ఆగస్టు 6 వ తేదీ గురువారం, ఏప్రిల్ 16 న పాల్ఘర్లో ఇద్దరు హిందూ సాధువులను, వారి డ్రైవర్ను దారుణంగా హత్య చేసిన కేసులోని ప్రస్తుత పరిస్థితి ఎలావుందో నివేదిక సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లను సమర్పించాలని మరియు ఇద్దరు హిందూ సాధువులను హింసాత్మక గుంపుకు అప్పగించిన పోలీసు సిబ్బందిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దర్యాప్తును సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ, పోలీసులు జూలై 29 నాటి అఫిడవిట్ దాఖలు చేసారని, "ఇది జూలై 2020 లో రెండు చార్జిషీట్లు దాఖలు చేయబడిందని పేరా 3 లో పేర్కొంది", ఇందులో "పోలీసు సిబ్బందిపై డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించి వారికి నోటీసులు కూడా జారీ చేయబడ్డాయి".

"రాష్ట్రం చార్జిషీట్లను రికార్డులోకి తీసుకురండి ...పోలీసు సిబ్బందిపై తీసుకున్న చర్యలతో పాటు విచారణ నివేదికతో సహా విచారణ వివరాలను కూడా రికార్డులోకి తీసుకురండి ”అని ధర్మాసనం తెలిపింది.
పాల్ఘర్ సాధువుల హత్యోదంతం |
పాల్ఘర్ హత్యోదంతంపై సిబిఐ, ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ రెండు పిటిషన్లు దాఖలు:
సాధువులను దారుణంగా హతమార్చడంపై సిబిఐ మరియు ఎన్ఐఏ ప్రత్యేక దర్యాప్తు కోరుతూన్న 2 పిటిషన్ను ఉన్నత కోర్టు విచారించింది. సిబిఐ, ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కోరింది.
మొదటి పిటిషన్ "శ్రీ పంచ డాష్బన్ జునా అఖారా" సాధువులు మరియు మరణించిన వారి బంధువులు దాఖలు చేశారు. ఇందులో మహారాష్ట్ర పోలీసులు పక్షపాతంతో దర్యాప్తు జరుపుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ మరో పిటిషన్ను ఘన్ష్యామ్ ఉపాధ్యాయ్ దాఖలు చేశారు.
మూలము: Opindia
అనువాదము: తెలుగు భారత్