పరమాత్మ ఎవరు?
ఓం ׀׀ ఆత్మా వ ఇదమేక ఏవాగ్ర ఆసీన్నాన్యత్ కించన మిషత్ ׀
స ఈక్షత లోకాన్ను సృజా ఇతి ׀׀ (ఐతరేయోపనిషత్ 1:1)
ఈ సృష్టి జరగక ముందు ఒకే ఒక శక్తి మొత్తం అంతయు ఉండింది. అంటే ప్రారంభంలో భగవంతుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. నేను లోకాలను సృష్టిస్తాను అని అనుకున్నాడు సృష్టించాడు.
సృష్టి ఆరంభమునకు ముందు అంతయూ శూన్యమే. ఎక్కడను ఏమియు లేదు. సృష్టి అరంభమవగానే శూన్యము నుండి శక్తి బయల్పడి అది వ్యాపింప నారంభించెను. ఆవిధంగా శూన్యము నుండి లక్షల కోట్ల సౌర మండలాలు ఉద్భవించి వాటిలో ప్రకృతి , పెక్కు చరాచరులు, జీవరాశులు ఏర్పడినవి.
స ఈక్షతేమే ను లోకా లోకపాలాన్ను సృజా ఇతి ׀ సో ద్భ్య ఏవ పురుషం
సముద్ధ్రుత్వా మూర్ఛయత్ ׀׀ (ఐతరేయోపనిషత్ 1:౩)
లోకాలను సృస్తిచేశాను. ఇక లోకరక్షకులను సృష్టిస్తాను. అని అయన అనుకున్నాడు. ఆ విధంగా బ్రహ్మ దేవుణ్ణి సృష్టించాడు. ఆయన నుండి సమస్త జీవరాశులు పుట్టినవి.
మొదట ఆరంభంలో శూన్యం నుండి (అంటే శక్తి) నుండి పంచభూతాలు సృష్టించబడినవి. అంటే ఈ పంచభూతాలు కూడ ఆ భగవంతుడే. ఈ చరాచర జీవ రాసులు మొత్తం ఆ భగవంతుడే. మనకు కనిపించే ప్రతిది ఆ భగవంతుడే. ఆయనే ప్రకృతి అయి (ప్రకృతి రూపంలో) ఉన్నాడు. అంటే అయన కాకుండా ఈ చరాచర జగత్తులో ఏదియును లేదు.
మయాద్యక్షేణ ప్రకృతిం సూయతే సచరాచరం !
హేతునాణేణ కౌన్తేయ జగద్విపరివర్తతే !! (భగవద్గీత : 9:10)
నా అద్యక్షతన భౌతిక ప్రకృతి చరచారాలను (ప్రాణుల్ని) సృస్టించును . ఆ కారణంగా జగత్తు పనిచేయుచున్నది.
స ఏతమేవ సీమానం విదార్యేతయా ద్వారా ప్రాపద్యత ׀ సైషా విద్రుతిర్నామ ద్వాస్త
దేతన్నాన్దనం ׀ తస్య త్రయ ఆవసథా: త్రయ: స్వప్నా: అయమావసథొ యమావస
థొ యమావస ఇతి ׀׀ (ఐతరేయోపనిషత్ 2:12)
భగవంతుడు తన నుండే పంచభూతాలను సృష్టించి అందు నుండే ఎన్నో చరాచర జీవులను మరియు మనిషిని సృష్టించాడు. ఆ తరువాత సృష్టించబడిన అన్నిటికి ఒక శక్తీ కావాలి (ఎందుకంటే అవి నిర్జీవమైనవి కదా, అవి ప్రకృతి నుండి ఉద్భవించబడినవి).అందువలన ఆ భగవంతుడే వాటి అన్నిటిలోనూ ప్రవేశించాడు. (అంటే సముద్రము నుండి ఒక నీటి బిందువును పక్కకు తీస్తే అది సముద్రము నీటికి ఏవిదంగా సమానమో) ఆ విధంగా ఈ చరాచర జీవులలో మరియు మన శరీరాలలో వున్న ఒక ఆ దివ్య శక్తీ ఆ భగవంతుడే.
భగవంతుడు మనిషి నడినెత్తి చీల్చుకొని , ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించాడు. ఆ ద్వారం పేరే విద్రుతి. ఆయన విద్రుతి అనే ద్వారం గుండా మన శరీరంలో ప్రవేశించి ఉన్నాడు.
స జాతో భుతాన్యభివైక్ష్యత్ కిమిహన్యం వావదిషదితి ׀ స ఏతమేవ పురుషం
బ్రహ్మ తతమమపశ్యత్ ׀ ఇదమదర్శమితి ׀׀
మనిషిగా జన్మించిన అతడు మాత్రం తక్కిన జీవరాసుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు (ఎందుకంటే భగవంతుడు మనిషికి బుద్దిని ప్రసాదించాడు) ఆలోచించటానికి ఏముంది . శరీరంలో కొలువైన ఆత్మే సర్వత్ర వ్యాపించి, భగవంతుడుగా ఉండడాన్ని అతడు చూసాడు. దీనిని నేను కనుగొన్నాను అని ఆశర్యబోతూ చెప్పాడు.పరమాత్మ అంటే ఒక శక్తి అనగా నిరాకారుడు ఆకారం లేనివాడు, నిర్గుణుడు అంటే ఎటువంటి గుణాలు లేనివాడు, సత్యుడు అంటే ఎప్పటికి నిలిచి వుండే వాడు, శాశ్వతుడు, నశ్వరుడు అంటే నాశనమ లేనివాడు, జనన మరణములు (పుట్టుక అంటూ) లేనివాడు, నిత్యుడు అంటే నిత్యమూ వుండే వాడు అన్నిటికి మించి తానే జ్ఞాన స్వరూపుడు అంటే అయన దివ్య దర్శనంతో మాత్రమే మనం సంపూర్ణ దివ్య జ్ఞానాన్ని సంపాదిస్తాము అంటే ఆ భగవంతునిని మన శరీరం అంతరంలో(హృదయంలో) సాధన (ధ్యానం) ద్వార దర్శించడమే.
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి