అయోధ్య శ్రీరామ జన్మ భూమిలో భూమి పూజ జరిగిన ఈ రోజు కోసం యావద్దేశం ఎన్నాళ్ళగానో ఎదురు చూసింది. నేడు ఆ శుభఘడియ దేశంలోని ప్రతి హృదయమూ రామ భక్తితో పులకించిపోయింది. రామ నామ స్మరణతో తరించిపోయింది.
కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు వున్న లక్షలాది దేవాలయాలయాలలో అయోధ్య భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. కోట్లాది గృహాలలో జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయ్. అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్న సమయంలో రాజకీయ పార్టీలు, కులాలకు అతీతంగా ప్రజలు దేశంలోని ప్రతి ఇంటిలోనూ దీపాలు వెలిగించి తాము సైతం ప్రార్థనలలో మునిగిపోయారు. కొన్ని చోట్ల జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తే, కొన్ని చోట్ల శ్రీ రామ నామ జపం చేశారు.
మరికొన్ని చోట్ల హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఇలా ప్రజలు ఎవరికి తోచిన రీతిలో వారు తమ రామ భక్తిని చాటుకున్నారు. అలాగే నాగపూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందినా హైదరాబాద్, విజయవాడలలోని ప్రాంత కార్యాలయాలలో దీపాలను వెలిగించి ఈ చారిత్రాత్మక ఘట్టానికి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. వాటిలో మనకు అందుబాటులోకి వచ్చిన కొన్ని దృశ్యాలను ఓ సారి చూద్దాం.

నాగపూర్ RSS కార్యాలయంలో… |
కార్యక్రమాన్ని టీవీలో తిలకించి పులకించిపోతున్న ప్రధాని తల్లి |
హైదరాబాదులోని ప్రాంత కార్యాలయం వద్ద పూజ నిర్వహిస్తున్న RSS అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ మాననీయ శ్రీ భాగయ్య |
విజయవాడ ప్రాంత కార్యాలయం వద్ద దీపాలు, బాణాసంచా |
గుంటూరు కార్యాలయంలో…. |
తిరుపతి కార్యాలయంలో…. |
విశాఖపట్నం కార్యాలయంలో… |
కర్నూలు కార్యాలయంలో… |
నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట మండలం కోటపోలూరు రామాలయంలో… |