రతికనని అందరు తలచిరి. రాజుభార్య మాత్రము ఎవరో మహాయోగి తన భర్త శరీరములో ప్రవేశించెను. అని తెలుసు కొనెను. దహనము చేయని శరీరములు ఎచ్చట నైనను ఉన్నచో దహనము చేయవలసినదని సేవకుల కాజాపించెను. సేవకులు శవము కొరకు వెదుక నారంభించిరి. ఈ లోపల శంకరులు ఆంతఃపుర స్త్రీలతో కలసి కామశాస్త్ర రహస్యములు తెలుసుకొనెను. సేవకులు శంకరుల శరీరమును కనుగొని దహనము చేయనారంభించిరి. శిష్యులు శంకరులను ప్రార్థించగ వారువచ్చి మరల తన శరీరములో ప్రవేశించిరి. అప్పటికే శరీరము సగము కాలి యుండెను. శంకరులు కరావలంబన క్షేత్రముచేయగా నృసింహస్వామి దయవలన స్వస్థత చేకూరెను.
ఉభయభారతి వాదమున ఓడిపోయెను. ఆమె బరహ్మ దేవుని పత్నియగు శారదాదేవి. ఒక సమయమున ఆమె దూర్వాసుని చూచి నవ్వెను. అందులకు ఆయన కోపించి మర్త్యలోకమున పుట్టవలసినదనిశపించి శంకరులవలన శాప విమోచన కలుగునని చెప్పిరి. శాప విమోచనము అయిన వెంటనే అమె నిజరూపముతో బ్రహ్మలోకమునకు బయలుదేరెను, శంకరులు అమెను వనదుగ్గామంత్రముతో బంధించి లోకోపకారమున కై భూలోకమున ఉండవలసినదని ప్రార్ధించిరి, అందులకు ఆమె అంగీకరించి మీరు ముందు నడచుచుండగ నేను వెనుక వతును. మీరు వెనుక తు మరలి చూచినచో అచ్చటనే నిలచి పోదునని చెప్పెను.. అందులకు శంకరులు అంగీకరించి ముందు నడచుచుండిరి. శారదాదేవి ఆదృశ్యరూపమున ఆయన వెనుక నడచుచుండెను. అమె నూపుర ధ్వనులు వినుచు శంకరులు ముందు నడచుచుండిరి. శృంగేరీ ప్రాంతమున అమె నూపురధ్వని వినిపించలేదు శంకరులు వెనుక కు తిరిగిచూచిరి. శారదాదేవి అచటనే నిలిచి పోయెను.
ఆర్యాంబకు తుదిమడియలు సమీపిం చెను. శంకరులు తల్లి సమీపమునకు చేరి వేదాంత తత్త్వమును బోధించిరి, శివ విష్ణు సుతులు చేసిరి. అమె మరణించగా అంత్యక్రియలు స్వయముగా చేసిరి. అటుపిమ్మట దక్షిణదేశ మునందలి అన్ని క్షేత్రములు దర్శించి దేవతాస్తుతులు చేసిరి.
శ్రీ శంకరులు దేశాటన చేయుచు శ్రీ శెలము చేరిరి. ఒక కాపాలికుడు శంకరునివద్ద చేరి వేదాంతపఠనముచేసెను. అతడు ఒక దినమున నేను చేయుచున్న భైరవారాధన సఫలము అగుటకు యతీశ్వరుని శిరమును హోమము చేయవలసి యున్నది. మీ శిరమును ఇవ్వవలసినదని శంకరులను ప్రార్థించెను. శంకరులు వారి శిష్యులు దగ్గరలేని సమయమున నా శిరము ను తీసుకొనవలసినదని చెప్పిరి. కాపాలికుడు తగిన సమయముకోసము చూచి తీసుకొనబోవు చుండెను ఇంతలోపద్మపాదులు నృసింహస్వామి' పూనిక తో అచటికి వచ్చి కాపాలికుని గోళ్ళతో చీల్ర్చి చంపెను. ఆ సమయమున శంకరులు పద్మపాదుని ఆవహించిన నృసింహ స్వామిని స్తుతించి శాంతింప చేసిరి.
శంకరులు శ్రీబలి యను గ్రామము చేరిరి. ఆచ్చట ప్రభాకరుడను బ్రాహ్మణుని కుమారుడు పిచ్చి వానివలె సంచరించుచుండెను. ప్రభాకరుడు అ కుమారుని శంకరులకు చూపిరి శంకరులు నీవు ఎవరని పశ్నించగా బాలుడు ఆ ద్వైతభావమును ప్రకటించెను. వెంటనే శంకరులు ఈ బాలుడు నా దగ్గర ఉండవలసినవాడని తండ్రితో చెప్పి తన వెంట తీసుకొని వెళ్ళిరి. అతనికి హస్తామలకుడని పేరు పెట్టిరి. ఇతని మొదటి పేరు పృథ్వీథరాబార్యుడు.
శంకరులు శాశ్వతముగ ధర్మమును రక్షించుటకై నాలుగు ధిక్కుల యందును నాలుగు పీఠములను సాపించిరి వాటి వివరములు ఈ విధముగ ఉన్నవి:
పూర్వా మ్నాయము - వేదము ఋగ్వేదము, మహా వాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ-గోత్రము కాశ్యప, కేషత్రము పురుషొ త్తమదేవుడు జగన్నాధుడు. మఠనామము. గోవర్ధన-ఆచార్యుడు' హస్తామలకుడు. కేంద్రము పూరిజగన్నాధము హస్తామలకుని చరిత్ర పూర్వము ప్రాయబడినది.
దక్షిణామామ్నాయము - వేదము యజుర్వేదము మహావాక్యము అహం బ్రహ్మాస్మి, గోత్రము భూర్భువః, తీర్థము తుంగభద్ర, క్షేత్రము రామక్షేత్రము. దేవుడు వరాహస్యామి, దేవత శారదా, మఠనామము శృంగేరీ శారద. ఆచార్యుడు సరేశ్వరుడు, కేంద్రము శృంగేరి, మండన మిశ్రుడే నురేశ్వరాబార్యులుగ ప్రసిద్ది చెందిరి.
పశ్చిమామ్నాయము - వేదము సామవేదము మహా కావ్యము, తత్త్వమసి, గోత్రము అనిగత, తీర్థము గోమతీ నది, క్షేత్రము ద్వారకానగరము. దేవుడు సిద్దేశ్వరుడు, దేవత భద్రకాళి, మఠనామము ద్వార కామఠము. ఆచార్యుడు పద్మపాదులు. కేంద్రము ద్వారక. గంగానది ప్రవహించు సమయమున శంకరులు పద్మపాడుని నది పై నడచి రమ్మనిరి. అయన నడుచు సమయమున పాదముల క్రింద పద్మములు ఏర్పడుటచే పద్మపాదులు అని పేరు పొందిరి.
ఉత్తరామామ్నాయము - వేదము, అథర్వవేదము, మహా వాక్యము అయమాత్మా బ్రహ్మ, గోత్రము భృగు, తీర్థము అల కానంద. క్షేత్రము బదరికాత్రమము. దేవుడు నారాయణడు, దేవత పూర్ణ గిరి. మఠనామము జ్యోతిర్మఠము, అచార్యుడు త్రోటకుడు, కేంద్రము బదరికావనము.
త్రోటకాచార్యులవారి మొదటి నామము గిరి, వీరు శంకరులను తోటక పృత్తములచే స్తుతించిర. అందువలన త్రోటకాచార్యులు అను సార్ధకనామమును పొందిరి.
శంకరుల ఆద్వైత సిద్ధాంతము
ఆచార్యుల వారు స్థాపించిన మతమునకు అద్వైతము అని పేరు, ఈ మతము వేదశాస్త్రనమ్మతమయి అనుభవవేద్యమై యున్నది. ఈ సృష్టియంతయు బ్రహ్మపదార్థము చే వ్యాప్తమై యున్నది. అయినను సామాన్యులకు వేరు వేరుగ కన్పించుట కు కారణము వారియందుగల అజ్ఞానమే. బంగారముతో చేసిన అభరణములకు, వేరు వేరు నామరూపములున్నప్పటికిని వానియందుగల బంగారము మాత్రము ఒక్కటే. అటులనే సృష్టియంతయు బ్రహ్మనికారమే గాని వేరుశాదు. బీజము నందు చెట్టునకుగల కొమ్మలు, అకులు, పూలు, కాయలు దాగియున్నటుల సృష్టికి పూర్వము ఈ పదార్థము లన్నియు బ్రహ్మయందు దాగియున్నవి. సత్కర్మాచరణము చే చిత్తశుద్దిని సంపాదించి వేదాంతశాస్త్ర శ్రవణమననాదులచే అజ్ఞానము తొలగినపుడు అంతయు బ్రహ్మమయముగా కన్పించును. ఈ ప్రపంచమంతయు స్వప్నతుల్యము, స్వప్నము పోయిన తరువాత స్వప్న మునందలి పదార్దములు కనిపించని విధమున అజానము తొలగిన తరువాత భేదఖావము నశించి అంతయు అత్మపదార్థముగా కనిపించును.
ఉప దేశ పంచకమ్
వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠియతాం
తేనేశస్య విధీయతా మపచితిః క్లామ్యేమతి స్తజ్యతామ్
పాపౌమః పరిధూయతాం భవసుఖే దోషో నుసంధీయతాం
అత్మే చ్ఛావ్యవసియతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యుతామ్ ||
నిత్యము వేదము చదువుము, వేదము చెప్పిన కర్మలను చేయుము, ఈశ్వరుని పూజింపుము. కోరికలను విడిచి పెట్టుము, పాపములను పరిహరించుము. సంసారము నందలి దోషము తెలిసికొనుము ఆత్మజ్ఞానమునకు ప్రయత్నించుము. ఇంటిని విడిచి బయటకు వెళ్ళుము.
సంగన్సత్సువిదీయతాం భగవతో భక్తిర్తృడాధీయతాం
శాంత్యాదిః పరిధీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతామ్
సద్వి ద్వానుపనర్ప్యతాం ప్రతిదినం తళ్పాదు కే సేవ్యతామె
బ్రహ్మై కాక్షరమద్ద్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్థ్యతామ్
సత్పురుషుల స్నేహము చేయుము. భగవంతుని యందు దృఢమయిన భక్తిని నిలుపుము. శాంతిని సాధింపుము, దుష్టకర్మలను విడిచి పెట్టుము. పండితుల దగ్గరకు వెళ్ళుము. వారి పాదములను సేవించుము. ఏకాక్షరమయిన ప్రణవమును యాచింపుము. వేదాంత శత్రవణము చేయుము,
వాక్యార్ధశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షస్సమాశ్రీయతాం
దుస్తర్కా స్సు విరమ్యతాం శ్రుతిమత స్తరోనుసంధియతాం,
బ్రహ్మైవాస్మి విభావ్యతామహరహః గర్వః పరిత్యజ్యతామ్
దేహేహమ్మతి రుజ్జ్యతాం బుధజనైర్వాదఃపరితయజ్యతామ్
వేదాంత వాక్యవిచారము చేయుము. వేదాంత పక్షమును ఆశ్రయించుము. దుష్టమయిన తర్కమును విడిచి వేదవిహిత మయిన తర్కమును చేయుము. రాత్రిం బవళ్ళు బ్రహ్మను అని భావన చేయుము. గర్వము విడిచి పెట్టుము. శరీరమునందు ఆత్మబుద్ధిని విడిచి పెట్టుము. పండితులతో వాదన చేయకుము.
క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివతాత్రాత్ప్తేన
...........సంతుష్యతామ్
శ్రీతోష్ణాది విషహ్యతాం న కు వృధావాక్యం సము చ్చార్యతాం
ఔదాసీన్య మభీప్ప్యతాం జనకృపానైష్ణుర్యముత్స్ృజ్యతామ్ ||
ఆకలియనున రోగము పోవుటకు భిక్షయను మందును తినుము, రుచికరములయిన అన్న మునకు ఆశపడకుము. దైవవశమున లభించినచో సంతసింపుము. వేడిని చలిని సహించుము. వ్యర్ధముగా మాటలాడకుము. ఉదాసీనుడవయి యుండుము. జనుల దయకు ఆశపడకుము.
ఏకాంతే సుఖమాన్యతాం పరతరే చేతస్సమాధీయ కాం
పూర్ణాత్మా సునమీూక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం
ప్రాక్కర్మప్రవిలాప్యతాం చితిబలా న్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబిస్త్విహ భుజ్యతా మధ పరబ్రహ్మాత్మనాస్థీయ తామ్
శ్లో|| యః శ్లోక పంచకమిదం పఠతే మనుష్య
సంచింత యత్యనుదినం స్థిర తాము పేత్య
తస్యాశు సంస్కృతి దవానల తీవ్ర ఘోర
తాఫః ప్రశాంతి ముపయాతి చితి ప్రసాదాత్ ||
ఈ అయిదు శ్లోకములను ప్రతిదినము స్థిరమయిన సమబుద్ధితో చదివి ఆలోచించిన వారికి అత్మ సాక్షాత్కారము వలన సంసారమనెడు దావాగ్ని నశించి శాంతి లభించును.
లింగాష్టకం
బ్రహ్మము రారి నురార్చితలింగం నిర్మలఖాసిత శోభితలింగం
జన్మజ దుఃఖవినాశక లింగం తత్ణ మామి సదాశివలింగం
దేవముని ప్రవరార్చితలింగం కామదళన కరుణాకర లింగం
రావణదర్పవినాశక లింగం తత్తణమామి సదాశివలింగం
సర్వనుగంధ ను లేపితలింగం బుద్ధి వివర్తన కారణలింగం
సిద్దసురాసుర వందితలింగం తత్రణ మా మి సదాశివలింగం
క నక మహామణిభూషితలింగం ఫణిపతి వేషిత శోభితలింగం
దక్షయ జ్ఞ వినాశసలింగం తత్ణమామి సదాశివలింగం
కుంకుమ చుదన లేపితలింగం పంకజహార సుశోభితలింగం
సంచితపాపవి నాశనలింగం తత్రణమామి నదాశివలింగం
దేవగ జార్చిత సేవితలింగం భావై ర్ృ క్లిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం తత్త్ణమామి సదాశివలింగం
అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముదృవ కారణ లింగం
అష్టదరి ద వినాశన లింగం తత్రణ మా మి సదాశివలింగం
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చితలింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్రణమామి సదాశివలింగం
లింగాష్టక మిదం పుణ్యం యః పఠేచ్చివ, సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన నహమోదతే
ఇతి లింగాష్కమ్
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి